- Home
- Entertainment
- Mrunal Thakur : ధనుష్‌తో వాలెంటైన్స్ డే రోజు పెళ్లి..? రూమర్స్ పై మృణాల్ ఠాకూర్ ఫైనల్ క్లారిటీ
Mrunal Thakur : ధనుష్‌తో వాలెంటైన్స్ డే రోజు పెళ్లి..? రూమర్స్ పై మృణాల్ ఠాకూర్ ఫైనల్ క్లారిటీ
సౌత్ స్టార్ హీరో ధనుష్‌ను ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్‌పై ఆమె స్పందించి, అసలు విషయంపై ఫైనల్ గా క్లారిటీ ఇచ్చింది.
14

Image Credit : instagram
మృణాల్ ఠాకూర్ ఫైనల్ క్లారిటీ
సౌత్ ఇండియాలో మృణాల్ ఠాకూర్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల ఆమె, ధనుష్ పెళ్లి చేసుకోబోతున్నారని, ఫిబ్రవరి 14న ముహూర్తం అని రూమర్స్ వైరల్ అయ్యాయి. దీనిపై గలాటా ప్లస్ ఇంటర్వ్యూలో మృణాల్ స్పందించింది. 'నేను పెళ్లి చేసుకోవట్లేదు. ఫిబ్రవరి 14 ఏప్రిల్ 1 (ఫూల్స్ డే) కాబోతోందేమో. ఈ రూమర్ ఎవరు పుట్టించారో తెలీదు' అని ఆమె తేల్చి చెప్పింది.
24
Image Credit : X
రూమర్స్ ఎప్పుడు మొదలయ్యాయంటే?
ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్‌లో ధనుష్ హీరోగా నటిస్తున్న 'తేరే ఇష్క్ మే' సినిమా పార్టీకి మృణాల్ హాజరైంది. అప్పటినుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్ మొదలయ్యాయి. 'సన్ ఆఫ్ సర్దార్ 2' స్క్రీనింగ్‌లో ఇద్దరూ కలిసి కనిపించడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ధనుష్ సోదరీమణులను మృణాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడాన్ని కూడా కొందరు గుర్తించారు.
34
Image Credit : Instagram
గతంలోనే స్పందించిన మృణాల్
ధనుష్‌తో ప్రేమలో ఉన్నాననే వార్తలపై మృణాల్ గతంలోనే స్పందించింది. ఆ రూమర్స్‌ను నవ్వుతూ కొట్టిపారేసింది. ధనుష్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేసింది. 'సన్ ఆఫ్ సర్దార్ 2' స్క్రీనింగ్‌కు ధనుష్ రావడంపైనా క్లారిటీ ఇచ్చింది. 'నేను ధనుష్‌ను పిలవలేదు, అజయ్ దేవగణ్ ఆయన్ని ఆహ్వానించారు' అని మృణాల్ చెప్పింది.
44
Image Credit : Instagram
రజినీకాంత్ కూతురితో విడాకులు..
అయినా, వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయి. పెళ్లి వార్త బయటకు రాగానే ఇద్దరి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ధనుష్ సన్నిహితులు, మృణాల్ ఈ వార్తలను ఖండించడంతో ఈ రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పడినట్లేనని అభిమానులు భావిస్తున్నారు. కాగా, ధనుష్ గతంలో ఐశ్వర్య రజినీకాంత్‌కు విడాకులు ఇచ్చారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
Latest Videos

