MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్వయంగా ఆర్టీసీ బస్సు నడిపిన బాలయ్య.. బాగా నడుపుతున్నానా అని అడిగితే ఫ్యాన్స్ ఏమన్నారో చూడండి

స్వయంగా ఆర్టీసీ బస్సు నడిపిన బాలయ్య.. బాగా నడుపుతున్నానా అని అడిగితే ఫ్యాన్స్ ఏమన్నారో చూడండి

నందమూరి బాలకృష్ణ హిందూపురంలో స్త్రీశక్తి ఉచిత బస్సు పథకంలో భాగంగా బస్సుని నడిపారు. ఆ దృశ్యాలు ఈ కథనంలో చూడండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 15 2025, 09:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు
Image Credit : Facebook/Balakrishna

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు

స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉచిత బస్సు పథకాన్ని సీఎం చంద్రబాబు విజయవాడలో ప్రారంభించారు. రాష్ట్రం మొత్తం ఉచిత బస్సు పథకం అమలవుతోంది. నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

25
హిందూపురంలో బస్సు నడిపిన బాలయ్య
Image Credit : X/RakhiNbk

హిందూపురంలో బస్సు నడిపిన బాలయ్య

బాలయ్య హిందూపురంలో స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా పాల్గొన్నారు. స్త్రీ శక్తి పథకంలో భాగంగా బాలయ్య హిందూపురంలో స్వయంగా ఆర్టీసీ బస్సు నడిపారు. ఎంతో హుషారుగా బాలయ్య బస్సుని డ్రైవ్ చేశారు. 

Related Articles

Related image1
ఒకే ఏడాది 7 సార్లు పోటీ పడ్డ కృష్ణ, చిరంజీవి..అడ్రస్ లేకుండా పోయిన సినిమాలు, పైచేయి ఎవరిదో తెలుసా
Related image2
మొన్న హరిహర వీరమల్లు, నిన్న వార్ 2..దెబ్బ పడింది అందుకే, విశ్వంభర మూవీకి వార్నింగ్ బెల్
35
బాగా నడుపుతున్నానా ?
Image Credit : X/RakhiNbk

బాగా నడుపుతున్నానా ?

హిందూపురం బస్ స్టేషన్ నుంచి చాముండేశ్వరి కాలనీ మీదుగా బాలయ్య తన నివాసం వరకు బస్సుని డ్రైవ్ చేశారు. బాలయ్య బస్సు నడుపుతుండగా ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. బాలయ్య బస్సు నడుపుతూ బాగా నడుపుతున్నానా అని ఫ్యాన్స్ ని అడిగారు. దీనితో అభిమానులు సూపర్ గా డ్రైవ్ చేస్తున్నారు. డ్రైవర్ రాముడు, లారీ డ్రైవర్ అంటూ ఎన్టీఆర్, బాలకృష్ణ సినిమా టైటిల్స్ తో కేరింతలు కొట్టారు. డ్రైవర్ రాముడు చిత్రంలో ఎన్టీఆర్, లారీ డ్రైవర్ చిత్రంలో బాలయ్య డ్రైవర్లుగా నటించారు. 

హిందూపురంలో బస్సు నడిపిన #బాలయ్య 🥰❤️‍🔥

మరో సూపర్ సిక్స్ హామీ, "స్త్రీ శక్తి - ఉచిత బస్సు ప్రయాణ పథకం" ప్రారంభం.

హిందూపురం RTC బస్ స్టేషన్ నుండి చౌడేశ్వరి కాలనీ మీదగా తన నివాసం వరకు బస్సు నడిపిన నందమూరి బాలకృష్ణ గారు. #NandamuriBalakrishna#HindupurMLApic.twitter.com/MxQdEABYRR

— ʀᴀᴋʜɪ ᵐᵃʰᵃʳᵃᵃʲ ɴʙᴋ ✨️ (@RakhiNbk) August 15, 2025

45
మూడోసారి హిందూపురంకి ఎమ్మెల్యేగా
Image Credit : Facebook/Nandamuri Balakrishna

మూడోసారి హిందూపురంకి ఎమ్మెల్యేగా

బాలయ్య బస్సు నడుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ 2014 నుంచి హిందూపురంకి ఎమ్మెల్యే గా ఎన్నికవుతున్నారు. 2024 ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించారు. 

55
బాలయ్య సినిమాలు
Image Credit : Facebook/Balakrishna

బాలయ్య సినిమాలు

సినిమాల విషయానికి వస్తే బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో చిత్రం ప్రారంభం కానుంది. వీటితో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలోమరోసారి నటించేందుకు బాలయ్య సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి కాంబినేషన్ లో గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు వచ్చాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
నందమూరి బాలకృష్ణ
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth MGR: రజినీ జీవితాన్ని మార్చేసిన ఎంజీఆర్ 'మాస్టర్ ప్లాన్'! ఆ స్టైల్ ఎందుకంత నచ్చలేదంటే?
Recommended image2
Zero Flop Record: ఫ్లాప్ ఎరుగని హీరో.. చేసిన 3 సినిమాలు బ్లాక్‌బస్టర్.. ఎవరో తెలుసా?
Recommended image3
Funky First Review: `ఫంకీ` మూవీ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లో నవ్వుల సునామీ.. కానీ మైనస్‌ ఏంటంటే?
Related Stories
Recommended image1
ఒకే ఏడాది 7 సార్లు పోటీ పడ్డ కృష్ణ, చిరంజీవి..అడ్రస్ లేకుండా పోయిన సినిమాలు, పైచేయి ఎవరిదో తెలుసా
Recommended image2
మొన్న హరిహర వీరమల్లు, నిన్న వార్ 2..దెబ్బ పడింది అందుకే, విశ్వంభర మూవీకి వార్నింగ్ బెల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved