MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఈ ఘనత సాధ్యమైంది ఎన్టీఆర్ కొడుకుని కాబట్టి కాదు, నేను డూప్లికేట్ యాక్టర్ ని కాదు.. బాలయ్య సెటైర్లు వైరల్

ఈ ఘనత సాధ్యమైంది ఎన్టీఆర్ కొడుకుని కాబట్టి కాదు, నేను డూప్లికేట్ యాక్టర్ ని కాదు.. బాలయ్య సెటైర్లు వైరల్

నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో సన్మానం జరిగింది. ఈ ఈవెంట్ లో బాలయ్య ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలపై సెటైర్లు వేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 21 2025, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాలయ్యకి సన్మానం
Image Credit : Asianet News

బాలయ్యకి సన్మానం

గోవాలో గురువారం 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకలకు దేశం నలుమూలల నుంచి సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణకి అరుదైన గౌరవం లభించింది. ఈ ఈవెంట్ లో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి మురుగన్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. బాలకృష్ణని సన్మానించారు. బాలయ్య నటుడిగా 50 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సన్మానం జరిగింది.

25
ఈ ఘనత సాధ్యమైంది ఎన్టీఆర్ కొడుకుని కాబట్టి కాదు
Image Credit : Asianet News

ఈ ఘనత సాధ్యమైంది ఎన్టీఆర్ కొడుకుని కాబట్టి కాదు

ఈ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాలో టెక్నాలజీ డామినేషన్, విజువల్ ఎఫెక్ట్స్ వాడకం, ఈ తరం ఆర్టిస్టుల గురించి బాలయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. తనని తాను ఒరిజినల్ యాక్టర్ గా అభివర్ణించారు. బాలయ్య మాట్లాడుతూ.. ''నేను ఇండస్ట్రీలో నటుడిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నాను. ఇది ఎన్టీఆర్ కి తాను కొడుకు కావడం వల్ల సాధ్యం కాలేదు. ఇది నేను క్యారీ చేస్తున్న లెగసీ, సినిమా పట్ల నాకున్న నాలెడ్జ్ వల్లే సాధ్యం అయింది'' అని బాలకృష్ణ అన్నారు.

Related Articles

Related image1
రాజమౌళి కథ ఎలా మొదలుపెడతారు ? ఐడియా రాగానే ఫస్ట్ చెప్పేది ఎవరికి ?.. సీక్రెట్ బయటపెట్టిన రమా రాజమౌళి
Related image2
తారకరత్న ధైర్యానికి మెచ్చుకోవచ్చు, తొలి సినిమాతోనే చిరంజీవికి పోటీగా దిగాడు.. చివరికి ఏమైందో తెలుసా
35
నేను ఒరిజినల్ యాక్టర్ ని..
Image Credit : 14 reels plus

నేను ఒరిజినల్ యాక్టర్ ని..

బాలకృష్ణ ఇంకా మాట్లాడుతూ.. ''సినిమా పట్ల నాకున్న అవగాహనకి గర్వపడుతున్నాను. కానీ ప్రస్తుతం సినిమా మేకింగ్ విధానం పూర్తిగా మారిపోయింది. టెక్నాలజీ డామినేషన్ వచ్చేసింది. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వాడుతున్నారు. నా సినిమాలు లార్జర్ దేన్ లైఫ్ గా ఉంటాయి. కాబట్టి నేను ఎంచుకునే కథలు చాలా కీలకం. నా సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కేవలం అవసరమైన చోటు మాత్రమే వాడతాం. కొన్ని సినిమాల్లో ప్రతిదానికీ విజువల్ ఎఫెక్ట్స్ వాడేస్తున్నారు. కనీసం హీరోలు సెట్స్ కి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది హీరోలు గ్రీన్ మ్యాట్స్ మధ్యలో నటించి వెళ్లిపోతున్నారు. కానీ నేను అలా కాదు. నేను ఒరిజినల్ యాక్టర్ ని. డూప్లికేట్ కాదు'' అని బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

45
భార్యకి కృతజ్ఞతలు చెప్పిన బాలయ్య
Image Credit : X/Balakrishna

భార్యకి కృతజ్ఞతలు చెప్పిన బాలయ్య

అదేవిధంగా బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి గురించి కూడా మాట్లాడారు. మా తల్లి మరణం తర్వాత బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి సహకరించిన తన భార్య, ఇతర కుటుంబ సభ్యులకు బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. 

55
బాలకృష్ణ సినిమాలు
Image Credit : Asianet News

బాలకృష్ణ సినిమాలు

బాలకృష్ణ తన 50 ఏళ్ళ కెరీర్ లో రౌడీ ఇన్స్పెక్టర్, మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్య, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, భైరవ ద్వీపం, ఆదిత్య 369 లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించారు. గురువారం ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు నవంబర్ 28 వరకు కొనసాగుతాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
నందమూరి బాలకృష్ణ
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Prime Video top 10 Movies: ఓటీటీలో `నారీ నారీ నడుమ మురారి` సంచలనం.. ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌.. టాప్‌ 10 మూవీస్‌
Recommended image2
Rajinikanth MGR: రజినీ జీవితాన్ని మార్చేసిన ఎంజీఆర్ 'మాస్టర్ ప్లాన్'! ఆ స్టైల్ ఎందుకంత నచ్చలేదంటే?
Recommended image3
Zero Flop Record: ఫ్లాప్ ఎరుగని హీరో.. చేసిన 3 సినిమాలు బ్లాక్‌బస్టర్.. ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
రాజమౌళి కథ ఎలా మొదలుపెడతారు ? ఐడియా రాగానే ఫస్ట్ చెప్పేది ఎవరికి ?.. సీక్రెట్ బయటపెట్టిన రమా రాజమౌళి
Recommended image2
తారకరత్న ధైర్యానికి మెచ్చుకోవచ్చు, తొలి సినిమాతోనే చిరంజీవికి పోటీగా దిగాడు.. చివరికి ఏమైందో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved