MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురు అక్కినేని హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురు అక్కినేని హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

ఫిల్మ్ ఇండస్ట్రీలో తండ్రి కొడుకులతో కలిసి నటించిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఆతరం హీరోయిన్లలో శ్రీదేవి నాగేశ్వరావు, నాగార్జునతో కలిసి నటించారు, ఆతరువాత తరంలో కాజల్, తమన్నా లాంటి హీరోయిన్లు కూడా తండ్రి కొడుకులతో నటించారు. ఇక అక్కినేని వారసులైన  నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఈ ముగ్గరితో కలిసి నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : May 16 2025, 09:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు  స్టార్ హీరోల వారసులతో నటించి.. ఆతరువాత వారి తండ్రుల సరసన కూడా హీరోయిన్లు గా చేసిన సందర్భాలు ఉన్నాయి. శ్రీదేవి, జయసుధ, రాధిక, విజయశాంతి, రాధ పాత తరం హీరోయిన్లు, తమన్నా, కాజల్, రకుల్ ప్రీత్ లాంటి ఈ తరం కథానాయికలు కూడా తండ్రి కొడుకులతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన సందర్భాలు లేకపోలేదు. ఈక్రమంలో అక్కినేని  హీరోలతో  నటించిన హీరోయిన్ గురించి ఇప్పుడు చూద్దాం. 

25
pooja hegde

pooja hegde

తెలుగు సినీ పరిశ్రమలో పూజా హెగ్డే ఒక ప్రముఖ నటిగా గుర్తింపు పొందింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, నాగచైతన్య వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. కానీ ఇటీవల పూజా సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తూ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగులో రీఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తోంది.

Related Articles

Related image1
చెట్టెక్కిన మహేష్ బాబు, సినిమా చేయనని డైరెక్టర్ ముఖం మీదే చెప్పిన సూపర్ స్టార్
Related image2
స్టార్ కమెడియన్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన రాజమౌళి, ఎవరా నటుడు?
35

ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున రంగ ప్రవేశం చేశారు. ఆయన ప్రేమకథలూ, యాక్షన్ చిత్రాలూ కలగలిసిన పలు చిత్రాల్లో నటించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించారు. ఇప్పటికీ యాక్టివ్‌గా సినిమాలు చేస్తూ తనయులైన నాగచైతన్య, అఖిల్‌కు మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు.
 

45

తాజాగా అక్కినేని హీరోల ముగ్గురితో కలిసి పనిచేసిన ఏకైక హీరోయిన్ పూజా హెగ్డే అనే విషయం ఆసక్తికరంగా మారింది. పూజా హెగ్డే 2014లో నాగచైతన్యతో కలిసి "ఒక లైలా కోసం" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత అఖిల్ సరసన 2021లో విడుదలైన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాలో నటించింది. నాగార్జునతో  ఓ యాడ్ షూట్‌లో కలిసి పని  చేసింది పూజా హెగ్డే. అంతే కాదు త్వరలో రిలీజ్ కాబోతోన్న రజినీకాంత్ కూలి సినిమాలో పూజా ఐటమ్ సాంగ్ లో మెరవబోతోంది. ఈ సినిమాలో నాగార్జున కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ సాంగ్ లో నాగార్జునతో కలిసి స్టెప్పులేసిందట పూజా. 

55
Pooja Hegde

Pooja Hegde

ఈ విధంగా అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌లతో కలిసి పనిచేసిన ఏకైక నటి పూజా హెగ్డేగానే నిలిచింది. ప్రస్తుతం ఆమె కొత్త తెలుగు ప్రాజెక్ట్ కోసం చర్చల్లో ఉన్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో పూజా మరోసారి తెలుగు తెరపై మెరవనుందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
నాగ చైతన్య
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: ఫంక్షన్ లో మటన్ ముక్కల కోసం గొడవ, పోయిన బాలు పరువు..రోహిణీ మాజీ భర్త ఎంట్రీ
Recommended image2
Sequel Movies: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 7 ఇండియన్ సీక్వెల్స్.. 'ధురంధర్ 2' రికార్డులు బద్దలు కొడుతుందా?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: పారుతో ఆడుకున్న కార్తీక్- స్వప్నను లాక్ చేసిన శ్రీధర్- జ్యో నటన
Related Stories
Recommended image1
చెట్టెక్కిన మహేష్ బాబు, సినిమా చేయనని డైరెక్టర్ ముఖం మీదే చెప్పిన సూపర్ స్టార్
Recommended image2
స్టార్ కమెడియన్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన రాజమౌళి, ఎవరా నటుడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved