- Home
- Entertainment
- తానా వేదికపై ఏడ్చేసిన సమంత, కన్నీళ్లు తుడిచిన యాంకర్ సుమ..ఆ చిత్రాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగం
తానా వేదికపై ఏడ్చేసిన సమంత, కన్నీళ్లు తుడిచిన యాంకర్ సుమ..ఆ చిత్రాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగం
తానా వేదికపై సమంత మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడున్న అభిమానులని కూడా భావోద్వేగానికి గురి చేశారు.

అమెరికాలో జరిగిన ప్రముఖ తెలుగు సంఘం కార్యక్రమం తానా 2025 (Telugu Association of North America) వేడుకల్లో ప్రముఖ నటి సమంత పాల్గొన్నారు. తానా వేదికపై సమంత మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడున్న అభిమానులని కూడా భావోద్వేగానికి గురి చేశారు. అమెరికాలో ఉన్న తెలుగు వారు తనపై చూపిస్తున్న ప్రేమ అభిమానాలకు సమంత కృతజ్ఞతలు తెలిపారు.
స్టేజ్ పై మాట్లాడిన సమంత, “ఈ రోజు ఇక్కడ నిలబడి ధన్యవాదాలు చెప్పడానికి నాకు 15 ఏళ్లు పట్టింది” అని సమంత అన్నారు. తన కెరీర్ ప్రారంభమైన ఏ మాయ చేసావే సినిమా నుంచే తెలుగు ప్రేక్షకులు తనను అంగీకరించారని, ఆదరించారని చెప్పారు. “ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ చెప్పలేని కృతజ్ఞతను ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. మొదటి నుండి మీరు నన్ను మీ ఇంటి అమ్మాయిలా భావించారు,” అని అన్నారు.
ఇటీవల సమంత నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం శుభం గురించి తానా వేదికపై ప్రస్తావించారు. శుభం చిత్రానికి అమెరికాలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. "నేను కెరీర్‌లో ఏ నిర్ణయం తీసుకున్నా ముందు మన తెలుగు ప్రేక్షకులకిష్టమా లేదా అని ఆలోచిస్తానని సమంత తెలిపింది.
ఓ బేబీ సినిమా అమెరికాలో మిలియన్ డాలర్ల కలెక్షన్ సాధించిందన్న విషయం తనకు ఆశ్చర్యం కలిగించిందని గుర్తుచేసుకున్నారు. “మీరు ఎంత దూరంలో ఉన్నా, నా మనసుకు మీరు చాలా దగ్గరగా ఉన్నారు అంటూ సమంత భావోద్వేగానికి గురైంది.
సమంత వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది. అమెరికాలోని తెలుగువారు ఎంత దూరంలో ఉన్నప్పటికీ తన పట్ల తన సినిమాల పట్ల ప్రేమ కురిపిస్తున్నారని అన్నారు. వారి ప్రేమని, తన సినిమాలకు అమెరికాలో దక్కిన ఆదరణని గుర్తు చేసుకుంటూ సమంత ఏడ్చేశారు. దీనితో యాంకర్ గా ఉన్న సుమ దగ్గరకు వచ్చి సమంత కన్నీళ్లు తుడిచారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.