- Home
- Entertainment
- Jabardasth లోకి నాగబాబు గ్రాండ్ రీ ఎంట్రీ.. జడ్జ్ చైర్ పై రష్మి కామెంట్స్ కు మెగా బ్రదర్ షాకింగ్ రిప్లై..
Jabardasth లోకి నాగబాబు గ్రాండ్ రీ ఎంట్రీ.. జడ్జ్ చైర్ పై రష్మి కామెంట్స్ కు మెగా బ్రదర్ షాకింగ్ రిప్లై..
జబర్దస్త్ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టైమ్ రానే వచ్చింది. ఈ కామెడీ షో సక్సెస్ లో భాగం అయిన నవ్వుల రేడు.. నాగబాబు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా దీనికి సబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యి వైరల్ అవుతోంది.

తగ్గిపోయిన జబర్దస్త్ వైభవం..
మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పి చాలా కాలమే అవుతుంది. రోజా, నాగబాబు ఇద్దరూ జబర్దస్త్ నుంచి తప్పుకున్న తర్వాత ఆ షోకి పర్మనెంట్ జడ్జీలు అంటూ ఎవరూ లేకుండా పోయారు. తాత్కాలికంగా మనో, ఖుష్బూ లాంటి వారిని జడ్జీలుగా పెట్టి మేనేజ్ చేస్తూ వచ్చారు. ఈ మధ్య ఎక్కువగా కృష్ణ భగవాన్ మాత్రం కనిపిస్తున్నారు. నాగబాబు, రోజా ఈ షో నుంచి వెళ్లిపోయిన తరువాత జబర్దస్త్ షో పాపులారిటీ కూడా తగ్గుతూ వచ్చింది.
మరోసారి రీ ఎంట్రీ ఇచ్చిన నాగబాబు
ఇక జబర్దస్త్ లోకి మరోసారి నాగబాబు రీ ఎంట్రీ ఇవ్వడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకప్పుడు ఈ షోకి జడ్జిగా వ్యవహరించిన నాగబాబు, నిర్మాణ సంస్థతో వచ్చిన విబేధాల కారణంగా షోను విడిచిపెట్టారు. ఆ తర్వాత రాజకీయాల్లో, ముఖ్యంగా జనసేన కార్యకలాపాల్లో బిజీగా మారడంతో ఈ కార్యక్రమానికి దూరమయ్యారు. తన కో జడ్జ్ అయిన రోజాతో కూడా రాజకీయ విభేదాలతో మాట మాట అనుకున్నారు. ఇక చాలా కాలం తరువాత జబర్దస్త్ జడ్జిగా నాగబాబు రీ ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.
జడ్జ్ చైర్ పై రష్మీ కామెంట్స్..
ఇన్నాళ్ల తర్వాత నాగబాబు మళ్లీ జబర్దస్త్ లో కనిపించడం అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహాన్ని తీసుకోచ్చింది. తాజాగా విడుదలైన ప్రోమోలో ఆయన రీ ఎంట్రీని ప్రోమో ద్వారా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా షోలో యాంకర్ రష్మీ, జడ్జి కుర్చీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "ఈ చైర్లోకి ఎంతమంది వచ్చినా, ఇది ఎప్పటికీ మీకే సొంతం" అంటూ నాగబాబును ఆహ్వానించింది.
జబర్దస్త్ పై నాగబాబు కామెంట్స్ వైరల్..
రష్మీ కామెంట్స్ కు స్పందించిన నాగబాబు మాట్లాడుతూ.. '' నేను జడ్జిగా షో నుంచి దూరమైనప్పటికీ, జబర్దస్త్ను ఎప్పుడూ దూరం పెట్టలేదు. నేను జడ్జిగా లేకపోయినా, ఈ షోను రెగ్యులర్గా చూస్తూనే ఉంటాను. కొన్ని సార్లు కమెడియన్స్ సరిగా చేయకపోతే.. వచ్చి కొట్టాలనిపించేది" అంటూ సరదా కామెంట్లు చేశారు. ఆయన మాటలతో జబర్దస్త్ లో నవ్వులు పూశాయి. అంతే కాదు '' ఇండస్ట్రీలో కామెడీ ఆర్టిస్టుల కొరత ఉన్న సమయంలో జబర్దస్త్ నుంచి ఎంతోమంది టాలెంటెడ్ కమెడియన్స్ టాలీవుడ్ లోకి వెళ్లారని నాగబాబు గుర్తుచేశారు.
ఇలాగే కంటీన్యూ అవుతారా?
నాగబాబు రీ ఎంట్రీతో అటు కంటెస్టెంట్లు, ఇటు ఆడియన్స్ లో ఉత్సాహం పెరిగింది. జబర్దస్త్ కు మళ్లీ మునుపటి మంచి రోజులు రాబోతున్నాయంటూ.. అభిమానులు కామెంట్స్ చేస్తునర్నారు. అయితే పొలిటికల్ గా బిజీగా ఉన్న నాగబాబు.. ఈ షోను ఇలాగే కంటీన్యూ చేస్తారా? లేక కొన్ని ఎపిసోడ్స్ కే పరిమితం అవుతారా అనేది చూడాల్సి ఉంది.

