స్టార్ హీరో రెండో పెళ్ళికి రెడీ అవుతున్నాడా.. ఆమెతో జంటగా వివాహ వేడుకలో సందడి
ఐసరి గణేష్ కూతురు పెళ్లికి నటుడు రవి మోహన్ కూడా హాజరయ్యారు. ఆయన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఒక మహిళతో కలిసి ఈ పెళ్లికి వచ్చారు.

ఐసరి గణేష్ కూతురు పెళ్లిలో రవి మోహన్
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు రవి మోహన్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం పరాశక్తి. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ కి విలన్ గా నటిస్తున్నారు రవి మోహన్. ఇంకా ఆయన నటిస్తున్న మరో చిత్రం కైవం కరాటే బాబు. ఈ చిత్రానికి గణేష్ కె బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.
రవి మోహన్ - ఆర్తి విడాకులు
నటుడు రవి మోహన్ కి 2009వ సంవత్సరంలో ఆర్తితో వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు మగ పిల్లలు. దాదాపు 15 సంవత్సరాలు కలిసి జీవించిన ఈ జంట గత సంవత్సరం విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది.
ఐసరి గణేష్ కూతురు పెళ్లి
తమిళ సినీ పరిశ్రమలో బిజీగా ఉన్న నిర్మాత ఐసరి గణేష్. ఆయన కూతురు ప్రీత పెళ్లి నేడు చెన్నైలో జరిగింది. ఈ పెళ్లికి తమిళ సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఏకైక కూతురు కావడంతో, ఆమె పెళ్లిని ఘనంగా నిర్వహించారు ఐసరి గణేష్. పెళ్లికి వచ్చిన ప్రముఖుల ఫోటోలు కూడా బయటకు వచ్చి వైరల్ అవుతున్నాయి.
రవి మోహన్ తో వచ్చింది ఎవరు?
ఐసరి గణేష్ కూతురు పెళ్లికి నటుడు రవి మోహన్ కూడా హాజరయ్యారు. ఆయన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఒక మహిళతో కలిసి ఈ పెళ్లికి వచ్చారు. ఇద్దరూ జంటగా మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకుని కూర్చున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఆమె ఎవరనే ప్రశ్న తలెత్తింది. ఆమె మరెవరో కాదు, గాయని కెనిషా. రవి మోహన్ - ఆర్తి విడాకులకు కారణం ఈ కెనిషా అని ప్రచారం జరిగింది. తర్వాత వారు స్నేహితులని, వివరణ ఇచ్చారు.
రవి మోహన్ రెండో పెళ్లా?
కెనిషాతో కలిసి రవి మోహన్ కూర్చున్న ఫోటో చూసి నెటిజన్లు ఆయన రెండో పెళ్లి చేసుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు. కొందరైతే ఇద్దరూ తమ రిలేషన్షిప్ ని సూచనప్రాయంగా ప్రకటించేందుకే ఇలా జంటగా వచ్చారని అంటున్నారు. ఇంకా ఆర్తితో అధికారికంగా విడాకులు రాని కారణంగా జయం రవి - కెనిషా ఇద్దరూ ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండే అవకాశం ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.