- Home
- Entertainment
- Allu Arjun Remuneration : రాకా కోసం అల్లు అర్జున్, దీపికా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Allu Arjun Remuneration : రాకా కోసం అల్లు అర్జున్, దీపికా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
అట్లీ డైరెక్షన్ లో పాన్-వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న 'రాకా' కోసం ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా? అల్లు అర్జున్, దీపికా, అట్లీలలో ఎవరు ఎక్కువ వసూలు చేస్తున్నారంటే?

భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా
సౌత్ ఇండియాలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా 'రాకా'. పాన్-ఇండియా చిత్రంగా వస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్ హీరో కాగా, దీపికా హీరోయిన్. అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. 800 కోట్టలకు పైగా భారీ బడ్జెట్, పెద్ద స్టార్ కాస్ట్, అడ్వాన్స్‌డ్ VFX తో ఈ సినిమా ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇవ్వనుంది.
అల్లు అర్జున్ రెమ్యునరేషన్..?
ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. పోలీస్, రాక్షసుడు, తండ్రి పాత్రల్లో ఆయన కనిపించనున్నారు. ఇక ఈసినిమాలో నటించినందుకు ఆయన 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నారని సమాచారం. మరికొన్ని రిపోర్టుల ప్రకారం, ఆయన ప్రాఫిట్-షేరింగ్ పద్ధతిలో కూడా పారితోషికం తీసుకునే అవకాశం ఉందట. అదే జరిగితే, ఆయనకు అందే మొత్తం ఇంకా ఎక్కువ ఉండొచ్చు.
దీపికా పదుకొణె కు ఎంత ఇస్తున్నారంటే?
ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న దీపికా పదుకొణె ₹25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నారట. ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాల్లో 20 కోట్లు మాత్రమే తీసుకున్న ఆమె, పెళ్లి, పిల్లల తరువాత కూడా ఇంత పెద్ద మొత్తం అందుకోవడం ఆమె స్టార్ వాల్యూను చూపిస్తోంది.
నేషనల్ క్రష్ కు భారీ పారితోషికం..
ఇప్పటి వరకు స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా మాత్రమే నటించిన రష్మిక మందన, 'రాకా'లో విలన్‌గా కనిపించనున్నారట. ఆమె పారితోషికం 10 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఆమె హీరోయిన్‌గానే కాకుండా, విలన్‌గా కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నారు.
మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే..
రాకా మూవీలో మరో కీలక పాత్రలో నటించనున్నది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ పాత్ర కోసం ఆమెకు 5 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం.
జాన్వీ కపూర్ ఎంత తీసుకుంటుందంటే?
అలాగే మూడో హీరోయిన్‌గా నటించనున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా సుమారు 5 కోట్ల వరకు పారితోషికం అందుకోనున్నారట. ఇక నటీనటుల జీతాలు కాకుండా, కేవలం ప్రొడక్షన్, VFX పనుల కోసమే మూవీ టీమ్ ₹200 నుంచి ₹250 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం.
రాకా కోసం భారీ బడ్జెట్..
ఇక చివరగా, దర్శకుడు అట్లీ 'రాకా' చిత్రాన్ని డైరెక్ట్ చేయడానికి 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. నటీనటుల జీతాలు, నిర్మాణ ఖర్చులు, VFX ఖర్చులతో కలిపి ఈ సినిమా మొత్తం బడ్జెట్ 800 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.

