MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ పెళ్లి గురించి ఎత్తగానే అలీపై మండిపడ్డ మోహన్ బాబు.. అది ఆయన వ్యక్తిగత జీవితం, మాట్లాడొద్దు అంటూ వార్నింగ్

ఆ పెళ్లి గురించి ఎత్తగానే అలీపై మండిపడ్డ మోహన్ బాబు.. అది ఆయన వ్యక్తిగత జీవితం, మాట్లాడొద్దు అంటూ వార్నింగ్

అలీ టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా దశాబ్దాల నుంచి రాణిస్తున్నారు. హీరోగా, కమెడియన్ గా సత్తా చాటిన అలీ బుల్లితెరపై కూడా హోస్ట్ గా తనదైన ప్రత్యేకత చాటుకున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 11 2025, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Youtube/Etv

అలీ టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా దశాబ్దాల నుంచి రాణిస్తున్నారు. హీరోగా, కమెడియన్ గా సత్తా చాటిన అలీ బుల్లితెరపై కూడా హోస్ట్ గా తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. అలీతో సరదాగా షోకి అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అలీతో సరదాగా షోకి చాలామంది సెలబ్రిటీలు అతిథులుగా హాజరయ్యారు.

25
Image Credit : Youtube/Etv

250వ ఎపిసోడ్ కి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గెస్ట్ గా హాజరై తన కెరీర్ విశేషాలను అలీతో పంచుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి చర్చ జరిగింది. మోహన్ బాబు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. అన్నయ్య మనసులో ప్రేమను సంపాదించుకునే అవకాశం నాకు దక్కింది. దానిని ఈ జీవితానికి గొప్ప వరంగా భావిస్తాను.

మేజర్ చంద్రకాంత్ చిత్రాన్ని అన్నయ్యతో తీయాలనుకున్నప్పుడు వెళ్లి అడిగితే మొదట ఆయన వద్దన్నారు. ఆ తర్వాత రిక్వెస్ట్ చేయడంతో అంగీకరించారు. ఆ విధంగా మేజర్ చంద్రకాంత్ చిత్రం రూపొంది అఖండ విజయం సాధించింది అని మోహన్ బాబు అన్నారు.

Related Articles

Related image1
పవన్ తో రెండు సినిమాలని రిజెక్ట్ చేసిన నమ్రత, ఎందుకో తెలుసా.. ఒకటి సూపర్ హిట్, మరొకటి డిజాస్టర్
Related image2
ఉదయభాను మొదటి పెళ్లి గురించి లీక్ చేస్తానని ఆమె తల్లే ఎందుకు బెదిరించింది? నరకం అనుభవించిన స్టార్ యాంకర్
35
Image Credit : Youtube/Etv

మేజర్ చంద్రకాంత్ చిత్ర వంద రోజులు వేడుకలు ఒక ఊహించని సంఘటన జరిగింది. ఆ సంఘటనకి కారకులు మీరే అని.. ఆ పెళ్లికి పెద్ద మీరే అని ఒక ప్రచారం ఉంది.. అందులో నిజం ఎంత అని అలీ.. ఎన్టీఆర్, లక్ష్మి పార్వతి వివాహం గురించి మోహన్ బాబుని ప్రశ్నించారు. ఈ ప్రశ్న అడగగానే మోహన్ బాబు చిరాకు పడ్డారు. అలీతో సరదాగా అంటే ఏదో సరదాగా ఉంటుందని అనుకున్నా.. ఇలాంటి ప్రశ్నలు ఊహించలేదు. ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. కానీ అది ఇప్పుడు అనవసరం.

45
Image Credit : Instagram

అది అన్నయ్య వ్యక్తిగత విషయం. ఆరోజు ఫంక్షన్ లో ఆయన అనౌన్స్ చేసిన మాట నిజమే. అయితే అది ఆయన పర్సనల్ మ్యాటర్. దాని గురించి మనం మాట్లాడకూడదు. ఎవరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు మనకి లేదు అని మోహన్ బాబు అన్నారు. ఆ పెళ్లికి కారకులు మీరే అని ప్రచారం ఉంది కదా దానికి ఏమంటారు అని మరోసారి ప్రశ్నించారు. దీంతో మోహన్ బాబు అసహనం వ్యక్తం చేశారు.

55
Image Credit : Asianet News

దారిన పోయే కుక్కలు అరుస్తూ ఉంటాయి. ప్రతి కుక్కకి సమాధానం చెబుతూ వెళితే మన గమ్యం చేరుకోలేం చెప్పారు. అన్నయ్య ఆయన అభిప్రాయాన్ని నాతో చెప్పారు.. కాబట్టి ఆయనకి ఏం చేయగలనో అది చేశాను. ఆయన మాటని నేను ఎప్పుడూ కాదనను. కానీ అది పూర్తిగా ఆయన వ్యక్తిగత వ్యవహారం అని మోహన్ బాబు అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
నందమూరి తారక రామారావు
మంచు మోహన్ బాబు

Latest Videos
Recommended Stories
Recommended image1
పెళ్లి పెటాకులు లేవంటూ.. ప్రభాస్ ముఖం మీదే అన్న స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎందుకలా అన్నాడంటే?
Recommended image2
O Romeo Cast: 'ఓ రోమియో' స్టార్స్ ఆస్తులెంత? షాహిద్, తృప్తి, తమన్నా.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంది?
Recommended image3
Kadhalar Dhinam: భారతీయుడు సినిమాను మించిన బడ్జెట్, యువతకు పిచ్చెక్కించిన ఆ లవ్ స్టోరీ ఇదే!
Related Stories
Recommended image1
పవన్ తో రెండు సినిమాలని రిజెక్ట్ చేసిన నమ్రత, ఎందుకో తెలుసా.. ఒకటి సూపర్ హిట్, మరొకటి డిజాస్టర్
Recommended image2
ఉదయభాను మొదటి పెళ్లి గురించి లీక్ చేస్తానని ఆమె తల్లే ఎందుకు బెదిరించింది? నరకం అనుభవించిన స్టార్ యాంకర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved