MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Funky Collections: `ఫంకీ` మూవీ ఫస్ట్ డే బాక్సాఫీసు.. అనుదీప్‌ దెబ్బకి విశ్వక్‌ సేన్‌ జాక్‌ పాట్‌

Funky Collections: `ఫంకీ` మూవీ ఫస్ట్ డే బాక్సాఫీసు.. అనుదీప్‌ దెబ్బకి విశ్వక్‌ సేన్‌ జాక్‌ పాట్‌

విశ్వక్‌ సేన్‌, కయాదు లోహర్‌ జంటగా అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో రూపొందిన `ఫంకీ` మూవీ థియేటర్లో సందడి చేస్తుంది. మరి ఈ చిత్రం మొదటి రోజు ఎంత వసూలు చేసిందో చూద్దాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 14 2026, 05:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫంకీ మూవీకి మిశ్రమ స్పందన
Image Credit : X/@SitharaEnts

ఫంకీ మూవీకి మిశ్రమ స్పందన

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ తన ఇమేజ్‌ని, జోనర్‌ని పక్కన పెట్టి చేసిన మూవీ `ఫంకీ`. అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని రూపొందించారు. ఇందులో కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటించింది. డైలాగ్‌ కామెడీతో సాగే ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. కథ లేదని, కథనం సరిగా లేదని, ఎడిటింగ్‌ లోపాలున్నాయనే విమర్శలు వచ్చాయి. డైలాగ్‌ కామెడీ కొంత వరకే ఆకట్టుకుందనే కామెంట్స్ వచ్చాయి.

25
టాక్‌తో సంబంధం లేకుండా `ఫంకీ` కలెక్షన్లు
Image Credit : X/@SitharaEnts

టాక్‌తో సంబంధం లేకుండా `ఫంకీ` కలెక్షన్లు

ఓవరాల్‌గా `ఫంకీ` చిత్రానికి మిశ్రమ స్పందన కంటే నెగటివ్‌ టాకే ఎక్కువగా వినిపించింది. కొందరు మాత్రమే ఎలాంటి లాజిక్కులు పట్టించుకోకుండా చూస్తే నవ్వుకునే మూవీ అవుతుందన్నారు. అయితే టాక్‌తో సంబంధం లేకుండా మూవీ దూసుకుపోతుంది. మొదటి రోజు మాత్రం మంచి వసూళ్లని రాబట్టింది. ఓవర్సీస్‌లోనూ సత్తా చాటింది. తెలుగు స్టేట్స్ లో కూడా ఊహించని విధంగా కలెక్షన్లు వచ్చాయి. ఇటీవల విశ్వక్‌ సేన్‌కి మార్కెట్‌ తగ్గిపోయింది, అనుదీప్‌ కూడా యాక్టివ్‌గా లేరు. ఇలాంటి సమయంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన `ఫంకీ` చిత్రానికి మంచి వసూళ్లు రావడం విశేషం.

Related Articles

Related image1
Maheshbabu ని రెండు సార్లు రిజెక్ట్ చేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? మహేష్‌ అభిమానులకు తీరని కోరికే
Related image2
Couple Friendly Movie Review: కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. ప్రేమికులకు పర్‌ఫెక్ట్ ఛాయిస్‌
35
ఫంకీ మూవీ కలెక్షన్లు
Image Credit : X/@SitharaEnts

ఫంకీ మూవీ కలెక్షన్లు

`ఫంకీ` మూవీ మొదటి రోజు ఊహించని వసూళ్లని రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ.4.5కోట్లు వచ్చాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.2.65కోట్లు, ఓవర్సీస్‌లో రూ.1.15కోట్లు వచ్చాయి. విశ్వక్‌ సేన్‌ నటించిన `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి`, `గామి`, `ధమ్కీ` వంటి చిత్రాలు ఎనిమిది కోట్లకుపైగా మొదటి రోజు కలెక్షన్లని సాధించాయి. వాటితో పోల్చితే ఈ మూవీకి చాలా పూర్‌ ఓపెనింగ్‌ అనే చెప్పొచ్చు. కానీ రీసెంట్‌ మూవీస్‌ `మెకానిక్‌ రాకీ`కి రూ.2.6కోట్లు, `లైలా`కి రూ.1.8కోట్లు వచ్చాయి. వాటితో పోల్చితే, ఈ మూవీకి వచ్చిన టాక్‌ తో పోల్చితే మాత్రం మంచి వసూళ్లనే `ఫంకీ` రాబట్టిందని చెప్పొచ్చు. అనుదీప్‌ మీద ఉన్న క్రేజ్‌తో ఇది సాధ్యమైందని టాక్‌. ఓ రకంగా అనుదీప్‌ వల్ల విశ్వక్‌ సేన్‌కి జాక్‌ పాట్‌ తగిలింది.

45
ఫంకీ మూవీ బడ్జెట్‌, బిజినెస్‌
Image Credit : X/@SitharaEnts

ఫంకీ మూవీ బడ్జెట్‌, బిజినెస్‌

మొత్తంగా రెండున్నర కోట్ల షేర్‌ ని సాధించింది. ఈ మూవీ సుమారు రూ.25కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. దీనికి రిలీజ్‌కి ముందు రూ.13కోట్ల బిజినెస్‌ అయ్యింది. సినిమా హిట్‌ కావాలంటే రూ.27కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రావాలి. మరి ఇప్పుడున్న టాక్‌తో ఈ రేంజ్‌ వసూళ్లని రాబడుతుందా అనేది చూడాలి. శనివారం, ఆదివారం, సోమవారం శివరాత్రి ఈ మూవీకి కలిసి రాబోతున్నాయి. మరి ఏ మేరకు సినిమా ఆకట్టుకుంటుంది, సక్సెస్‌ అవుతుందో చూడాలి.

55
ఫంకీ మూవీ కథేంటంటే?
Image Credit : X/@SitharaEnts

ఫంకీ మూవీ కథేంటంటే?

`ఫంకీ` మూవీ సినిమా నేపథ్యంలో సాగుతుంది. ఇందులో హీరో కోమల్‌ అనే సినిమా దర్శకుడిగా కనిపిస్తాడు. ఆయన నాలుగు కోట్లతో సినిమా తీస్తానని నిర్మాతగా మూవీ స్టార్ట్ చేస్తాడు. కానీ రాను రాను అది నలభై కోట్లు అవుతుంది. దీంతో నిర్మాత షాక్‌ అవుతాడు. మూవీని మధ్యలోనే ఆపేస్తాడు, ఇతర దర్శకులతో మూవీని కంప్లీట్‌ చేయాలని నిర్మాత కూతురు కయాదు లోహర్‌ రంగంలోకి దిగుతుంది. ఏ డైరెక్టర్‌ ఈ మూవీ చేయడానికి ముందుకు రారు, దీంతో కోటీ రూపాయలతో మూవీ కంప్లీట్‌ చేసేలా విశ్వక్‌సేన్‌తోనే మళ్లీ కమిట్‌ అవుతారు. మరి కోటీలోనే మూవీ కంప్లీట్‌ అయ్యిందా?. ఈ క్రమంలో విశ్వక్‌, కయాదు ఎలా ప్రేమలో పడ్డారనేది మూవీ.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
The Raja Saab : డూప్‌తో యాక్షన్ సీన్స్.. ప్రభాస్ హీరోయిన్ మాళవిక మోహనన్ క్లారిటీ
Recommended image2
Maheshbabu ని రెండు సార్లు రిజెక్ట్ చేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? మహేష్‌ అభిమానులకు తీరని కోరికే
Recommended image3
పుష్ప, కాంతార, బాహుబలి... ఇండియన్ సినిమాను ఏలుతున్న 6 ఫ్రాంచైజీలు, టాలీవుడ్ హీరోలదే హవా..
Related Stories
Recommended image1
Maheshbabu ని రెండు సార్లు రిజెక్ట్ చేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? మహేష్‌ అభిమానులకు తీరని కోరికే
Recommended image2
Couple Friendly Movie Review: కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. ప్రేమికులకు పర్‌ఫెక్ట్ ఛాయిస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved