MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మొన్న హరిహర వీరమల్లు, నిన్న వార్ 2..దెబ్బ పడింది అందుకే, విశ్వంభర మూవీకి వార్నింగ్ బెల్

మొన్న హరిహర వీరమల్లు, నిన్న వార్ 2..దెబ్బ పడింది అందుకే, విశ్వంభర మూవీకి వార్నింగ్ బెల్

ఇటీవల విడుదలైన చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అనేవి పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారిపోయాయి. విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేకుంటే సినిమా రిజల్ట్ తారుమారు అయిపోతోంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 15 2025, 08:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గ్రాఫిక్స్ తో మాయాజాలం
Image Credit : Mega Surya Productions, YRF, UV creations

గ్రాఫిక్స్ తో మాయాజాలం

ఒకప్పుడు విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అంటే హాలీవుడ్ చిత్రాలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా ఇండియన్ సినిమా దర్శకులు ముఖ్యంగా తెలుగు దర్శకులు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమాలు చేస్తున్నారు. రాజమౌళి, నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ లాంటి దర్శకులు గ్రాఫిక్స్ తో మాయాజాలం సృష్టిస్తున్నారు. అయితే కొందరు దర్శకులు మాత్రం అనుకున్న స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ రాబట్టడంలో ఫెయిల్ అవుతున్నారు. 

DID YOU
KNOW
?
జానపద చిత్రంగా విశ్వంభర
చాలా ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి జానపద కథాంశంతో నటిస్తున్న చిత్రం విశ్వంభర. ఈ మూవీ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
25
హరిహర వీరమల్లు మూవీకి దెబ్బ పడింది అందుకే
Image Credit : X

హరిహర వీరమల్లు మూవీకి దెబ్బ పడింది అందుకే

గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంలో గ్రాఫిక్స్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఆ మూవీ పరాజయం చెందడానికి చెత్త గ్రాఫిక్స్ కూడా ఒక కారణం. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం కూడా గ్రాఫిక్స్ విషయంలో ట్రోలింగ్ ఎదుర్కొంది. ఈ మూవీ కథ బావున్నప్పటికీ గ్రాఫిక్స్ క్వాలిటీ పరమ చెత్తగా ఉందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 

Related Articles

Related image1
ఒకే ఏడాది 7 సార్లు పోటీ పడ్డ కృష్ణ, చిరంజీవి..అడ్రస్ లేకుండా పోయిన సినిమాలు, పైచేయి ఎవరిదో తెలుసా
Related image2
థియేటర్ లోనే చేతులెత్తి మొక్కిన చాగంటి.. మహావతార్ నరసింహ మూవీ చూసి ఏమన్నారో తెలుసా
35
వార్ 2 పై ట్రోలింగ్
Image Credit : youtube print shot/yrf

వార్ 2 పై ట్రోలింగ్

గురువారం రోజు విడుదలైన ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల వార్ 2 చిత్రానిది కూడా అదే పరిస్థితి. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్, ఎన్టీఆర్ ని చూపించిన విధానం ప్రేక్షకులని ఆకట్టుకోవడం లేదు. ఈ మూవీలో ఎన్టీఆర్ లుక్స్, గ్రాఫిక్స్ పై ట్రోలింగ్ జరుగుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేకుంటే సినిమాపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో ఈ చిత్రాలే ఉదాహరణ. 

45
అందరి దృష్టి చిరంజీవి విశ్వంభరపైనే.. 
Image Credit : Instagram/UV Creations

అందరి దృష్టి చిరంజీవి విశ్వంభరపైనే.. 

ఇప్పుడు ఫోకస్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంపై మళ్లింది. ఈ చిత్రంలో 70 శాతం విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు గతంలోనే తెలిపారు. ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయినప్పుడు ట్రోలింగ్ జరిగింది.గ్రాఫిక్స్ కారణంగా టీజర్ కి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ వల్లే ఈ చిత్రం ఆలస్యం అవుతోందని టాక్ కూడా వినిస్తోంది. 

55
విశ్వంభర చిత్రానికి వార్నింగ్ బెల్
Image Credit : Instagram/UV Creations

విశ్వంభర చిత్రానికి వార్నింగ్ బెల్

ఈ తరుణంలో విశ్వంభర మూవీ గ్రాఫిక్స్ అవుట్ పుట్, క్వాలిటీ విషయంలో మెగా అభిమానులు టెన్షన్ పడుతున్నారు. హరిహర వీరమల్లు, వార్ 2 చిత్రాలు ఎదుర్కొంటున్న విమర్శలు విశ్వంభర చిత్రానికి వార్నింగ్ బెల్ లాంటివి అని అంటున్నారు. మరి దర్శకుడు వశిష్ఠ గ్రాఫిక్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ? ఏ మేరకు క్వాలిటీ విజువల్స్ రాబట్టి విజయం సాధిస్తారు అనేది వేచి చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu Home Tour : వావ్ అనాల్సిందే.. మహేష్ బాబు ఇంద్రభవనం లోపల ఎలా ఉందో చూశారా?
Recommended image2
ఆ హీరోయిన్ విషయంలో చిరంజీవి కోరిక నెరవేరడం ఇక కష్టమేనా.. అందరూ ఆశించిన మూవీ, ట్విస్ట్ ఇచ్చిన మెగాస్టార్
Recommended image3
Single Queens: పెళ్లి వయసు దాటవేసిన బ్యూటీలు..లైఫంతా ఒంటరిగానే మిగిలిపోతారా?
Related Stories
Recommended image1
ఒకే ఏడాది 7 సార్లు పోటీ పడ్డ కృష్ణ, చిరంజీవి..అడ్రస్ లేకుండా పోయిన సినిమాలు, పైచేయి ఎవరిదో తెలుసా
Recommended image2
థియేటర్ లోనే చేతులెత్తి మొక్కిన చాగంటి.. మహావతార్ నరసింహ మూవీ చూసి ఏమన్నారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved