MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మేకప్ అలవాటులేని సాయి పల్లవి రెగ్యులర్ గా వాడే రెండు బ్యూటీ ప్రొడక్ట్స్ ఏంటో తెలుసా?

మేకప్ అలవాటులేని సాయి పల్లవి రెగ్యులర్ గా వాడే రెండు బ్యూటీ ప్రొడక్ట్స్ ఏంటో తెలుసా?

సాయిపల్లవి నేచురల్ బ్యూటీ. మేకప్ వాడదు, ఎక్కువగా కాస్మొటిక్స్ ను దగ్గరకు రానివ్వదు. సహజంగా ఉండటానికి ట్రై చేస్తుంది. సినిమాల్లో కూడా సహజంగానే నటిస్తుంది. అయితే ఆమె వాడే రెండే రెండు బ్యూటీ ప్రొడక్ట్స్ ఏంటో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 10 2025, 06:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Instagram / sai pallavi

సహజ నటి సాయి పల్లవి

టాలీవుడ్, కోలీవుడ్ లో నేచురల్ బ్యూటీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. సినిమాల విషయంలో, మేకప్ విషయంలో, తన మార్క్ చూపిస్తుంటు హీరోయిన్. అవకాశం వచ్చింది కదా అని పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, కోట్లు వెనకేసుకోవాలి అనే ఆలోచన సాయి పల్లవిలో ఉండదు. మంచి కథ, యాక్టిగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికితే సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అంతే కాని ముఖానికి ఎక్కువగా రంగులు పులుముకోవడం, పొట్టి డ్రెస్సులు ధరించడం వంటి ఫ్యాషన్ ట్రెండ్స్‌కి ఆమె దూరంగా ఉంటుంది. అయితే సాయి పల్లవి రెగ్యులర్‌గా వాడే రెండు మేకప్ ప్రోడక్ట్స్‌ గురించి మీకు తెలుసా?

DID YOU
KNOW
?
సాయి పల్లవి రెమ్యునరేషన్
బాలీవుడ్ లో భారీ బడ్జెట్ మూవీలో నటిస్తోంది సాయి పల్లవి. రామాయణం సినిమాలో సీతగా నటించినందుకు ఆమె 30 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం.
25
Image Credit : Instagram / sai pallavi

మేకప్ ఇష్టపడని హీరోయిన్

సాయి పల్లవి తన వ్యక్తిత్వంలో ఎంత సింపుల్ గా ఉంటుందో, తన మేకప్ రొటీన్‌ లో కూడా అంతే నేచురల్ గా ఉంటుంది. సాధారణంగా షూటింగ్‌కు ముఖం కడుక్కొని వచ్చేస్తానంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఈ విషయాలను గార్గి, విరాటపర్వం సినిమాల షూటింగ్ సమయంలో ఆమె తన సన్నిహితుల దగ్గర చెప్పగా.. అప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అప్పట్లో ఆమె మాట్లాడుతూ… "ఈ సినిమాల్లో నేను ఎలాంటి మేకప్ వాడలేదు. మొహం కడుక్కుని వచ్చాను అంతే" అని సరదాగా చెప్పింది.

Related Articles

Related image1
కృష్ణకు తెలియకుండా మహేష్ బాబు చేసిన సాహసం, అంత రిస్క్ చేశాడా?
Related image2
ప్రభాస్ కన్నీళ్లు పెట్టిన సందర్భం, పాన్ ఇండియా స్టార్ ఎమోషనల్ కామెంట్స్
35
Image Credit : Instagram / sai pallavi

సాయి పల్లవి హ్యాండ్ బ్యాగ్ లో ఆ రెండు

అయితే సాయిపల్లవి హ్యాండ్ బ్యాగ్ లో మాత్రం రెండు మేకప్ వస్తువులు తప్పకుండా ఉంటాయట అవి మరేవో కాదు ఐలైనర్, మాయిశ్చరైజర్. సాయి పల్లవి గతంలో చెప్పిన ప్రకారం, తాను ప్రత్యేకంగా బ్యూటీ క్రీములు, ఫౌండేషన్ వంటివి వాడడం అస్సలు ఇష్టపడదు. కానీ చర్మం పొడిబారకుండా ఉండేందుకు మాయిశ్చరైజర్ ఉపయోగించడం, రాత్రిపూట షూటింగ్‌ల్లో కళ్ళు బాగా ఆకర్షించేందుకు ఐలైనర్ వాడటమే ఆమె మేకప్ స్టైల్ అంటుంది.

45
Image Credit : Instagram / sai pallavi

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న హీరోయిన్

అంతేకాదు, హెయిర్ స్టైల్ విషయంలో మాత్రం పాత్రకు అనుగుణంగా మార్పులు చేసుకుంటుంది సాయి పల్లవి. ఎక్కువగా కర్లీ హెయిర్‌లో కనిపించే సాయి పల్లవి… కథలో పాత్ర డిమాండ్ చేస్తే స్ట్రెయిట్ లేదా ఇతర హెయిర్ స్టైల్స్‌కి షిఫ్ట్ అవుతుందట. రీసెంట్ గా శివకార్తికేయన్ జోడిగా సాయి పల్లవి నటించిన అమరన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అలాగే నాగచైతన్యతో కలిసి నటించిన తండేల్ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ తో డీసెంట్ హిట్ గా నిలిచింది. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న సాయి పల్లవి తాజాగా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది.

55
Image Credit : Instagram / sai pallavi

రామాయణంలో సీతగా

బాలీవుడ్ లో భారీ స్థాయిలో రామాయణం కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కుతోంది. ఈసినిమాలో బాలీవుడ్ యంగ్ స్టార్ రణ్ బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తుండగా.. సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబోతోంది. ప్రస్తుతం రామాయణం ప్రాజెక్ట్‌ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈసినిమాకు సబంధించిన కొన్ని లుక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిస్తే.. సాయి పల్లవికి బాలీవుడ్ లో కూడా భారీగా ఆఫర్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ధురంధర్ 2 కి రిలీజ్ కు ముందే దెబ్బ? టాక్సిక్ హిస్టారిక్ డీల్‌తో గేమ్ మారిపోయిందిగా..
Recommended image2
Allu Arjun ని కలవాలంటే 42 రూల్స్ ? ఆ బ్రాండ్‌ స్ట్రాటజర్‌కి ఇచ్చిపడేసిన అల్లు అర్జున్‌ టీమ్‌
Recommended image3
50 రూపాయల కూలీతో మొదలై.. 50 కోట్ల ఆస్తులు సంపాదించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
కృష్ణకు తెలియకుండా మహేష్ బాబు చేసిన సాహసం, అంత రిస్క్ చేశాడా?
Recommended image2
ప్రభాస్ కన్నీళ్లు పెట్టిన సందర్భం, పాన్ ఇండియా స్టార్ ఎమోషనల్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved