MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు స్టార్ కాగలడా ? ఆ హీరో ముందు నిలబడగలడా ? ఇలా చాలా సందేహాలు..సూపర్ స్టార్ కృష్ణ ఏం చేశారంటే

మహేష్ బాబు స్టార్ కాగలడా ? ఆ హీరో ముందు నిలబడగలడా ? ఇలా చాలా సందేహాలు..సూపర్ స్టార్ కృష్ణ ఏం చేశారంటే

మహేష్ బాబు కెరీర్ కీలక దశలో ఉన్నప్పుడు కొన్ని అనుమానాలు తలెత్తాయి. అసలు మహేష్ బాబు స్టార్ హీరో కాగలడా అనే సందేహాలు మొదలైనట్లు ఓ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 29 2026, 06:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహేష్ బాబు టాలీవుడ్ ఎంట్రీ
Image Credit : Instagram/Mahesh Babu

మహేష్ బాబు టాలీవుడ్ ఎంట్రీ

సూపర్ స్టార్ కృష్ణ తన తనయుడు మహేష్ బాబుని రాజకుమారుడు చిత్రంతో హీరోగా లాంచ్ చేశారు. రాజకుమారుడు మూవీ మంచి హిట్ అయింది. అంతకు ముందే మహేష్ బాబు తన తండ్రి కృష్ణ సినిమాల్లో బాల నటుడిగా నటించారు. కానీ హీరోగా కెరీర్ మొదలు పెట్టింది మాత్రం రాజకుమారుడు చిత్రంతోనే. 

25
వరుసగా మహేష్ కి ఫ్లాపులు
Image Credit : https://www.facebook.com/urstrulyMahesh

వరుసగా మహేష్ కి ఫ్లాపులు

రాజకుమారుడు తర్వాత మహేష్ బాబుకి వరుస ఫ్లాపులు పడ్డాయి. యువరాజు, వంశీ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. కృష్ణ వారసుడిగా మహేష్ బాబుకి ఫ్లాపులు ఎదురైతే సహజంగానే ఇండస్ట్రీలో సందేహాలు మొదలవుతాయి. వంశీ తర్వాత కృష్ణ వంశీ దర్శకత్వంలో మహేష్ బాబు మురారి చిత్రం ప్రారంభం అయింది. ఆల్రెడీ రెండు ఫ్లాపులు పడ్డాయి కాబట్టి తన కొడుకు సినిమాపై సూపర్ స్టార్ కృష్ణ ఎక్కువ ఫోకస్ పెట్టారు. 

Related Articles

Related image1
రాంచరణ్, బాలకృష్ణ ఇద్దరికీ చుక్కలు చూపించిన వెంకటేష్..పెద్ద హంగామాతో వచ్చి తుస్సుమన్న సూపర్ స్టార్
Related image2
అది చేయడం నచ్చకే కెరీర్ లో వెనుకబడ్డా.. పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు సూపర్ హిట్లు ఇచ్చిన హీరోయిన్
35
పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు
Image Credit : facebook.com/IFOPK

పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు

కృష్ణ వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు వరుస ఫ్లాపుల తర్వాత మహేష్ చేస్తున్న సినిమా అది. ఆ సమయంలో మహేష్ బాబు గుర్తింపు పైనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ టైంలో పవన్ కళ్యాణ్ మంచి జోరు మీద ఉన్నాడు. హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. పవన్, మహేష్ మధ్య కాంపిటీషన్ అనే చర్చ అప్పటికే ఇండస్ట్రీలో మొదలైంది. మహేష్ కి ఫ్లాపులు రావడంతో రేసులో వెనుకబడ్డాడు. 

45
మురారి సినిమా వివాదం
Image Credit : @maheshbabufans

మురారి సినిమా వివాదం

ఆ టైంలో మురారి సినిమాని నేను టేకప్ చేశాను. ఆ మూవీలో క్లైమాక్స్ సాంగ్ గా అలనాటి రామచంద్రుడు అనే పాట అనుకున్నాను. కానీ అందరూ షాక్ అవుతున్నారు. మహేష్ బాబు లాంటి హీరోకి క్లైమాక్స్ లో మాస్ సాంగ్ ఉండాలి కదా. కృష్ణ వంశీ ఏంటి చెడగొడుతున్నారు అని నా పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడం ప్రారంభించారు. 

55
సూపర్ స్టార్ కృష్ణ దగ్గరికి పంచాయతీ
Image Credit : Krishna Vamsi\Twitter

సూపర్ స్టార్ కృష్ణ దగ్గరికి పంచాయతీ

విషయం సూపర్ స్టార్ కృష్ణ దగ్గరికి వెళ్ళింది. ఆయన నన్ను పిలిచి అడిగారు. క్లైమాక్స్ లో మాస్ సాంగ్ ఎందుకు పెట్టడం లేదు అని అడిగారు. అలనాటి రామచంద్రుడు అనే పాటే ఈ సినిమాకి కరెక్ట్. నాకు చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ పాటని కొన్ని తరాల పాటు గుర్తుంటుంది. ఆ పాటని తీసేసి మాస్ సాంగ్ పెట్టమంటే నేను ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతాను. మీరు మాస్ సాంగ్ ని షూట్ చేయించుకుని నా పేరు వాడకుండా సినిమా రిలీజ్ చేసుకోండి అని తేల్చి చెప్పేశా. దీనితో కృష్ణ గారు డెసిషన్ నాకే వదిలేశారు అని కృష్ణ వంశీ తెలిపారు. ఆ తర్వాత సినిమాకి ఎంత మంచి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
మహేష్ బాబు ఘట్టమనేని
కృష్ణ ఘట్టమనేని

Latest Videos
Recommended Stories
Recommended image1
తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?
Recommended image2
ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే
Recommended image3
Jeffrey Epstein: ఎవ‌రీ జెఫ్రీ, ఆ ఐల్యాండ్‌లో ఏం చేశాడు? OTTలో భయంకర సత్యాలను తెలిపే డాక్యుమెంటరీ
Related Stories
Recommended image1
రాంచరణ్, బాలకృష్ణ ఇద్దరికీ చుక్కలు చూపించిన వెంకటేష్..పెద్ద హంగామాతో వచ్చి తుస్సుమన్న సూపర్ స్టార్
Recommended image2
అది చేయడం నచ్చకే కెరీర్ లో వెనుకబడ్డా.. పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు సూపర్ హిట్లు ఇచ్చిన హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved