- Home
- Entertainment
- కాపీ చేసే దర్శకులకే ప్రాధాన్యత, త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ కామెంట్స్.. హరిహర వీరమల్లుపై పరోక్షంగా సెటైర్లు
కాపీ చేసే దర్శకులకే ప్రాధాన్యత, త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ కామెంట్స్.. హరిహర వీరమల్లుపై పరోక్షంగా సెటైర్లు
గతంలో హీరోయిన్ గా రాణించిన పూనమ్ కౌర్ ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటుంది. అయితే ఆమె తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.

త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తున్న పూనమ్ కౌర్
నటి పూనమ్ కౌర్ గురించి పరిచయం అవసరం లేదు. గతంలో హీరోయిన్ గా రాణించిన పూనమ్ కౌర్ ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటుంది. అయితే ఆమె తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. అందుకు కారణం పూనమ్ కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై వరుస ట్వీట్లు చేస్తూ విమర్శలు గుప్పించడమే. కానీ ఆమె విమర్శలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడూ ఎక్కడా స్పందించలేదు.
హరిహర వీరమల్లుపై సెటైర్లు
కొన్నేళ్లుగా పూనమ్ కౌర్ ఇలా త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా పూనమ్ కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, అదే విధంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రాలపై పరోక్షంగా సెటైర్లు వేస్తూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
అలాంటి వారికే సక్సెస్, గుర్తింపు
పూనమ్ కౌర్ తన ట్విట్టర్ అకౌంట్ లో.. దర్శకుడు క్రిష్ ఒరిజినల్ కంటెంట్, బలమైన స్క్రిప్ట్ లు కలిగి ఉన్న దర్శకుడు. కానీ అలాంటి దర్శకుడికి సరైన గుర్తింపు లభించడం లేదు. పిఆర్ స్టంట్స్ చేస్తూ అనేక కాపీ రైట్ వివాదాల్లో చిక్కుకున్న దర్శకుడికి మాత్రం గుర్తింపు, విజయాలు దక్కుతున్నాయి అంటూ పరోక్షంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూనమ్ కౌర్ సెటైర్లు వేసింది.
ట్రైలర్ ఫైనల్ కట్ వీక్షించిన పవన్
పూనమ్ కౌర్ ఈ ట్విట్ చేయడానికి కారణం హరిహర వీరమల్లు మూవీనే అని నెటిజన్లు భావిస్తున్నారు. సరిగ్గా హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ కి ముందు పూనమ్ కౌర్ ఈ ట్వీట్ చేయడం విశేషం. హరిహర వీరమల్లు చిత్రానికి దర్శకుడు కృష్ణ జాగర్లమూడి. కొంత భాగం షూటింగ్ తర్వాత క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఏ ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ తన దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు.
హరిహర వీరమల్లు చిత్ర యూనిట్ తో త్రివిక్రమ్
హరిహర వీరమల్లు ట్రైలర్ నేడు గురువారం రోజు గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ట్రైలర్ ఫైనల్ కట్ రెడీ అయిన తర్వాత చిత్ర యూనిట్, అదే విధంగా తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి వీక్షించారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే పూనమ్ ట్వీట్ చేసింది. ఈ చిత్ర దర్శకుడైన క్రిష్ కి ప్రాధాన్యత ఇవ్వకుండా, త్రివిక్రమ్ కి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఉద్దేశంతో పూనమ్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.