MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కృష్ణతో సినిమా, సీనియర్ నటుడిపై విరుచుకుపడ్డ ఎన్టీఆర్.. చివరికి తన తప్పు తెలుసుకుని ఏంచేశారంటే

కృష్ణతో సినిమా, సీనియర్ నటుడిపై విరుచుకుపడ్డ ఎన్టీఆర్.. చివరికి తన తప్పు తెలుసుకుని ఏంచేశారంటే

ఎన్టీఆర్, కృష్ణ మధ్య విభేదాలు ఉన్న సమయంలో ఒక ఊహించని సంఘటన జరిగింది. ఎన్టీఆర్, కృష్ణ విభేదాల వల్ల ఒక సీనియర్ నటుడు ఇబ్బంది పడ్డారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : May 22 2025, 08:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎన్టీఆర్, కృష్ణ విభేదాలు
Image Credit : Asianet News

ఎన్టీఆర్, కృష్ణ విభేదాలు

ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ మధ్య ఒక దశలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి ఎన్టీఆర్ ఆయనతో మాట్లాడటం మానేశారట. అల్లూరి సీతారామరాజు రిలీజ్ అయిన కొన్నేళ్ల తర్వాత కృష్ణ, ఎన్టీఆర్ మధ్య మరోసారి వివాదాలు భగ్గుమనేలా ఓ సంఘటన జరిగింది. దీని గురించి సీనియర్ నటుడు గిరిబాబు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.

25
కృష్ణతో సింహగర్జన
Image Credit : social media

కృష్ణతో సింహగర్జన

గిరిబాబు విలన్ గా అనేక చిత్రాల్లో నటించారు. ఆయన దర్శకుడిగా నిర్మాతగా కూడా సినిమాలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా గిరిబాబు సింహగర్జన అనే చిత్రాన్ని 1978లో నిర్మించారు. అదే సమయంలో ఎన్టీఆర్ సింహబలుడు అనే జానపద చిత్రంలో నటిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, గిరిబాబు చిత్రం కూడా జానపద కథాంశమే.

Related Articles

Related image1
RRR, రంగస్థలం చిత్రాలకి ఏమాత్రం తగ్గదు.. రామ్ చరణ్ తో మూవీపై సొంతూరిలో సుకుమార్ కామెంట్స్
Related image2
రవి మోహన్ కి ఊహించని షాక్, ప్రతి నెలా రూ.40 లక్షలు భరణం ఇవ్వాలంటూ ఆర్తి డిమాండ్
35
నా గురించి ఎన్టీఆర్ కి చాడీలు
Image Credit : our own

నా గురించి ఎన్టీఆర్ కి చాడీలు

గిరిబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పక్కన ఉన్న వాళ్ళు కొంతమంది ఆయనకి నా గురించి కంప్లైంట్ చేశారు. గిరిబాబు అనే వాడు ఒకడున్నాడు. మనకు వ్యతిరేకమైన కృష్ణతో మీకు పోటీగా ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. మనది సింహబలుడు అయితే.. వాళ్లది సింహగర్జన. రెండు కూడా జానపద చిత్రాలే అని నా గురించి బాగా చాడీలు చెప్పారు. దీంతో నిజమే అని నమ్మిన ఎన్టీఆర్ కి నాపై కోపం వచ్చింది. గిరిబాబుఅనే చోటా గాడు నాకే పోటీగా కృష్ణతో సినిమా చేస్తాడా అని ఎన్టీఆర్ ఫైర్ అయ్యారట.

45
ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి వివరణ
Image Credit : our own

ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి వివరణ

ఆయన నాపై కోపంతో ఉన్నారని నాకు తెలిసింది. దీంతో మరుసటి రోజు ఉదయాన్నే 6 గంటలకి ఆయన ఇంటికి వెళ్ళాను. ఇంట్లో ఉన్న అసిస్టెంట్లు అంతా నన్ను ఆశ్చర్యంగా చూశారు. వెంటనే వెళ్లి ఎన్టీఆర్ కి చెప్పారు. దీంతో ఆయన లోపలికి రమ్మని పిలిచారు. ఏం బ్రదర్ ఏమిటి అని కోపంగా అడిగారు. అన్నగారు మీతో 5 నిమిషాలు మాట్లాడాలి టైం ఇస్తారా అని అడిగా. సరే చెప్పండి అని అన్నారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చదువు పక్కన పెట్టి నటుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చాను. విలన్ గా నటిస్తున్నాను.

55
ఎన్టీఆర్ రియాక్షన్
Image Credit : Sr NTR

ఎన్టీఆర్ రియాక్షన్

సినిమా మీద ఆసక్తితో ప్రస్తుతం నిర్మాతగా కూడా ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగానే కృష్ణతో సింహ గర్జన అనే సినిమా చేస్తున్నాను. సింహబలుడు, సింహ గర్జన రెండు చిత్రాలు ఒకే తరహా కథ అని, మీకు పోటీగా చేస్తున్నామని ఎవరో మీకు చెప్పారు. మీకు పోటీగా సినిమా చేయడానికి నేను ఎవరిని అని చెప్పా. దీంతో ఆయనకే కాస్త కోపం తగ్గింది. స్టోరీ లైన్ కూడా వివరించారు. అప్పుడు పూర్తిగా ఎన్టీఆర్ గారికి అర్థమైంది. ఈ రెండు చిత్రాలకు సంబంధం లేదు. రెండు వేరువేరు కథలు. ఇట్స్ ఆల్ రైట్. వెళ్లి సినిమా బాగా తీయండి అని ఆయనే ప్రోత్సహించారు అని గిరిబాబు తెలిపారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సింహబలుడు షూటింగ్ కి వెళ్లి తన గురించి చాడీలు చెప్పిన వారిని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. గిరిబాబు గురించి అబద్దాలు ఎందుకు చెప్పారు అని ప్రశ్నించారట. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
కృష్ణ ఘట్టమనేని

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: రేపు జరగబోయేది ఈరోజే న్యూస్ పేపర్లో వస్తే.. ఊహకందని ట్విస్టులు బాబోయ్. ఈ వెబ్ సిరీస్ చూశారా.?
Recommended image2
కళ్యాణ్ పడాల తనూజ మధ్య మళ్లీ మొదలయ్యిందా..? ఏకంగా రింగు తొడిగిన బిగ్ బాస్ విన్నర్..
Recommended image3
3 ఏళ్లకంటే ఎక్కువ బ్రతకడన్న డాక్టర్లు, 30 ఏళ్లు హ్యాపీగా బ్రతికి చూపించిన ఏఎన్నార్.. ఎలా సాధ్యమయ్యింది?
Related Stories
Recommended image1
RRR, రంగస్థలం చిత్రాలకి ఏమాత్రం తగ్గదు.. రామ్ చరణ్ తో మూవీపై సొంతూరిలో సుకుమార్ కామెంట్స్
Recommended image2
రవి మోహన్ కి ఊహించని షాక్, ప్రతి నెలా రూ.40 లక్షలు భరణం ఇవ్వాలంటూ ఆర్తి డిమాండ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved