MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీదేవి కమెడియన్ తో రొమాన్స్ చేసిన సినిమా ఏదో తెలుసా? చిరు, రజనీ లాంటి స్టార్స్ తో మెరిసిన నటి ఎందుకిలా చేసింది?

శ్రీదేవి కమెడియన్ తో రొమాన్స్ చేసిన సినిమా ఏదో తెలుసా? చిరు, రజనీ లాంటి స్టార్స్ తో మెరిసిన నటి ఎందుకిలా చేసింది?

Sridevi : స్టార్ హీరోయిన్లు చిన్నచిన్న హీరోల సరసన నటించడానికి ఒప్పుకోరు.. తమ ఇమేజ్ గురించి ఆలోచిస్తుంటారు. కానీ ఎన్టీఆర్ ఏఎన్నార్ నుంచి చిరు రజినీ వరకూ స్టార్స్ సరసన ఆడిపాడిన శ్రీదేవి... స్టార్ కమెడియన్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిందని మీకు తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 15 2025, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
స్టార్ డమ్ కోసం హీరోయిన్ల తంటాలు..
Image Credit : facebook.com/p/Sridevi

స్టార్ డమ్ కోసం హీరోయిన్ల తంటాలు..

ప్రస్తుతం హీరోయిన్లు స్టార్ డమ్ తెచ్చుకోవడం కోసం ఎన్నో తంటాలు పడుతున్నారు. కొంత మందికి అది వెంటనే వస్తుంది.. మరికొంత మంది ఎన్ని ఏళ్లైనా.. స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించలేరు. చిన్ని హీరోల సరసన కెరీర్ స్టార్ట్ చేసిన రకుల్, తమన్నా ఎంత పెద్ద హీరోయిన్లు అయ్యారో తెలిసిందే. కానీ వీరితోపాటు కెరీర్ స్టార్ట్ చేసిన రెజీనా, నభ నటేష్ లాంటి వారు మాత్రం స్టార్స్ అవ్వలేకపోయారు. ఇండస్ట్రీలో ఒక్క సారి స్టార్ హీరోయిన్ స్టేటస్ వస్తే.. పెద్ద పెద్ద హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేయాలని కలలు కంటుంటారు. 

26
చిన్న హీరోలతో సినిమాలు చేయరు..
Image Credit : facebook.com/p/Sridevi

చిన్న హీరోలతో సినిమాలు చేయరు..

ఒక్క సారి స్టార్ డమ్ వచ్చిన  హీరోయిన్లు చిన్న హీరోలతో నటించడానికి అస్సలు ఇష్టపడరు. తమ ఇమేను దృష్టిలో పెట్టుకుని.. చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ.. హీరోయిన్ గా పెద్ద అవకావాలు కోల్పోతామని భయపడుతుంటారు. అటువంటిది హీరోయిన్లు కమెడియన్ సరసన నటించమంటే ఎవరైనా ఆ సాహసం చేస్తారా? కానీ శ్రీదేవి చేసింది. ఓ కమెడియన్ తో ఏకంగా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది. ఇంతకీ ఎవరాకమెడియన్.. ఏంటా సినిమా?

Related Articles

Related image1
ఎన్టీఆర్, సావిత్రి.. అన్నా చెల్లెలుగా నటించే సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ను ఏడిపించిన మహానటి
Related image2
సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
36
శ్రీదేవి సినిమా కెరీర్
Image Credit : facebook.com/p/Sridevi

శ్రీదేవి సినిమా కెరీర్

శ్రీదేవి తన సినీమా కెరీర్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేసింది. చిన్న వయసులోనే సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె, ఆ తర్వాత క 16 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా మారింది. తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రజినీకాంత్, కమల్ హాసన్, అనిల్ కపూర్ వంటి అప్పటి అగ్ర హీరోల సరసన హీరోయిన్‌గా నటించి మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తక్కువ కాలంలోనే ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

46
కమెడియన్ తో రొమాన్స్ చేసిన శీదేవి
Image Credit : facebook.com/SuperstarKrishnaLibrary/posts

కమెడియన్ తో రొమాన్స్ చేసిన శీదేవి

ఈ క్రమంలో 1975 సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన “దేవుడు లాంటి మనిషి” అనే సినిమాలో శ్రీదేవి నటించింది. ఈ సినిమాలో ఆమె ప్రముఖ కమెడియన్ రాజబాబుకు జోడిగా శ్రీదేవి నటించడం విశేషం. అంతేకాదు, వీరిద్దరి మధ్య ఒక డ్యూయెట్ సాంగ్ కూడా ఈసినిమాలో ఉండటం విశేషం. శ్రీదేవి ఒక కమెడియన్ తో రొమాన్స్ చేసిందన్న విషయం చాలామందికి తెలియదు. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు అవునా.. అని ఆశ్చర్యపోతున్నారు. ఆతరువాత కాలంలో ఆమె ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్ర్లేదు.

56
స్టార్ హీరోలతో ఆడిపాడిన అతిలోక సుందరి
Image Credit : facebook.com/p/Sridevi

స్టార్ హీరోలతో ఆడిపాడిన అతిలోక సుందరి

తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా శ్రీదేవికి అవకాశాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. అక్కడ కూడా ప్రముఖ స్టార్ హీరోలతో కలిసి నటించి తిరుగులేని స్థాయికి చేరుకుంది. ఈ స్థాయికి చేరుకోవడానికి శ్రీదేవి తన కెరీర్ ఆరంభంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంది. హీరోయిన్‌గా గుర్తింపు పొందకముందు కూడా ఆమె కొన్ని చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ అనుభవం సంపాదించింది.

66
తండ్రీ కొడుకులకు జంటగా శ్రీదేవి
Image Credit : facebook.com/p/Sridevi

తండ్రీ కొడుకులకు జంటగా శ్రీదేవి

కెరీర్ ప్రారంభ దశలోనే అన్ని రకాల పాత్రలు చేస్తూ ముందుకు సాగిన శ్రీదేవి.. తను బాలనటిగా ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు మనవరాలిగా కనిపించింది. ఆతరువాత కాలంలో వారి సరసనే ఆమె హీరోయిన్ గా నటించడం మరో విచిత్రం. ఈ విషయంలో ఎన్నో విమర్శలు వచ్చినా.. ఏమాత్రం లెక్క చేయకుండా .. బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఈ కాంబినేషన్ సాధించింది. తరువాత కాలంలో ఏఎన్నార్ తనయుడు నాగార్జునతో కూడా శ్రీదేవి జంటగా నటించింది. బాలకృష్ణ మాత్రం శ్రీదేవితో ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి తారక రామారావు
అక్కినేని నాగార్జున
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Recommended image2
ధురంధర్ 2 కి రిలీజ్ కు ముందే దెబ్బ? టాక్సిక్ హిస్టారిక్ డీల్‌తో గేమ్ మారిపోయిందిగా..
Recommended image3
Allu Arjun ని కలవాలంటే 42 రూల్స్ ? ఆ బ్రాండ్‌ స్ట్రాటజర్‌కి ఇచ్చిపడేసిన అల్లు అర్జున్‌ టీమ్‌
Related Stories
Recommended image1
ఎన్టీఆర్, సావిత్రి.. అన్నా చెల్లెలుగా నటించే సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ను ఏడిపించిన మహానటి
Recommended image2
సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved