MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జూ.ఎన్టీఆర్ 'వార్ 2' డిజాస్టర్ తో కియారా అద్వానీకి బిగ్ షాక్.. పాపం ఇలా జరిగిందేంటి ?

జూ.ఎన్టీఆర్ 'వార్ 2' డిజాస్టర్ తో కియారా అద్వానీకి బిగ్ షాక్.. పాపం ఇలా జరిగిందేంటి ?

వార్ 2 మూవీ రిజల్ట్ తో హీరోయిన్ కియారా అద్వానీ కెరీర్ పై ప్రభావం పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా కియారాకి వైఆర్ఎఫ్ సంస్థ బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 11 2025, 11:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నిరాశపరిచిన వార్ 2
Image Credit : Asianet News

నిరాశపరిచిన వార్ 2

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల విడుదలైన భారీ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. భారీ నష్టాలు ఎదురయ్యాయి. వార్ 2 మూవీ వైఆర్ఎఫ్ సంస్థ ప్రతిష్టని దెబ్బ తీసింది. కియారా అద్వానీకి కూడా ఈ చిత్రంతో చిక్కులు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.

25
హృతిక్, ఎన్టీఆర్ నటించిన మల్టీస్టారర్ వార్ 2 
Image Credit : Youtube/YRF

హృతిక్, ఎన్టీఆర్ నటించిన మల్టీస్టారర్ వార్ 2 

సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14న భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించగా, ఇది ఎన్టీఆర్‌కి తొలి బాలీవుడ్ ఎంట్రీగా నిలిచింది. అయితే సినిమా మొదటి మొదటి వీకెండ్ ముగియగానే కలెక్షన్లు క్షీణించడంతో, బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

Related Articles

Related image1
Bigg Boss Telugu 9: ఎలిమినేషన్ కి దగ్గర్లో రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ.. బాంబు పేల్చిన నాగార్జున
Related image2
నరేంద్ర మోదీతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు.. ఆర్చరీకి బ్రాండ్ అంబాసిడర్ గా సరైనోడు, ఫ్యాన్స్ క్రేజీ రియాక్షన్
35
ఎన్టీఆర్ విజయాలకు బ్రేక్
Image Credit : instagram

ఎన్టీఆర్ విజయాలకు బ్రేక్

 సినిమా విఫలం కావడంతో ఎన్టీఆర్ విజయ పరంపరకు బ్రేక్ పడ్డట్లు అయింది. ఆయన గతంలో ఆర్ ఆర్ ఆర్, దేవర వంటి బ్లాక్‌బస్టర్లతో మంచి ఫామ్ లో ఉన్నారు. వార్ 2 ఫలితం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని బాగా నిరాశపరిచింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన కొత్త సినిమాపై పూర్తి దృష్టి పెట్టారు.మరోవైపు హృతిక్ రోషన్ మాత్రం ఈ ఫలితాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో “ఫలితం నన్ను ప్రభావితం చేయలేదు” అని పేర్కొన్నారు.

45
కియారాతో కాంట్రాక్టు రద్దు ?
Image Credit : X

కియారాతో కాంట్రాక్టు రద్దు ?

అయితే ఈ ఫ్లాప్ ఫలితంతో ఎక్కువ నష్టాన్ని ఎదుర్కొన్నది హీరోయిన్ కియారా అద్వానీ అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ (YRF) సంస్థతో కియారాకు మూడు సినిమాల కాంట్రాక్ట్ ఉన్నట్టు సమాచారం. ఆమెను వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో ప్రధాన మహిళా పాత్రలలో ఒకరిగా కొనసాగించాలని వైఆర్ఎఫ్ సంస్థ అనుకుంది.సినిమాలో గ్లామర్ పరంగా కూడా కియారా అద్వానీ హద్దులు పెట్టుకోలేదు. కియారా ఆమె కెరీర్‌లో తొలిసారిగా బికినీ లుక్లో కనిపించింది. కానీ సినిమా ఫలితం నిరాశ కలిగించడంతో వైఆర్ఎఫ్ భవిష్యత్తు ప్రాజెక్టులను తిరిగి పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ సమాచారం చెబుతోంది. కియారాతో వైఆర్ఎఫ్ సంస్థ కాంట్రాక్ట్ బ్రేక్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

55
ఇటీవలే తల్లి అయిన కియారా 
Image Credit : Youtube/YRF

ఇటీవలే తల్లి అయిన కియారా 

ఇప్పుడు కియారా అద్వానీ ప్రస్తుతం మేటర్నిటీ బ్రేక్లో ఉన్నారు. ఆమె ఇటీవల తన మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ కారణంగా కూడా ఆమె కొత్త ప్రాజెక్టులకు కొంత విరామం తీసుకున్నారు.సమాచారం ప్రకారం, వైఆర్ఎఫ్ సంస్థ తమ స్పై యూనివర్స్లో వచ్చే ప్రాజెక్టుల కోసం కొత్త తారలను పరిగణలోకి తీసుకుంటోందట. కియారా భవిష్యత్తులో ఆ ఫ్రాంచైజ్‌లో భాగమవుతారా లేదా అన్నది ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు.వార్ 2 వైఫల్యం తర్వాత బాలీవుడ్‌లో పెద్ద బడ్జెట్ యాక్షన్ చిత్రాలపై ఆలోచన మారుతున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులు కొత్త కథలు, భావోద్వేగాలు కోరుకుంటున్నారని నిర్మాతలు విశ్లేషిస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: `కపుల్‌ ఫ్రెండ్లీ`కి ప్రభాస్‌ రివ్యూ, `వర్షం`తో పోలిక.. అదిరిపోయేలా `క్వీన్` టైటిల్‌ గ్లింప్స్
Recommended image2
Mamta Mohandas: ఎంగేజ్‌మెంట్ అయిన హీరోతో డేటింగ్.. పచ్చి మోసాన్ని బయటపెట్టిన నాగార్జున హీరోయిన్‌
Recommended image3
Balakrishna రిజెక్ట్ చేసిన సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టిన రాజశేఖర్‌.. బాలయ్యకి ఊహించని దెబ్బ
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 9: ఎలిమినేషన్ కి దగ్గర్లో రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ.. బాంబు పేల్చిన నాగార్జున
Recommended image2
నరేంద్ర మోదీతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు.. ఆర్చరీకి బ్రాండ్ అంబాసిడర్ గా సరైనోడు, ఫ్యాన్స్ క్రేజీ రియాక్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved