MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ తో రెండు సినిమాలని రిజెక్ట్ చేసిన నమ్రత, ఎందుకో తెలుసా.. ఒకటి సూపర్ హిట్, మరొకటి డిజాస్టర్

పవన్ తో రెండు సినిమాలని రిజెక్ట్ చేసిన నమ్రత, ఎందుకో తెలుసా.. ఒకటి సూపర్ హిట్, మరొకటి డిజాస్టర్

మహేష్ బాబు సతీమణి నమ్రత.. పవన్ కళ్యాణ్ తో రెండు చిత్రాల్లో నటించాల్సింది. కానీ ఆ రెండు చిత్రాలను నమ్రత రిజెక్ట్ చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 10 2025, 03:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పవన్ కళ్యాణ్ చిత్రాలు
Image Credit : Asianet News

పవన్ కళ్యాణ్ చిత్రాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రంతో నటుడిగా తన కెరీర్ ప్రారంభించారు. తొలిప్రేమ చిత్రంతో పవన్ కి యువతలో క్రేజ్  పెరిగింది. ఆ తర్వాత పవన్ బద్రి, తమ్ముడు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఖుషి మూవీతో పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా అవతరించారు. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఖుషి చిత్రం చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.

25
నమ్రత తెలుగు సినిమాలు
Image Credit : Instagram/Harihara Veeramallu

నమ్రత తెలుగు సినిమాలు

పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో చాలా మంది హీరోయిన్లతో నటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత.. పవన్ కళ్యాణ్ తో రెండు చిత్రాల్లో నటించాల్సింది. కానీ ఆ రెండు చిత్రాలను నమ్రత రిజెక్ట్ చేశారు. ఆమె అలా ఎందుకు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లో నమ్రత బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. తెలుగులో మహేష్ బాబు వంశీ, చిరంజీవి అంజి లాంటి చిత్రాల్లో నటించారు.

Related Articles

Related image1
ఇలాంటి హస్బెండ్ కోసమే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నా.. సీనియర్ నటుడికి శ్రీముఖి ఫిదా, వైరల్ కామెంట్స్
Related image2
తండ్రి చనిపోతే తన స్కూల్ లో చదివించిన మోహన్ బాబు, ఆమె ఇప్పుడు 300 కోట్లు రాబట్టే క్రేజీ హీరోయిన్ అని తెలుసా ?
35
పవన్ కళ్యాణ్, నమ్రత కాంబినేషన్
Image Credit : Instagram/Namrata Shirodkar

పవన్ కళ్యాణ్, నమ్రత కాంబినేషన్

అప్పట్లో నమ్రత బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటించేవారు. ఆ టైంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. పవన్ కళ్యాణ్ బద్రి చిత్రం కోసం హీరోయిన్ పాత్ర కోసం నమ్రతని అప్రోచ్ అయ్యారట. నమ్రతకి కథ చాలా బాగా నచ్చింది. బద్రి చిత్రంలో నటించేందుకు ఆసక్తి కూడా చూపారట. కానీ అదే టైంలో బాలీవుడ్ లో రెండు చిత్రాలలో నటిస్తుండడం వల్ల డేట్లు అడ్జస్ట్ చేయడం కుదరలేదట. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో నమ్రత బద్రి చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

45
బాలు చిత్రంలో నమ్రతకి ఛాన్స్
Image Credit : Instagram/Namrata Shirodkar

బాలు చిత్రంలో నమ్రతకి ఛాన్స్

ఆ తర్వాత నమ్రత స్థానంలో పూరి జగన్నాథ్ అమీషా పటేల్ ని హీరోయిన్ గా ఎంచుకున్నారు. బద్రి మూవీ విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం నమ్రతకు దక్కింది. పవన్ కళ్యాణ్, కరుణాకరన్ కాంబినేషన్ లో రెండోసారి తెరకెక్కిన చిత్రం బాలు. తొలిప్రేమ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

55
మహేష్ బాబుతో రిలేషన్
Image Credit : Instagram/Namrata Shirodkar

మహేష్ బాబుతో రిలేషన్

ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం డైరెక్టర్ కరుణాకరన్ నమ్రతని సంప్రదించారు. కానీ అదే టైంలో నమ్రత, మహేష్ బాబుతో రిలేషన్ లో ఉండడం వల్ల బాలు చిత్రాన్ని ఆమె రిజెక్ట్ చేశారు. ఆ విధంగా నమ్రత వదులుకున్న బద్రి చిత్రం సూపర్ హిట్ కాగా.. బాలు మూవీ ఫ్లాప్ అయ్యింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
మెగాస్టార్ చిరంజీవి ఫేవరెట్ సీరియల్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
Illu Illalu Pillalu: నోరు జారి.. లంచం ఇచ్చి ఉద్యోగం కొన్న నిజం బయటపెట్టిన సాగర్, వల్లి మరో కుట్ర
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యోను ఎడాపెడా వాయించిన పారు- ఇంట్లో నుంచి వెళ్లిపోతానన్న కాంచన
Related Stories
Recommended image1
ఇలాంటి హస్బెండ్ కోసమే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నా.. సీనియర్ నటుడికి శ్రీముఖి ఫిదా, వైరల్ కామెంట్స్
Recommended image2
తండ్రి చనిపోతే తన స్కూల్ లో చదివించిన మోహన్ బాబు, ఆమె ఇప్పుడు 300 కోట్లు రాబట్టే క్రేజీ హీరోయిన్ అని తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved