MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వెంకటేష్‌, నాగార్జున కలిసి నటించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా? బామ్మర్ది కోసం బావ పెద్ద మనసు

వెంకటేష్‌, నాగార్జున కలిసి నటించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా? బామ్మర్ది కోసం బావ పెద్ద మనసు

నాగార్జున, వెంకటేష్‌ కలిసి పూర్తిస్థాయిలో ఒక్క మూవీ కూడా చేయలేదు. వరుసకి బావ, బామ్మర్దులు అయినా సినిమాలు మాత్రం చేయలేదు. అయితే వెంకీ కోసం నాగ్‌ ఓ మూవీలో మెరిశారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 29 2025, 09:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వెంకటేష్‌ చెల్లిని పెళ్లి చేసుకున్న నాగార్జున
Image Credit : Asianet News

వెంకటేష్‌ చెల్లిని పెళ్లి చేసుకున్న నాగార్జున

నాగార్జున, వెంకటేష్‌ ఇండస్ట్రీలో టాప్‌ హీరోలు. అంతేకాదు ఇద్దరు బావబామ్మర్దులు కూడా. వెంకీ చెల్లి లక్ష్మిని నాగార్జునకి ఇచ్చి పెళ్లి చేశారు. వారికి జన్మించిన అబ్బాయే నాగచైతన్య. ఆ తర్వాత నాగ్‌, లక్ష్మి విడిపోయారు. కొంత గ్యాప్‌తో హీరోయిన్‌ అమలని పెళ్లి చేసుకున్నారు నాగార్జున. అయితే పేరుకి బావ బామ్మర్దులే అయినా నాగార్జున, వెంకటేష్‌ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. కాకపోతే ఓ మూవీలో మాత్రం ఇద్దరూ మెరిశారు. బామ్మర్ది కోసం బావ పెద్దమనసు చేసుకున్నారు.

25
`త్రిమూర్తులు` సినిమాలో మెరిసిన వెంకీ, నాగ్‌
Image Credit : stockPhoto

`త్రిమూర్తులు` సినిమాలో మెరిసిన వెంకీ, నాగ్‌

వెంకటేష్‌, నాగార్జున కలిసి కనిపించిన సినిమా `త్రిమూర్తులు`. వెంకటేష్‌, అర్జున్‌, రాజేంద్రప్రసాద్‌ హీరోలుగా నటించిన చిత్రమిది. కె మురళీ మోహనరావు దర్శకత్వం వహించారు. 1987లో ఈ మూవీ విడుదలైంది. ఇందులో ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోలు, హీరోయిన్లంతా కలిసి కనిపించారు. ఓ సీన్‌ కోసం ఇండస్ట్రీని దించారు. అలా బామ్మర్ది వెంకటేష్ కోసం బావ నాగార్జున కూడా ఇందులో నటించేందుకు ఒప్పుకున్నారు.

Related Articles

Related image1
సావిత్రి ఎత్తుకున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా? ఇటీవల రెండు హిట్స్ అందుకున్న సూపర్‌ స్టార్‌.. టాలీవుడ్‌ రిచెస్ట్ హీరో
Related image2
చిరంజీవి లేటెస్ట్ లగ్జరీ హౌజ్‌ని చూశారా? వామ్మో రాజభవనమే.. ఎన్ని కోట్లు పెట్టి కట్టారో తెలుసా?
35
వెంకటేష్‌ `త్రిమూర్తులు`లో గెస్ట్ రోల్‌ చేసిన నాగార్జున
Image Credit : stockPhoto

వెంకటేష్‌ `త్రిమూర్తులు`లో గెస్ట్ రోల్‌ చేసిన నాగార్జున

ఈ సినిమాలో వెంకటేష్‌, అర్జున్‌, రాజేంద్రప్రసాద్‌తోపాటు నాగార్జున గెస్ట్ రోల్‌ చేశారు. వీరే కాదు చిరంజీవి, బాలయ్య, కృష్ణంరాజు, కృష్ణ, శోభన్‌బాబు, విజయశాంతి, చంద్రమోహన్‌, మురళీ మోహన్‌, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి, పద్మనాభం, రాధ, భాను ప్రియ, రాధిక, శారద, జయమాలిని, అనురాధ, వై విజయ వంటి వారు మెరిశారు. వీరంతా ఓ పాటలో గెస్ట్ రోల్స్ చేశారు. ఓ పార్టీ సాంగ్‌లో ఈ హీరోలంతా తమ జంటలతో వచ్చి అలా తళుక్కున మెరిశారు. వీరికి వెంకటేష్‌ సర్వెంట్‌గా సపర్యాలు చేయడం విశేషం.

45
బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసిన `త్రిమూర్తులు`
Image Credit : X/@chay_uday_akhil

బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసిన `త్రిమూర్తులు`

అప్పట్లో ఇలా ఇండస్ట్రీ మొత్తం నటించిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. సంచలనంగానూ మారింది. ఇండస్ట్రీలో అందరి చూపు ఈ చిత్రంపైనే పడింది. కానీ 1987లో విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ కాలేకపోయింది. పాటలో స్టార్స్ హడావుడి ఉంది తప్ప, సినిమాలో కంటెంట్‌ లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. సినిమా ఘోరంగా పరాజయం చెందింది. ఇలా నాగార్జున, వెంకటేష్‌ కలిసి ఈ ఒక్క మూవీలోనే నటించారు.

55
`ప్రేమమ్‌`లోనూ వెంకీ, నాగ్‌.. కానీ
Image Credit : our own

`ప్రేమమ్‌`లోనూ వెంకీ, నాగ్‌.. కానీ

ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత `ప్రేమమ్‌`(2016) సినిమాలో మెరిశారు. నాగచైతన్య హీరోగా నటించిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకుడు. ఈ సినిమాలో చైతూ తండ్రిగా మెరిశాడు నాగ్‌. అలాగే చైతూ అంకుల్‌గా ఏసీపీ రామచంద్ర పాత్రలో వెంకటేష్‌ కనిపించారు. కానీ ఇందులో నాగార్జున, వెంకటేష్‌కి మధ్య సీన్లు లేవు. ఇద్దరూ ఒక్కో సీన్లో జస్ట్  అలా కనిపించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
దగ్గుబాటి వెంకటేష్
అక్కినేని నాగార్జున
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Recommended image2
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Recommended image3
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Related Stories
Recommended image1
సావిత్రి ఎత్తుకున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా? ఇటీవల రెండు హిట్స్ అందుకున్న సూపర్‌ స్టార్‌.. టాలీవుడ్‌ రిచెస్ట్ హీరో
Recommended image2
చిరంజీవి లేటెస్ట్ లగ్జరీ హౌజ్‌ని చూశారా? వామ్మో రాజభవనమే.. ఎన్ని కోట్లు పెట్టి కట్టారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved