MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OG హీరోయిన్ కు చుక్కలు చూపించిన జనం, ప్రియాంక మోహన్‌ విషయంలో విజయ్‌పై సెటైర్లు

OG హీరోయిన్ కు చుక్కలు చూపించిన జనం, ప్రియాంక మోహన్‌ విషయంలో విజయ్‌పై సెటైర్లు

పవన్ కళ్యాణ్ ఓజీ హీరోయిన్ కు చుక్కలు చూపించారు జనం. ఓ షాపు ఓపెనింగ్ కు వచ్చిన ప్రియాంక మోహన్ జనా మధ్య చిక్కుకుని ఇబ్బందులు పడింది. ఇక ఆ టైమ్ లో ఏం జరిగిందంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 06 2025, 04:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కన్నడలో అరంగేట్రం:
Image Credit : instagram

కన్నడలో అరంగేట్రం:

నటి ప్రియాంక మోహన్  కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.  2019లో విడుదలైన 'ఒంద్ కథే హెల్ల' అనే సినిమాతో తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగులో నానికి జోడీగా  నటించిన 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమా ఆమెకు పెద్ద విజయాన్ని అందించింది.

27
నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో
Image Credit : Asianet News

నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో

కన్నడ, తెలుగులో వరుసగా నటిస్తూ బిజీగా ఉన్న ప్రియాంకను తమిళంలోకి తీసుకొచ్చింది దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. 2021లో శివకార్తికేయన్ హీరోగా ఆయన దర్శకత్వంలో వచ్చిన 'డాక్టర్' సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. తొలి సినిమాతోనే తన సహజ నటన, అందమైన డ్యాన్స్‌తో అభిమానుల మనసు దోచుకుంది.

Related Articles

Related image1
సామాన్యుడిలా సూపర్ స్టార్, సినిమాలకు విరామం హిమాలయాల్లో రజనీకాంత్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
Related image2
4000 కోట్ల బడ్జెట్ మూవీలో సౌత్ స్టార్ హీరో, 5 పాన్ ఇండియా సినిమాలతో సందడి చేయనున్న నటుడు ఎవరు?
37
100 కోట్ల వసూళ్లు
Image Credit : Asianet News

100 కోట్ల వసూళ్లు

'డాక్టర్' సినిమా విజయం తమిళంలో ప్రియాంక మోహన్‌కు మొదటి సినిమాతోనే స్టార్ డమ్ ను తీసుకువచ్చింది.  'డాక్టర్' తర్వాత మళ్లీ శివకార్తికేయన్‌కు జోడీగా 'డాన్' సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా సుమారు 100 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.

47
వరుసగా ఫ్లాప్ సినిమాలు
Image Credit : Asianet News

వరుసగా ఫ్లాప్ సినిమాలు

వరుస ఆఫర్లు సాధించిన ప్రియాంక మోహనన్ .. ఆ తర్వాత సూర్యకు జోడీగా 'ఎతర్కుమ్ తునిందవన్' సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. తర్వాత ధనుష్‌తో 'కెప్టెన్ మిల్లర్', జయం రవితో 'బ్రదర్' వంటి సినిమాలు కూడా ప్రియాంకకు ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయాయి.

57
OG తో బ్లాక్ బస్టర్ హిట్
Image Credit : X/ThinkStudiosInd

OG తో బ్లాక్ బస్టర్ హిట్

మళ్లీ తెలుగులో సినిమాలు మొదలు పెట్టింది ప్రియాంక. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఓజీలో నటించి మెప్పించింది.  గత వారం రిలీజ్ అయిన  OG సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో తమిళంలో కవిన్ 9వ సినిమా మాత్రమే ఉంది. ఇది కాకుండా ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటించనున్నట్లు సమాచారం.

67
భారీగా సంపాదిస్తున్న హీరోయిన్
Image Credit : Instagram

భారీగా సంపాదిస్తున్న హీరోయిన్

షూటింగ్ లేని రోజుల్లో, కొందరు నటీమణులు షాప్ ఓపెనింగ్స్ చేసుకుంటూై బాగా డబ్బు సంపాదిస్తారు. ఆ విధంగా ప్రియాంక మోహన్ కూడా చాలా ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం అలవాటు చేసుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఓ దుకాణ ప్రారంభోత్సవానికి హాజరైంది. భద్రతతో వచ్చినప్పటికీ, అభిమానులు ఆమెను చుట్టుముట్టడంతో తోపులాటలో చిక్కుకుంది. అభిమానులు ఆమెను తోసేశారు.

77
విజయ్‌ను టార్గెట్ చేస్తున్న నెటిజన్లు
Image Credit : Instagram

విజయ్‌ను టార్గెట్ చేస్తున్న నెటిజన్లు

ఈ సంఘటనను కొందరు నెటిజన్లు కరూర్ ఘటనతో పోలుస్తున్నారు. అంటే, 200-300 మంది ఉన్న దుకాణ ప్రారంభోత్సవానికే భద్రతతో వచ్చిన ఆమె పరిస్థితి ఇలా ఉంటే.. ఎలాంటి భద్రత లేకుండా కరూర్‌లో 40,000 మంది గుమిగూడారు. అక్కడ నిలబడటానికి కూడా చోటులేక వారు ఎంత ఇబ్బంది పడి ఉంటారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఇకపై విజయ్ తన స్వలాభం కోసం ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టకూడదని సోషల్ మీడియాలో  విమర్శిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Ilaiyaraaja Secrets: మణిరత్నంను పరిచయం చేసింది నేనే.. ఇళయరాజా సంచలన వ్యాఖ్యలు!
Recommended image2
Rajinikanth Remuneration: కమల్‌ హాసన్‌తో సినిమాకి రజనీకి రికార్డ్ రెమ్యూనరేషన్‌.. ఇండియాలోనే టాప్‌
Recommended image3
రాంచరణ్ 'చికిరి' హుక్ స్టెప్ క్రెడిట్ జానీ మాస్టర్ కి దక్కలేదా, ఎమోషనల్ కామెంట్స్.. ఏం జరిగిందో తెలుసా
Related Stories
Recommended image1
సామాన్యుడిలా సూపర్ స్టార్, సినిమాలకు విరామం హిమాలయాల్లో రజనీకాంత్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
Recommended image2
4000 కోట్ల బడ్జెట్ మూవీలో సౌత్ స్టార్ హీరో, 5 పాన్ ఇండియా సినిమాలతో సందడి చేయనున్న నటుడు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved