- Home
- Entertainment
- Vijay Divorce: రూ.250 కోట్లు అడిగిన సంగీత.. విజయ్ ఇచ్చేది రూ.35 కోట్లేనా? అసలు నిజమెంత?
Vijay Divorce: రూ.250 కోట్లు అడిగిన సంగీత.. విజయ్ ఇచ్చేది రూ.35 కోట్లేనా? అసలు నిజమెంత?
హీరో విజయ్, ఆయన భార్య సంగీత విడాకులపై రూమర్లు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు సెటిల్మెంట్ మొత్తంపై ఓ కొత్త వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది.
14

Image Credit : X
విజయ్ సంగీత విడాకులు
తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, నటుడు విజయ్ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.625 కోట్లు. ఇందులో రూ.404 కోట్ల చరాస్తులు, రూ.220 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
24
Image Credit : our own
సంగీత విజయ్
విజయ్ తన ఆస్తుల వివరాలు బయటపెట్టడంతో, ఆయన భార్య సంగీతతో ఉన్న సంబంధంపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. విడాకుల సెటిల్మెంట్ కోసం సంగీత సుమారు రూ.250 కోట్లు అడిగినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
34
Image Credit : Facebook/ Actor Vijay, X
సంగీత తన కోసమే కాకుండా
ఈ డబ్బును సంగీత తన కోసమే కాకుండా, పిల్లలు జాసన్ సంజయ్, దివ్య సాషా భవిష్యత్తు కోసం కూడా అడిగారని అంటున్నారు. అయితే, విజయ్ కేవలం రూ.35 కోట్లు సెటిల్మెంట్గా ఇచ్చేందుకు ఒప్పుకున్నారని, పిల్లల చదువు, ఇతర ఖర్చులను తానే చూసుకుంటానని హామీ ఇచ్చారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
44
Image Credit : instagram
విజయ్ సెటిల్మెంట్
పిల్లలంటే ఎంతో ఇష్టపడే విజయ్, వారిని తన దగ్గరే ఉంచుకోవాలని అనుకుంటున్నారట. అయితే, ఈ వార్తలపై విజయ్ గానీ, సంగీత గానీ అధికారికంగా స్పందించలేదు. తన భార్య పేరు మీద రూ.18 కోట్ల విలువైన ఆస్తులు, భారీగా బంగారం ఉన్నట్లు విజయ్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు.
Latest Videos

