MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Venu Thottempudi: ఆ స్టార్ నటుడు బాగా క్లోజ్.. నాకోసం ఎన్నో చేశాడు.. వేణు తొట్టెంపూడి కామెంట్స్

Venu Thottempudi: ఆ స్టార్ నటుడు బాగా క్లోజ్.. నాకోసం ఎన్నో చేశాడు.. వేణు తొట్టెంపూడి కామెంట్స్

Venu Thottempudi: టాలీవుడ్ నటుడు వేణు తొట్టెంపూడి తన వ్యక్తిగత జీవిత రహస్యాలను పంచుకున్నారు. బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ, వెండితెరపైనే తన ముద్ర వేశారు. తండ్రి నుంచి ఎదురైన ఆంక్షలు, జగపతిబాబుతో ఉన్న స్నేహం.. 

2 Min read
Author : Pavithra D
Published : Apr 23 2026, 06:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హడావుడి లేకుండా, వివాదాలకు దూరంగా..
Image Credit : Venu Thottempudi\Twitter

హడావుడి లేకుండా, వివాదాలకు దూరంగా..

టాలీవుడ్‌లో ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’, ‘హనుమాన్ జంక్షన్’ వంటి క్లాసిక్ హిట్స్ అందుకున్న నటుడు వేణు తొట్టెంపూడి. పెద్దగా హడావుడి లేకుండా, వివాదాలకు దూరంగా ఉండే వేణుకు అత్యంత బలమైన రాజకీయ నేపథ్యం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. తాజాగా ఆయన తన బాల్యం, కుటుంబం, సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

25
తమిళనాడులో బాల్యం.. తండ్రి బెల్టు దెబ్బలు
Image Credit : Facebook/Venu Thottempudi

తమిళనాడులో బాల్యం.. తండ్రి బెల్టు దెబ్బలు

వేణు కాకినాడలో జన్మించినప్పటికీ, తండ్రి ఉద్యోగరీత్యా చెన్నై, మధురైలలో పెరిగారు. పాఠశాల విద్య నుంచే తమిళ భాషపై పట్టు సాధించారు. చిన్నతనం నుంచే సినిమాలంటే ప్రాణం ఉన్నప్పటికీ, ఆయన తండ్రికి మాత్రం సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు. "సినిమాలు మెదడును ఉత్తేజపరుస్తాయి తప్ప మరేం చేయవు" అని తండ్రి నమ్మేవారని వేణు గుర్తుచేసుకున్నారు. ఒకసారి తండ్రికి తెలియకుండా సినిమాకు వెళ్లి దొరికిపోవడంతో బెల్టుతో దెబ్బలు తిన్నానని, ఆ తర్వాత నెలకు ఒక సినిమాకు తండ్రి అనుమతి ఇచ్చారని నవ్వుతూ పంచుకున్నారు.

Related Articles

Related image1
VV Vinayak: రాఘవేంద్రరావు రిజెక్ట్ చేసిన పాటతో చంద్రబోస్ నంది అవార్డు గెలిచాడు.. వినాయక్ కామెంట్స్
Related image2
VV Vinayak: ఆది బడ్జెట్ 2 కోట్లే.. కానీ మార్నింగ్ షో పడగానే కోట్ల ఆఫర్..!
35
రాజకీయాల మధ్య సినీ ప్రయాణం
Image Credit : our own

రాజకీయాల మధ్య సినీ ప్రయాణం

వేణు తొట్టెంపూడి కుటుంబానికి రాజకీయాలతో విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన మేనమామ మాగంటి అంకినీడు మచిలీపట్నం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. బాబాయ్ కావూరు సాంబశివరావు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇక ప్రస్తుతం ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు వేణుకు బావమరిది. ఇంతటి రాజకీయ బలం ఉన్నప్పటికీ, వేణుకు రాజకీయాలపై ఆసక్తి లేదు. కేవలం కుటుంబ బాధ్యతగా తన బావమరిది తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని, ప్రజల జీవనశైలిని తెలుసుకోవడానికి అది ఒక మంచి అనుభవమని ఆయన తెలిపారు.

45
జగపతిబాబుతో సాన్నిహిత్యం.. ‘హనుమాన్ జంక్షన్’ జ్ఞాపకాలు
Image Credit : our own

జగపతిబాబుతో సాన్నిహిత్యం.. ‘హనుమాన్ జంక్షన్’ జ్ఞాపకాలు

తన తోటి నటుడు జగపతిబాబుతో వేణుకు మంచి అనుబంధం ఉంది. ‘హనుమాన్ జంక్షన్’ సమయంలో జగపతిబాబు ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారని, వేణుపై మరిన్ని సీన్లు, పాటలు ఉండేలా దర్శకులకు చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా విడుదలయ్యాక నిర్మాత ఎం.ఎస్. రాజు సరదాగా తనను ఆటపట్టించేవారని వేణు తెలిపారు. విభిన్న నటీనటులతో కలిసి పనిచేయడం, వారి నుండి కొత్త విషయాలను నేర్చుకోవడం తనకు ఇష్టమైన వ్యాపకమని ఆయన చెప్పారు.

55
భార్య అనుపమ మద్థతు.. హోమ్ మేకర్‌పై గౌరవం
Image Credit : Facebook/Venu Thottempudi

భార్య అనుపమ మద్థతు.. హోమ్ మేకర్‌పై గౌరవం

వేణు భార్య పేరు అనుపమ. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. తన సినీ వృత్తికి భార్య 100 శాతం మద్థతు ఇస్తుందని, పిల్లల బాధ్యతలను ఆమె చూసుకోవడం వల్లే తాను కెరీర్‌పై దృష్టి పెట్టగలిగానని ప్రశంసించారు. "ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఉద్యోగం హోమ్ మేకర్‌గా ఉండటం. దానికి అపారమైన సహనం కావాలి" అని వేణు తన భార్యపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Kamal Haasan: విచిత్ర సోదరులులోని పాట వెనుక కథ.. కమల్‌ రిక్వెస్ట్ తో ఎంజీఆర్‌ సినిమా నుంచి లేపిన ఇళయరాజా
Recommended image2
Toxic: గన్స్‌తో గూజ్ బంప్స్ తెప్పించే కుంగ్ ఫూ ఫైట్స్.. టాక్సిక్ కోసం యష్ కొత్త యాక్షన్ ప్లాన్..
Recommended image3
Savitri: సావిత్రి ప్రేమగా బావా అని పిలిచే స్టార్‌ ఎవరో తెలుసా? ఆయనతో మహానటి రిలేషన్‌ స్పెషల్‌
Related Stories
Recommended image1
VV Vinayak: రాఘవేంద్రరావు రిజెక్ట్ చేసిన పాటతో చంద్రబోస్ నంది అవార్డు గెలిచాడు.. వినాయక్ కామెంట్స్
Recommended image2
VV Vinayak: ఆది బడ్జెట్ 2 కోట్లే.. కానీ మార్నింగ్ షో పడగానే కోట్ల ఆఫర్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved