MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • MSG Ticket Price: మన శంకర వరప్రసాద్ గారు టికెట్ ధరలు ఇవే.. తెలంగాణలో ఈ సినిమా చూడాలంటే ఫ్యామిలీలకు చుక్కలే

MSG Ticket Price: మన శంకర వరప్రసాద్ గారు టికెట్ ధరలు ఇవే.. తెలంగాణలో ఈ సినిమా చూడాలంటే ఫ్యామిలీలకు చుక్కలే

మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి టికెట్ ధరలు పెంచుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జీవో విడుదల చేశాయి. పెరిగిన టికెట్ ధరల వివరాలు ఈ కథనంలో ఉన్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 10 2026, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మన శంకర వరప్రసాద్ గారు మూవీ
Image Credit : Asianet News

మన శంకర వరప్రసాద్ గారు మూవీ

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం జనవరి 12న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 11 రాత్రి నుంచే ప్రీమియర్ షోల హంగామా మొదలవుతుంది.డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రంలో చిరంజీవిని వింటేజ్ మెగాస్టార్ గా చూపించబోతున్నారు. చాలా రోజుల తర్వాత చిరు ఎంటర్టైనింగ్ రోల్ లో కనిపించబోతుండడంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

25
టికెట్ ధరలు పెంచుతూ జీవో
Image Credit : Asianet News

టికెట్ ధరలు పెంచుతూ జీవో

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి కూడా చిరంజీవి సినిమాకు సపోర్ట్ వచ్చేసింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి టికెట్ ధరలు పెంచుతూ అనుమతి ఇచ్చారు. జనవరి 12 నుంచి పది రోజుల పాటు ఏపీలో పెరిగిన టికెట్ ధరలు అమలులో ఉంటాయి. అదే విధంగా తెలంగాణలో పెరిగిన టికెట్ ధరలు మొదటి 7 రోజుల పాటు అమలులో ఉంటాయి. 

Related Articles

Related image1
Chiranjeevi: ఒకవైపు తమ్ముడు, మరోవైపు కొడుకు.. అస్సలు కుదరదు అని బాంబు పేల్చిన చిరంజీవి
Related image2
క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి 14 సినిమాల్లో ఛాన్స్ ఇచ్చి స్టార్ హీరోని చేసేసిన కృష్ణ.. శ్రీదేవి వల్లే ఇదంతా
35
ఏపీలో మన శంకర వరప్రసాద్ గారు టికెట్ ధరలు
Image Credit : Asianet News

ఏపీలో మన శంకర వరప్రసాద్ గారు టికెట్ ధరలు

ఏపీలో ఈ చిత్రానికి జనవరి 12 నుంచి పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీతో కలిపి సింగిల్ స్క్రీన్స్ లో రూ.100, మల్టీ ప్లెక్స్ లలో రూ 125 పెంచుకునేలా వీలు కల్పించారు. 11 వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలకు జీఎస్టీతో కలిపి రూ 500 టికెట్ ధర నిర్ణయించారు. పెరిగిన రేట్ల ప్రకారం ఏపీలో టికెట్ ధరలు ఇలా ఉన్నాయి. 

ప్రీమియర్ షోల టికెట్ ధర : రూ.500 (జనవరి 11, 2026) 

సింగిల్ స్క్రీన్ టికెట్ ధర :  రూ. 247 ( జనవరి 12 నుంచి 10 రోజుల పాటు) 

మల్టీప్లెక్స్ టికెట్ ధర          : రూ. 302 ( జనవరి 12 నుంచి 10 రోజుల పాటు)

45
తెలంగాణలో మన శంకర వరప్రసాద్ గారు టికెట్ ధరలు
Image Credit : Asianet News

తెలంగాణలో మన శంకర వరప్రసాద్ గారు టికెట్ ధరలు

తెలంగాణలో ఈ చిత్రానికి జనవరి 12 నుంచి 7 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షోలకు జీఎస్టీతో కలిపి రూ 600 టికెట్ ధర నిర్ణయించారు. రెగ్యులర్ షోలకు జనవరి 12 నుంచి సింగిల్ స్క్రీన్స్ లో రూ 50, మల్టీప్లెక్స్ లలో రూ.100 పెంచుకునే వీలు కల్పించారు. తెలంగాణలో ఈ చిత్రానికి పెరిగిన రేట్ల ప్రకారం టికెట్ ధరలు ఇలా ఉన్నాయి. 

ప్రీమియర్ షోల టికెట్ ధర : రూ.600 (జనవరి 11, 2026) 

సింగిల్ స్క్రీన్ టికెట్ ధర :  రూ. 227 ( జనవరి 12 నుంచి 7 రోజుల పాటు) 

మల్టీప్లెక్స్ టికెట్ ధర          : రూ. 395 ( జనవరి 12 నుంచి 7 రోజుల పాటు)

55
ఫ్యామిలీలకు చుక్కలే
Image Credit : Asianet News

ఫ్యామిలీలకు చుక్కలే

సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలి అనుకుంటే జేబు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. నలుగురు సభ్యులు ఉన్న ఫ్యామిలీ తెలంగాణ మల్టిప్లెక్స్ లో ఈ సినిమా చూడాలనుకుంటే కేవలం టికెట్ ధరల ఖర్చే దాదాపు 1600 అవుతుంది. ఇక పాప్ కార్న్, కూల్ డ్రింక్ లాంటివి కలుపుకుంటే మరో 1000 ఖర్చు గ్యారెంటీ. అంటే మొత్తంగా ఫ్యామిలీలు దాదాపు రూ 2500 పైగా సమర్పించుకోవాల్సిందే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 10: విశ్వక్‌ పై పగ తీర్చుకుంటున్న అమూల్య, వల్లి పొర్లు దండాలు
Recommended image2
హీరోయిన్లతో నాకు పర్సనల్ కంఫర్ట్ అవసరం లేదు, అలాంటి వాళ్లంటే చిరాకు..రియల్ లవర్స్ లా ఉండాలి, చిరు కామెంట్స్
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి మళ్లీ టోపీ పెట్టిన రోహిణీ, రాజేష్ కి బ్రెయిన్ వాష్ చేసిన మీన
Related Stories
Recommended image1
Chiranjeevi: ఒకవైపు తమ్ముడు, మరోవైపు కొడుకు.. అస్సలు కుదరదు అని బాంబు పేల్చిన చిరంజీవి
Recommended image2
క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి 14 సినిమాల్లో ఛాన్స్ ఇచ్చి స్టార్ హీరోని చేసేసిన కృష్ణ.. శ్రీదేవి వల్లే ఇదంతా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved