- Home
- Entertainment
- రాఘవేంద్రరావు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసి నంది అవార్డు అందుకున్న ఏకైక చిత్రం.. ఆ మూవీ ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్
రాఘవేంద్రరావు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసి నంది అవార్డు అందుకున్న ఏకైక చిత్రం.. ఆ మూవీ ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు టాలీవుడ్ లో లెజెండ్రీ డైరెక్టర్లలో ఒకరు. ఆయన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి హీరోలతో అనేక సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు టాలీవుడ్ లో లెజెండ్రీ డైరెక్టర్లలో ఒకరు. ఆయన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి హీరోలతో అనేక సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఈ తరం హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబులని హీరోలుగా పరిచయం చేసింది కూడా ఆయనే.
కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించడంలో రాఘవేంద్రరావుకు ప్రత్యేక శైలి ఉంది. దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకున్న ఆయన.. డాన్స్ కొరియోగ్రాఫర్ గా కూడా సత్తా చాటారని తెలుసా? కానీ ఇది నిజం.. డాన్స్ కొరియోగ్రఫీ చేయడం మాత్రమే కాదు, అందుకుగాను ఆయన నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే 1996లో విడుదలైన పెళ్లి సందడి మూవీ.
రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాకర్ ఈ చిత్రంలో కలిసి నటించారు. దర్శకత్వం చేస్తూనే ఈ మూవీలో పాటలకు ఆయన కొరియోగ్రఫీ కూడా చేశారు. పాటలు చిత్రీకరించడంలో రాఘవేందర్ రావు కి ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయన చిత్రాల్లోని పాటల్లో ఎక్కువగా పూలు, పళ్ళు కనిపిస్తుంటాయి. పెళ్లి సందడి చిత్రంలో పెద్దగా డాన్స్ మూమెంట్స్ లేకుండా ఎంతో అందంగా పాటలకు కొరియోగ్రఫీ అందించారు.ఈ మూవీలో కీరవాణి అందించిన సంగీతం హైలైట్.
పెళ్లి సందడి చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 1996 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ లాంటి అగ్ర హీరోల చిత్రాల పోటీ నుంచి తట్టుకుని కూడా టాప్ 2 హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ చిత్రానికి పోటీగా బాలకృష్ణ వంశానికొక్కడు, వెంకటేష్ ధర్మచక్రం చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఈ చిత్రాలు పెళ్లి సందడి అంతా పెద్ద హిట్ కాలేకపోయాయి.
ఆ ఏడాది నాగార్జున నటించిన నిన్నే పెళ్ళాడుతా చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఆ మూవీ తర్వాత పెళ్లి సందడి చిత్రం రెండవ స్థానంలో నిలిచింది. కేవలం రెండు కోట్ల బడ్జెట్ లోపే తెరకెక్కిన పెళ్లి సందడి చిత్రం ఏకంగా 15 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.