MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 13 ఏళ్ళ క్రితం అతిథిగా వచ్చి మనసున్న మారాజులా నిలిచిన ప్రభాస్..ఆ సంఘటనే నిదర్శనం, ఏం జరిగిందంటే ?

13 ఏళ్ళ క్రితం అతిథిగా వచ్చి మనసున్న మారాజులా నిలిచిన ప్రభాస్..ఆ సంఘటనే నిదర్శనం, ఏం జరిగిందంటే ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గొప్ప మనసు గురించి అందరికీ తెలుసు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ప్రభాస్ శైలి. 13 ఏళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటన ప్రభాస్ వ్యక్తిత్వాన్ని నిదర్శనంగా నిలుస్తోంది.  

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 12 2025, 03:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వరుస చిత్రాలతో బిజీగా ప్రభాస్
Image Credit : Asianet News

వరుస చిత్రాలతో బిజీగా ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నారు. బాహుబలి, సలార్, కల్కి లాంటి చిత్రాలు ప్రభాస్ కి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని స్పిరిట్ మూవీ కూడా ప్రారంభం అవుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ప్రభాస్ లోని ఓ గొప్ప లక్షణం.

25
ఢీ 5 షోకి చీఫ్ గెస్ట్ గా ప్రభాస్
Image Credit : Asianet News

ఢీ 5 షోకి చీఫ్ గెస్ట్ గా ప్రభాస్

13 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగులో పాపులర్ డ్యాన్స్ షోలలో ఢీ ఒకటి. ఢీ డ్యాన్స్ షోకి స్టార్ హీరోలు అతిథులుగా వెళుతుంటారు. దాదాపు 13 ఏళ్ళ క్రితం ఢీ 5 షో గ్రాండ్ ఫినాలేకి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ షోకి ఉదయభాను హోస్ట్ గా చేశారు. ప్రభాస్ ఎంట్రీ ఇవ్వగానే ఉదయభాను మోకాళ్లపై నిలబడి ఫ్లవర్ బొకే ఇవ్వడం హైలైట్. ప్రభాస్ కూడా చిలిపిగా ఆమె దగ్గర నుంచి మోకాళ్లపై నిలబడి బొకే అందుకున్నారు. 

Related Articles

Related image1
జూ.ఎన్టీఆర్ 'వార్ 2' డిజాస్టర్ తో కియారా అద్వానీకి బిగ్ షాక్.. పాపం ఇలా జరిగిందేంటి ?
Related image2
సూపర్ స్టార్ కృష్ణ తన కొడుకు కోసం చేసిన చివరి ప్రయత్నం ఏంటో తెలుసా, చంద్రబాబు దగ్గరకి మ్యాటర్
35
విజేతగా నిలిచిన శేఖర్ మాస్టర్ టీం
Image Credit : Asianet News

విజేతగా నిలిచిన శేఖర్ మాస్టర్ టీం

గ్రాండ్ ఫినాలేలో శేఖర్ మాస్టర్ టీం, పోపీ మాస్టర్ టీం తలపడ్డాయి. రెండు టీమ్స్ నువ్వా నేనా అన్నట్లుగా డ్యాన్స్ చేసి న్యాయ నిర్ణేతలని, ప్రేక్షకులని మెప్పించాయి. కానీ విజేత ఒక్కరే కాబట్టి జడ్జీలు ఒక టీంని విన్నర్ గా డిసైడ్ చేశారు. విజేతని ప్రకటించడానికి ప్రభాస్ వేదికపైకి వెళ్లారు. శేఖర్ మాస్టర్, పోపీ మాస్టర్ ఇద్దరి చేయిని పట్టుకుని ప్రభాస్ మధ్యలో నిలుచుకున్నారు. కౌంట్ డౌన్ ముగియగానే శేఖర్ మాస్టర్ చేతిని పైకి లేపి ఆయన టీంని విజేతగా అనౌన్స్ చేశారు. 

45
గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్
Image Credit : Asianet News

గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్

అక్కడే ప్రభాస్ తాను మనసున్న మారాజుని అని నిరూపించుకున్నారు. శేఖర్ మాస్టర్ ని విజేతగా ప్రకటించిన వెంటనే ప్రభాస్  ఆయన చేతిని వదిలేసి.. నిరాశలో ఉన్న పోపీ మాస్టర్ ని ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. తనదైన శైలిలో ప్రభాస్ చిరునవ్వుతో ఆమెకి భరోసా ఇచ్చారు. రన్నరప్ గా నిలిచిన పోపీ మాస్టర్ టీంని ఓదార్చిన తర్వాతే ప్రభాస్ శేఖర్ మాస్టర్ టీం వద్దకు వెళ్లారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. 

55
ప్రభాస్ తో పాటు మెహర్ రమేష్, తాప్సి
Image Credit : instagram

ప్రభాస్ తో పాటు మెహర్ రమేష్, తాప్సి

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ గొప్ప మనసుకి ఇదే నిదర్శనం అని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ప్రభాస్ తో పాటు ఢీ 5 గ్రాండ్ ఫినాలేకి హీరోయిన్ తాప్సి కూడా అతిథిగా హాజరైంది. ఆ టైంలో ప్రభాస్, తాప్సి మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో నటిస్తున్నారు. అదే విధంగా బిల్లా డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా అతిథిగా పాల్గొన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: `కపుల్‌ ఫ్రెండ్లీ`కి ప్రభాస్‌ రివ్యూ, `వర్షం`తో పోలిక.. అదిరిపోయేలా `క్వీన్` టైటిల్‌ గ్లింప్స్
Recommended image2
Mamta Mohandas: ఎంగేజ్‌మెంట్ అయిన హీరోతో డేటింగ్.. పచ్చి మోసాన్ని బయటపెట్టిన నాగార్జున హీరోయిన్‌
Recommended image3
Balakrishna రిజెక్ట్ చేసిన సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టిన రాజశేఖర్‌.. బాలయ్యకి ఊహించని దెబ్బ
Related Stories
Recommended image1
జూ.ఎన్టీఆర్ 'వార్ 2' డిజాస్టర్ తో కియారా అద్వానీకి బిగ్ షాక్.. పాపం ఇలా జరిగిందేంటి ?
Recommended image2
సూపర్ స్టార్ కృష్ణ తన కొడుకు కోసం చేసిన చివరి ప్రయత్నం ఏంటో తెలుసా, చంద్రబాబు దగ్గరకి మ్యాటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved