MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్, మహేష్ బాబుతో ఐటమ్ సాంగ్స్ చేసి వారికే తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. మూవీ నుంచి ఒక సాంగ్ డిలీట్

ప్రభాస్, మహేష్ బాబుతో ఐటమ్ సాంగ్స్ చేసి వారికే తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. మూవీ నుంచి ఒక సాంగ్ డిలీట్

హీరోయిన్లు తమ కెరీర్ లో భాగంగా అన్ని రకాల పాత్రల్లో నటించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు విచిత్రమైన కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటాయి. కథకు తగ్గట్లుగా తమను తాము మార్చేసుకుని ఆ పాత్రల్లో కొందరు హీరోయిన్లు ఒదిగిపోతుంటారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 11 2025, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Asianet News

హీరోయిన్లు తమ కెరీర్ లో భాగంగా అన్ని రకాల పాత్రల్లో నటించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు విచిత్రమైన కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటాయి. కథకు తగ్గట్లుగా తమను తాము మార్చేసుకుని ఆ పాత్రల్లో కొందరు హీరోయిన్లు ఒదిగిపోతుంటారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ అయితే ఆల్ రౌండర్ అనే చెప్పాలి. గ్లామర్ గా కనిపించినా, పొగరుబోతు అమ్మాయిగా నటించినా, ఎమోషనల్ సీన్స్ లో కంటతడి పెట్టించినా ఇలా అన్ని రకాల పాత్రలు చేయడం ఆమెకే చెల్లింది.

25
Image Credit : Youtube Screen shot

అందుకే రమ్యకృష్ణ దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో నటిగా రాణిస్తున్నారు ప్రస్తుతం రమ్యకృష్ణ కి హీరోయిన్ గా నటించే వయస్సు లేనప్పటికీ బాహుబలి చిత్రంలో శివగామి లాంటి అద్భుతమైన పాత్రలు ఆమెకు దక్కుతున్నాయి. ప్రస్తుతం రమ్యకృష్ణ తల్లి, అత్త తరహా పాత్రల్లో రాణిస్తున్నారు.

Related Articles

Related image1
హీరోగా నటించకుండానే 80 కోట్లు సంపాదిస్తున్న నాగార్జున.. బిగ్ బాస్ 9కి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?
Related image2
ఆ పెళ్లి గురించి ఎత్తగానే అలీపై మండిపడ్డ మోహన్ బాబు.. అది ఆయన వ్యక్తిగత జీవితం, మాట్లాడొద్దు అంటూ వార్నింగ్
35
Image Credit : our own

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు లతో రమ్యకృష్ణ విచిత్రమైన కాంబినేషన్స్ లో నటించింది. రమ్యకృష్ణ చాలా ఏళ్ల క్రితం వీళ్లిద్దరి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. అప్పట్లో టాలీవుడ్ లో రమ్యకృష్ణ గ్లామర్ క్వీన్ గా ఉండేవారు. దీంతో ఆమెకి స్పెషల్ సాంగ్స్ లో కూడా అవకాశాలు వచ్చేవి. ప్రభాస్ అడవి రాముడు చిత్రంలో రమ్యకృష్ణ 'జంటను విడదీసే' అనే స్పెషల్ సాంగ్ లో నటించారు.

45
Image Credit : our own

కానీ ఆ తర్వాత బాహుబలి చిత్రంలో ప్రభాస్ కి తల్లిగా నటించడం విశేషం. శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటన గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. ఇలాంటి కాంబినేషన్ మహేష్ బాబుతో కూడా రిపీట్ అయింది. మహేష్ బాబు 'నాని' చిత్రంలో రమ్యకృష్ణ 'మార్కండేయ' అనే స్పెషల్ సాంగ్ చేసింది. గ్లామరస్ గా కనిపిస్తూ మహేష్ బాబుతో డాన్స్ అదరగొట్టింది. కానీ ఈ సాంగ్ ని థియేటర్ రిలీజ్ నుంచి డిలీట్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

55
Image Credit : Instagram/Ramya Krishnan

మహేష్ తో స్పెషల్ సాంగ్ చేసిన రమ్యకృష్ణ.. గుంటూరు కారం చిత్రంలో అతడికి తల్లిగా నటించింది.అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఏ పాత్రలో కనిపించినా ఆ పాత్రకి తగ్గట్లుగా తనని తాను మార్చుకోవడం రమ్యకృష్ణ ప్రత్యేకత.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
మహేష్ బాబు ఘట్టమనేని
ప్రభాస్
రమ్య కృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
మెగాస్టార్ చిరంజీవి ఫేవరెట్ సీరియల్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
Illu Illalu Pillalu: నోరు జారి.. లంచం ఇచ్చి ఉద్యోగం కొన్న నిజం బయటపెట్టిన సాగర్, వల్లి మరో కుట్ర
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యోను ఎడాపెడా వాయించిన పారు- ఇంట్లో నుంచి వెళ్లిపోతానన్న కాంచన
Related Stories
Recommended image1
హీరోగా నటించకుండానే 80 కోట్లు సంపాదిస్తున్న నాగార్జున.. బిగ్ బాస్ 9కి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?
Recommended image2
ఆ పెళ్లి గురించి ఎత్తగానే అలీపై మండిపడ్డ మోహన్ బాబు.. అది ఆయన వ్యక్తిగత జీవితం, మాట్లాడొద్దు అంటూ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved