MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prime Video Top 10 Movies: ఓటీటీలో `నారీ నారీ నడుమ మురారి` సంచలనం.. ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌.. టాప్‌ 10 మూవీస్‌

Prime Video Top 10 Movies: ఓటీటీలో `నారీ నారీ నడుమ మురారి` సంచలనం.. ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌.. టాప్‌ 10 మూవీస్‌

Prime Video top 10 Movies: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మన సినిమాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. యంగ్‌ హీరో మూవీ ఇండియా వైడ్‌గా నెంబర్‌ 1 స్థానంలో ట్రెండ్‌ అవుతుంది. ప్రైమ్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్న టాప్‌ 10 సినిమాలేంటో చూద్దాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 13 2026, 06:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రైమ్‌ వీడియోస్‌ ఇండియా టాప్‌ 10 మూవీస్‌.. శర్వానంద్‌ దూకుడు
Image Credit : Asianet News

ప్రైమ్‌ వీడియోస్‌ ఇండియా టాప్‌ 10 మూవీస్‌.. శర్వానంద్‌ దూకుడు

అమెజాన్‌ ప్రైమ్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్న టాప్‌ 10 చిత్రాల్లో తెలుగు మూవీ మొదటి స్థానంలో ఉంది. అదే `నారీ నారీ నడుమ మురారి`. శర్వానంద్‌ హీరోగా రూపొందిన చిత్రమిది. ఇందులో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ మూవీ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. థియేటర్లలో సత్తా చాటింది. దాదాపు రూ.25కోట్ల వరకు వసూలు చేసింది. సరైన థియేటర్లు లేక లిమిటెడ్‌గా రిలీజ్‌ అయ్యింది. అయినా మెప్పించింది. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం దుమ్ములేపుతుంది. ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సాగుతుంది. నరేష్‌ కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది.

25
ప్రైమ్‌ టాప్‌ 2లో `అన్నగారు వస్తారు`
Image Credit : Asianet News

ప్రైమ్‌ టాప్‌ 2లో `అన్నగారు వస్తారు`

ప్రైమ్‌ వీడియోస్‌లో టాప్‌ 2లో ఉన్న మూవీ కార్తీ, కృతి శెట్టి నటించిన `వా వాతియార్‌`(అన్నగారు వస్తారు) ఉంది. ఈ మూవీ కూడా ఇండియా వైడ్‌గా దుమ్మురేపుతుంది. యాక్షన్‌ కామెడీగా ఈ మూవీ తెరకెక్కింది. నలన్‌ కుమారస్వామి దర్శకత్వం వహించారు. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు ఓటీటీలో దీన్ని తెగ చూస్తున్నారు. ఇక మూడో స్థానంలో హాలీవుడ్‌ మూవీ `ది వ్రెకింగ్‌ క్యూ` ఉంది. ఇందులో జాసన్‌ మోమో, డేవ్‌ బాటిస్టా ప్రధాన పాత్రలు పోషించారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రం ఇండియాలో ప్రైమ్‌లో టాప్‌ 3లో ట్రెండ్‌ కావడం విశేషం.

Related Articles

Related image1
Funky First Review: `ఫంకీ` మూవీ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లో నవ్వుల సునామీ.. కానీ మైనస్‌ ఏంటంటే?
Related image2
Manasa Varanasi: మిస్‌ ఇండియా టైటిల్‌ గెలిస్తే ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా? అసలు నిజాలు బయటపెట్టిన మానస వారణాసి
35
టాప్‌ 4లో శోభితా దూళిపాళ `చీకటిలో`
Image Credit : Asianet News

టాప్‌ 4లో శోభితా దూళిపాళ `చీకటిలో`

ప్రైమ్‌లో టాప్‌ 4లో ఉన్నది శోభితా దూళిపాళ నటించిన `చీకటిలో`. ఈ యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ గత నెలలో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్‌ అయ్యింది. ఇందులో శోభితాతోపాటు విశ్వదేవ్‌ రాచకొండ ప్రధాన పాత్ర పోషించారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రారంభంలో పెద్దగా ఆదరణ పొందలేదు. కానీ ఇప్పుడు ఇండియా వైడ్‌గా టాప్‌ 4లో ట్రెండ్‌ కావడం విశేషం. టాప్‌ 5లో తమిళ చిత్రం `మహాసేనా` ఉంది. మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి దినేషన్‌ కలైసెల్వన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో వేమల్‌, శృష్టి, యోగిబాబు నటించారు. థియేట్రికల్‌గా ఆడలేదు. కానీ ఓటీటీలో దుమ్మురేపుతుంది.

45
టాప్‌ 6లో సూరి `మామన్‌`
Image Credit : prime video

టాప్‌ 6లో సూరి `మామన్‌`

టాప్‌ 6లో సూరి నటించిన `మామన్‌` ఉంది. ఇది యాక్షన్‌ డ్రామాగా గతేడాది విడుదలయ్యింది. ప్రశాంత్‌ పాండియరాజ్‌ దర్శకత్వం వహించారు.రాజ్‌ కిరణ్‌, ఐశ్వర్య లక్ష్మీ, స్వసిక, బాల శరవనన్‌, బాబా భాస్కర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది మేలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఓటీటీలో కూడా విశేష ఆదరణ పొందుతుండటం విశేషం.

55
టాప్‌ 7-10 చిత్రాలివే
Image Credit : prime videos

టాప్‌ 7-10 చిత్రాలివే

ఏడో స్థానంలో బాలీవుడ్‌ మూవీ `120 బహదూర్‌` ఉంది. ఫర్హాన్‌ అక్తర్‌ నటించిన చిత్రమిది. హిస్టారికల్‌ వార్‌ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి రాజ్‌నీష్‌ ఘాయ్‌ రూపొందించారు. ఫర్హాన్‌ అక్తర్‌ ఆర్మీ సైనికుడిగా నటించారు. డైరెక్ట్ ఓటీటీలోనే విడుదలై ట్రెండింగ్‌లో ఉంది. 8వ స్థానంలో `జగ్నుమాః ది ఫేబుల్‌` ఉంది. డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి రామ్‌ రెడ్డి దర్శకుడు. మనోజ్‌ బాయ్‌ పాయ్‌, దీపక్‌ డాబ్రియల్, ప్రియాంక బోస్‌ నటించారు. 9వ స్థానంలో జస్పాల్‌ సింగ్‌ సంధు ప్రధాన పాత్రలో నటించిన `వాధ్‌` ఉంది. విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ మూవీ ఓటీటీలో సత్తా చాటుతోంది. ఇక 10వ స్థానంలో `ది స్ట్రేంజర్‌` అనే హర్రర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం ఉంది. ఇవన్నీ ప్రైమ్‌లో ఇండియా వైడ్‌గా టాప్‌ 10  స్థానంలో  ఉన్నాయి. వీటిలో మొత్తంగా తెలుగు సినిమా మొదట్లో ఉండటం విశేషం.  

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth MGR: రజినీ జీవితాన్ని మార్చేసిన ఎంజీఆర్ 'మాస్టర్ ప్లాన్'! ఆ స్టైల్ ఎందుకంత నచ్చలేదంటే?
Recommended image2
Zero Flop Record: ఫ్లాప్ ఎరుగని హీరో.. చేసిన 3 సినిమాలు బ్లాక్‌బస్టర్.. ఎవరో తెలుసా?
Recommended image3
Funky First Review: `ఫంకీ` మూవీ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లో నవ్వుల సునామీ.. కానీ మైనస్‌ ఏంటంటే?
Related Stories
Recommended image1
Funky First Review: `ఫంకీ` మూవీ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లో నవ్వుల సునామీ.. కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image2
Manasa Varanasi: మిస్‌ ఇండియా టైటిల్‌ గెలిస్తే ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా? అసలు నిజాలు బయటపెట్టిన మానస వారణాసి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved