MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి డైనోసార్ లా వచ్చి పడడంతో అడ్రెస్ లేకుండా పోయిన ఎన్టీఆర్ మూవీ..రెండు చిత్రాలకు ఒక్కరే డైరెక్టర్

చిరంజీవి డైనోసార్ లా వచ్చి పడడంతో అడ్రెస్ లేకుండా పోయిన ఎన్టీఆర్ మూవీ..రెండు చిత్రాలకు ఒక్కరే డైరెక్టర్

చిరంజీవి, ఎన్టీఆర్ నటించిన చిత్రాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఆ రెండు చిత్రాలకు ఒక్కరే దర్శకుడు. మరి ఆ చిత్రాల రిజల్ట్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 09 2025, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : facebook / Megastar chiranjeevi

టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయితే ఆ పోటీ తీవ్రంగా ఉంటుంది. బాక్సాఫీస్ లెక్కలపై అందరి దృష్టి పడుతుంది. ఏ సినిమా సక్సెస్ అవుతుంది అనే ఉత్కంఠ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో చాలా మంది అగ్ర హీరోలతో పోటీ పడుతూ ఎదిగారు. అప్పట్లో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు లాంటి హీరోల చిత్రాలకు పోటీగా చిరంజీవి సినిమాలు విడుదలయ్యేవి. ఆ తర్వాత బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లతో పోటీ పడ్డారు. 

25
Image Credit : Facebook/Chiranjeevi konidela

ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలతో కూడా మెగాస్టార్ పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి, డైరెక్టర్ బి గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన ఇంద్ర చిత్రం. ఈ మూవీ భారీ అంచనాలతో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి వారం రోజుల ముందు జూనియర్ ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు చిత్రం విడుదలై థియేటర్స్ లో ప్రదర్శించబడుతోంది. అల్లరి రాముడు చిత్రం 2002 జూలై 18న విడుదలయింది. 

Related Articles

Related image1
ఆ దరిద్రం ఎందుకులే అని చిరంజీవి సినిమా రిజెక్ట్ చేసిన సీనియర్ హీరోయిన్.. మంచి పని చేసింది
Related image2
డాక్టర్ చదివిన ప్రియా శెట్టి బిగ్ బాస్ కి ఎందుకు వచ్చిందో తెలుసా..సోషల్ మీడియా మొత్తం ఆమె గురించే..
35
Image Credit : our own

ఇక చిరంజీవి నటించిన ఇంద్ర చిత్రం జూలై 24న విడుదలై డైనోసార్ లాగా అల్లరి రాముడుపై పడింది. అప్పటికే అంతంత మాత్రం టాక్ తో నడుస్తున్న అల్లరి రాముడు చిత్రం.. ఇంద్ర రిలీజ్ కావడంతో థియేటర్స్ లో అడ్రెస్ లేకుండా పోయింది. డిజాస్టర్ గా నిలిచింది. ఇంద్ర మాత్రం టాలీవుడ్ రికార్డులని తిరగరాసింది. 

45
Image Credit : our own

విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలకు దర్శకుడు ఒక్కరే.. ఆయనే బి గోపాల్. వాస్తవానికి అల్లరి రాముడు చిత్రం ఇంద్ర చిత్రానికి రెండు వారాల ముందే రిలీజ్ కావాలని బి గోపాల్ అన్నారు. కానీ సౌండ్ మిక్సింగ్ లో తేడా జరిగింది. దానిని సెట్ చేయడానికి మరో వారం అల్లరి రాముడు చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. దీని వాళ్ళ అల్లరి రాముడు, ఇంద్ర చిత్రాల మధ్య వారం మాత్రమే గ్యాప్ ఏర్పడింది. అల్లరి రాముడు ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుందని.. సెకండ్ హాఫ్ కథ బాగాలేదని అందుకే ఫ్లాప్ అయింది అని బి గోపాల్ అన్నారు. 

55
Image Credit : instagram

ఇంద్ర, అల్లరి రాముడు చిత్రాలకు రెండు వారాల గ్యాప్ ఉండిఉంటే.. అల్లరి రాముడు మూవీకి ఇంకా బెటర్ గా కలెక్షన్స్ ఉండేవి. ఆ మూవీలో ఆకుచాటు పిందె తడిసె సాంగ్ ని రీమిక్స్ చేయడం బాగా కుదిరింది అని బి గోపాల్ అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu Home Tour : వావ్ అనాల్సిందే.. మహేష్ బాబు ఇంద్రభవనం లోపల ఎలా ఉందో చూశారా?
Recommended image2
ఆ హీరోయిన్ విషయంలో చిరంజీవి కోరిక నెరవేరడం ఇక కష్టమేనా.. అందరూ ఆశించిన మూవీ, ట్విస్ట్ ఇచ్చిన మెగాస్టార్
Recommended image3
Single Queens: పెళ్లి వయసు దాటవేసిన బ్యూటీలు..లైఫంతా ఒంటరిగానే మిగిలిపోతారా?
Related Stories
Recommended image1
ఆ దరిద్రం ఎందుకులే అని చిరంజీవి సినిమా రిజెక్ట్ చేసిన సీనియర్ హీరోయిన్.. మంచి పని చేసింది
Recommended image2
డాక్టర్ చదివిన ప్రియా శెట్టి బిగ్ బాస్ కి ఎందుకు వచ్చిందో తెలుసా..సోషల్ మీడియా మొత్తం ఆమె గురించే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved