MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగార్జునని అవమానించినందుకే ప్రియాని ఎలిమినేట్ చేశారా.. హౌస్ లో లేడీ పుష్పరాజ్, రెమ్యునరేషన్ ఎంతంటే

నాగార్జునని అవమానించినందుకే ప్రియాని ఎలిమినేట్ చేశారా.. హౌస్ లో లేడీ పుష్పరాజ్, రెమ్యునరేషన్ ఎంతంటే

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ప్రియా శెట్టి ఎలిమినేట్ అయింది. కేవలం మూడు వారాలకే ఆమె బిగ్ బాస్ జర్నీ ముగియడం వెనుక అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ఆమె నాగార్జునని అవమానించింది అనే వాదన కూడా వినిపిస్తోంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 29 2025, 09:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రియా శెట్టి కథ ముగిసింది
Image Credit : Asianet News

ప్రియా శెట్టి కథ ముగిసింది

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మూడవ వారం డాక్టర్ పాప ప్రియా శెట్టి ఎలిమినేట్ అయింది. అగ్నిపరీక్ష దాటుకుని ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు తప్పకుండా టాప్ 5 కంటెస్టెంట్ అవుతుందని ప్రేక్షకులు భావించారు. కానీ ఊహించని విధంగా ప్రియా శెట్టి కథ మూడు వారాలకే ముగిసింది. ఆదివారం రోజు ఆమె ఎలిమినేట్ ఎలిమినేట్ అయింది. అగ్ని పరీక్షలో, బిగ్ బాస్ షో ప్రారంభంలో అందరినీ అట్రాక్ట్ చేసిన డాక్టర్ పాప పోరాటం ఎందుకు ఫ్లాప్ షోగా ముగిసింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

25
డాక్టర్ పాప ఎలిమినేట్ కావడం వెనుక కారణాలు
Image Credit : Asianet News

డాక్టర్ పాప ఎలిమినేట్ కావడం వెనుక కారణాలు

ఆమె మూడు వారాలకే ఎలిమినేట్ కావడం వెనుక అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ప్రియా శెట్టి ఎలిమినేట్ కావడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఆమె యాటిట్యూడ్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. బిగ్ బాస్ బజ్ లో శివాజీ కూడా ఇదే విషయాన్ని బయట పెట్టారు. ప్రియా శెట్టిపై శివాజీ ప్రశ్నల వర్షంతో విరుచుకుపడ్డారు. ప్రియా శెట్టి యాటిట్యూడ్ ని ప్రశ్నిస్తూ ఒక ఫుటేజ్ ని శివాజీ చూపించారు. అది చూస్తే తప్పకుండా ప్రేక్షకులకు పుష్ప మూవీ గుర్తుకు వస్తుంది. పుష్ప మూవీలో హీరో యాటిట్యూడ్ ని తెలియజేసేలా ఒక డైలాగ్ ఉంటుంది. ' ఇది నా కాలు, ఇది కూడా నా కాలు.. నా కాలు మీద నా కాలు వేసుకుంటే ఓనికేమి నొప్పి అని అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ఉంటుంది. 

Related Articles

Related image1
ఈవారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్ లు ఇవే.. క్రేజీ కంటెంట్ తో శివకార్తికేయన్, శ్రద్దా శ్రీనాథ్ రెడీ
Related image2
బాలకృష్ణ సినిమా రిజెక్ట్ చేసి మంచి పని చేసిన కమల్ హాసన్..లేకుంటే ఒక చరిత్ర తుడిచిపెట్టుకుపోయేది ?
35
హౌస్ లో పుష్పరాజ్ యాటిట్యూడ్
Image Credit : instagram/priya epooru

హౌస్ లో పుష్పరాజ్ యాటిట్యూడ్

ఇదంతా ఎందుకంటే ప్రియా శెట్టి బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున ఎదురుగా ఉన్నప్పుడు కాలు మీద కాలేసుకుని కూర్చుంది. ఆమెతో పాటు హరీష్, కళ్యాణ్, రీతూ చౌదరి కూడా కాలుమీద కాలేసుకుని కూర్చున్నారు. శివాజీ ప్రశ్నిస్తూ నాగార్జున గారి ముందు కూర్చునే విధానం అదేనా.. మిగిలిన వాళ్ళు ఎంత మర్యాదగా కుర్చున్నారో కనిపించలేదా అని ప్రశ్నించారు. తాను అంత ఆలోచించలేదని ప్రియా పేర్కొంది. అక్కడున్నది నాగార్జున గారా, వేరే వాళ్ళా అనేది పక్కన పెట్టండి. అక్కడ ఎవరున్నా అది ఈ షోకి హోస్ట్. ఆయనకి మర్యాద ఇవ్వడం కనీస బాధ్యత అని తెలియదా అంటూ శివాజీ.. ప్రియా శెట్టి చేసిన బిగ్ మిస్టేక్ ని ఎత్తిచూపారు. 

45
నిజంగానే సెలెబ్రిటీ అయి ఉంటే..
Image Credit : Asianet News

నిజంగానే సెలెబ్రిటీ అయి ఉంటే..

ప్రియా శెట్టి చేసిన మరో తప్పుని కూడా శివాజీ ఎత్తి చూపారు. హౌస్ కి వెళ్లినప్పటి నుంచి కామనర్స్, సెలెబ్రిటీలు అనే విభేదాలని ప్రియా శెట్టి రెచ్చగొడుతూనే ఉంది అని తెలిపారు. నువ్వు అగ్ని పరీక్షతో కలిపి మొత్తం షోలో దాదాపు 2 నెలల వరకు ఉన్నావు. అంటే నువ్వు కూడా సెలెబ్రిటీనే అని శివాజీ తెలిపారు. నేను సెలెబ్రిటీని కాదు అనే ఫీలింగ్ తోనే ఇంత రచ్చ చేశావ్.. ఒక వేళ నువ్వు నిజంగానే సెలెబ్రిటీ అయితే ఇంకెత హంగామా చేసేదానివో అని శివాజీ అన్నారు. అసలు మీరు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్లారు అని శివాజీ ప్రశ్నించారు.. ఆడి గెలవడానికి అని ప్రియా సమధానం ఇచ్చింది. గెలవడానికి అసలు మీరేం చేశారు అని ప్రశ్నించగా తనకి ఆడే అవకాశమే ఇవ్వలేదు అని ప్రియా తెలిపింది. 

55
ప్రియా శెట్టి రెమ్యునరేషన్ ఇదే
Image Credit : Asianet News

ప్రియా శెట్టి రెమ్యునరేషన్ ఇదే

అసలు నీకు ఆట ఆడడమే రాదు.. వెళ్లినప్పటి నుంచి కంప్లైంట్స్ చేస్తూనే ఉన్నావు తప్ప గేమ్ ఆడలేదు అని శివాజీ అన్నారు. అగ్ని పరీక్షలో నీ కాన్ఫిడెన్స్ అందరికీ నచ్చింది. కానీ హౌస్ లోకి వెళ్ళాక అదే కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది అని శివాజీ అన్నారు. నన్ను తొక్కేయడానికి ప్రశ్నించారు అని ప్రియా శెట్టి అన్నారు. దీని శివాజీ రియాక్ట్ అవుతూ నీ వాయిస్ తో నువ్వే అందరినీ తొక్కేశావ్ కదా అని శివాజీ కౌంటర్ ఇచ్చారు. అందుకే ఆడియన్స్ నిన్ను బయటకి పంపడానికి డిసైడ్ అయ్యారు అని శివాజీ అన్నారు.  బిగ్ బాస్ హౌస్ షోకి గాను ప్రియా శెట్టికి మంచి రెమ్యునరేషన్ దక్కింది. వారానికి ఆమెకి రూ 70000 రెమ్యునరేషన్ చెల్లించారు. అంటే మూడు వారాలకు కలిపి ప్రియా శెట్టి రూ 210000 రెమ్యునరేషన్ అందుకుంది. ప్రియా శెట్టి వృత్తి రీత్యా డాక్టర్. కర్నూలుకి చెందిన అమ్మాయి. కానీ బిగ్ బాస్ హౌస్ లో త్వరగానే ఆమె ప్రస్థానం ముగిసింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బిగ్ బాస్ తెలుగు
అక్కినేని నాగార్జున
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?
Recommended image2
ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే
Recommended image3
Jeffrey Epstein: ఎవ‌రీ జెఫ్రీ, ఆ ఐల్యాండ్‌లో ఏం చేశాడు? OTTలో భయంకర సత్యాలను తెలిపే డాక్యుమెంటరీ
Related Stories
Recommended image1
ఈవారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్ లు ఇవే.. క్రేజీ కంటెంట్ తో శివకార్తికేయన్, శ్రద్దా శ్రీనాథ్ రెడీ
Recommended image2
బాలకృష్ణ సినిమా రిజెక్ట్ చేసి మంచి పని చేసిన కమల్ హాసన్..లేకుంటే ఒక చరిత్ర తుడిచిపెట్టుకుపోయేది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved