MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నమ్రత ఎంత చెప్పినా వినకుండా డిజాస్టర్ చూసిన మహేష్ బాబు ? ఆ సినిమా చేసి తప్పు చేశాడా?

నమ్రత ఎంత చెప్పినా వినకుండా డిజాస్టర్ చూసిన మహేష్ బాబు ? ఆ సినిమా చేసి తప్పు చేశాడా?

ప్రస్తుతం సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు మహేష్ బాబు. ఏడాదికి ఒక్క సినిమా చేసినా.. అన్ని రకాలుగా ఆలోచించి చేస్తున్నాడు. అయితే ఒక సినిమా విషయంలో మాత్రం నమ్రత ఎంత చెప్పినా వినకుండా.. భారీ డిజాస్టర్ ను ఫేస్ చేశాడట మహేష్. ఇంతకీ ఏంటా సినిమా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 15 2025, 06:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్ స్టార్ నట వారసుడిగా
Image Credit : Asianet News

సూపర్ స్టార్ నట వారసుడిగా

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి... తండ్రిని మంచిన తనయుడు అనిపించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కొద్ది కాలంలోనే ఆయన స్టార్ హీరో హోదాను సాధించాడు. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తూ వెళ్తున్న సూర్ స్టార్.. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగుటు వేస్తున్నాడు మహేష్. తనతో కలిసి వంశీ సినిమాలో హీరోయన్ గా నటించిన నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేష్.. భార్యతో చర్చించిన తరువాతే ఏ సినిమాకైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు.

25
మహేష్ సినిమా సెలక్షన్స్ లో నమ్రత పాత్ర
Image Credit : @namratashirodkar

మహేష్ సినిమా సెలక్షన్స్ లో నమ్రత పాత్ర

పెళ్లి తరువాత మహేష్ బాబు సినిమాల ఎంపికల విషయంలో నమ్రత కీలక పాత్ర పోషిస్తు వస్తున్నారు. ముఖ్యంగా ఏ కథను ఎంచుకోవాలి, ఏ సినిమాను చేయాలి అనే విషయాల్లో నమ్రత చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తోందని సమాచారం. మహేష్ కెరీర్ లో మార్పుకు కూడా ఆమె కారణం అని అంటున్నారు. మహేష్ దగ్గరకు వచ్చే కథలను ముందుగా నమ్రత విని, ఆమెకు ఓకే అనిపిస్తే.. అది మహేష్ బాబు దగ్గరకు వెళ్తుంది. ఆ కథ నచ్చితే సూపర్ స్టార్ తుది నిర్ణయం తీసుకుంటారని ప్రచారం ఉంది. ఇలాగే జాగ్రత్తగా సినిమాలు చేసి.. బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు మహేష్. కానీ ఒక సారి మాత్రం నమ్రత వద్దన్నా వినకుండా నటించి నష్టపోయాడట మహేష్.

Related Articles

Related image1
శ్రీదేవి కమెడియన్ తో రొమాన్స్ చేసిన సినిమా ఏదో తెలుసా? చిరు, రజనీ లాంటి స్టార్స్ తో మెరిసిన నటి ఎందుకిలా చేసింది?
Related image2
అల్లు అర్జున్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ మూవీ, డైరెక్టర్ ఎవరో తెలుసా? నిజమెంత?
35
నమ్రత మాట వినకుండా నష్టపోయిన మహేష్..?
Image Credit : our own

నమ్రత మాట వినకుండా నష్టపోయిన మహేష్..?

ఈ క్రమంలో మహేష్ బాబు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈసినిమా ప్రతీ తెలుగువారి మనసుల్లో అలా నిలిచిపోయింది. మహేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ , తో పాటు యూత్ లో కూడా ఇమేజ్ ఇంకా పెరిగిపోయింది. దాంతో మహేష్ బాబు ఇంకే ఆలోచించకుండా.. ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు మరో అవకాశం ఇచ్చాడు. కథను కూడా పట్టించుకోకుండా.. డైరెక్టర్ మీద నమ్మకంతో సినిమాకు ఓకే చేశాడట. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమాను చేశాడు మహేష్. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా చేయడం నమ్రతకు ఇష్టం లేదట. ఈ సరిగ్గాలేదని.. మహేష్ బాబుకు చాలా చెప్పి చూసిందట కానీ మహేష్ వినలేదని సమాచారం.

45
మహేష్ బాబు కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్
Image Credit : our own

మహేష్ బాబు కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్

బ్రహ్మోత్సవం’ సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే ఒక పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఫలితంతో మహేష్ బాబు మాత్రమే కాకుండా ఆయన అభిమానులు కూడా తీవ్రంగా నిరాశకు గురయ్యారు.‘బ్రహ్మోత్సవం’ అనుభవం తర్వాత మహేష్ బాబు సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. షూటింగ్స్ తో పాటు ఇతర కమిట్‌మెంట్లతో బిజీగా ఉండే సమయంలో కథలను పూర్తిగా విని, నిర్ణయం తీసుకోవడానికి మహేష్ కు టైమ్ ఉండటంలేదు. అందుకే ఆ బాధ్యతలను నమ్రత తీసుకున్నారట. దాంతో మహేష్ తన అభిప్రాయానికి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోది. . నమ్రత కథను విన్న తర్వాత, ఆపై మహేష్ బాబు తుది నిర్ణయం తీసుకుంటున్నారని చెబుతున్నారు.

55
వారణాసి బిజీలో సూపర్ స్టార్
Image Credit : jiohotstar

వారణాసి బిజీలో సూపర్ స్టార్

ప్రస్తుతం మహేష్ బాబు వరల్డ్ క్లాస్ డైరెక్టర్ రాజమౌళితో ‘వారణాసి’ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ స్తాయిలో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 1500 కోట్ల బడ్జెట్ ఈసినిమాపై ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 2027 సమ్మర్ లో ఈసినిమా

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Recommended image2
ధురంధర్ 2 కి రిలీజ్ కు ముందే దెబ్బ? టాక్సిక్ హిస్టారిక్ డీల్‌తో గేమ్ మారిపోయిందిగా..
Recommended image3
Allu Arjun ని కలవాలంటే 42 రూల్స్ ? ఆ బ్రాండ్‌ స్ట్రాటజర్‌కి ఇచ్చిపడేసిన అల్లు అర్జున్‌ టీమ్‌
Related Stories
Recommended image1
శ్రీదేవి కమెడియన్ తో రొమాన్స్ చేసిన సినిమా ఏదో తెలుసా? చిరు, రజనీ లాంటి స్టార్స్ తో మెరిసిన నటి ఎందుకిలా చేసింది?
Recommended image2
అల్లు అర్జున్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ మూవీ, డైరెక్టర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved