MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 14 ఏళ్లకే స్టార్ డమ్, 300 పైగా సినిమాలు, డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన 63 ఏళ్ల మాజీ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

14 ఏళ్లకే స్టార్ డమ్, 300 పైగా సినిమాలు, డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన 63 ఏళ్ల మాజీ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తు పట్టారా? 14 ఏళ్లకే హీరోయిన్ గా మారి, చాలాతక్కువ టైమ్ లోనే స్టార్ స్టేటస్ సంపాదించిన ఈ హీరోయిన్ 300లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇంతకీ ఎవరా స్టార్. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 16 2025, 12:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Facebook/ Jayaprada

300 లకు పైగా సినిమాలు

సౌత్ లో స్టార్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఎవరి ప్రత్యేకత వారిది. ఎవరి రికార్డులు వారివి. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుని ఇండస్ట్రీ హిట్లు కొట్టినవారు చాలామంది ఉన్నారు. సినిమాలతో పాటు రాజకీయాలల్లో కూడా రాణించిన తారలు ఉన్నారు. ప్రస్తుతం మనం అలాంటి హీరోయిన్ గురించే మాట్లాడుకుందాం. చాలా చిన్న వయసులో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి. కెరీర్ మొత్తంలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ 63 ఏళ్ల వయస్సులో కూడా తగ్గేదే లేదు అంటోంది. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుస జయప్రద.

DID YOU
KNOW
?
300లకు పైగా సినిమాలు
జయప్రద తెలుగుతో పాటు హిందీ, తమిళ. కన్నడ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటించారు. ఆమె కెరీర్ మొత్తం మీద దాదాపు 300 సినిమాల్లో నటించారు స్టార్ హీరోయిన్.
25
Image Credit : facbook / jayaprada

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యింది

సౌత్ సినిమాలో ఓ వెలుగు వెలిగిన ప్రముఖ నటి జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయం, నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను మెప్పించిన ఈ నటి, కేవలం 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టింది.జయప్రదకు చిన్నప్పటి నుంచే డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. చదువుకుంటూనే డాన్స్ నేర్చుకుని ప్రత్యేకంగా ప్రదర్శణలు ఇచ్చేది జయప్రద. అయితే ఓ సందర్భంలో జయప్రదను నాట్య ప్రదర్శనలో చూసిన నటుడు ఎం. ప్రభాకర్ రెడ్డి, ఆమెను సినిమాకు పరిచయం చేశారు. 1976లో విడుదలైన "భూమి కోసం" అనే చిత్రంలో కేవలం మూడు నిమిషాల పాత్రలో నటిస్తూ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది ఈ నటి.

Related Articles

Related image1
ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు వెండితెరపై కృష్ణుడి పాత్రలు చేసిన హీరోలు ఎవరెవరంటే?
Related image2
5 కోట్లు బడ్జెట్ పెడితే, 90 కోట్లు సంపాదించిన చిన్న సినిమా ఏదో తెలుసా?
35
Image Credit : Facebook/ Jayaprada

10 రూపాయల రెమ్యునరేషన్

తొలి సినిమాలో 10 పారితోషికం తీసుకున్న జయప్రద, క్రమంగా టాలీవుడ్‌ నుంచి ఇతర భాషల సినిమాల్లోకి వెళ్లి, భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి గా మారింది.

తన కెరీర్‌లో ఆమె 300కి పైగా చిత్రాల్లో నటించింది. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కమల్ హాసన్, కృష్ణంరాజు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగు చిత్రాలతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది.

45
Image Credit : facbook / jayaprada

రాజకీయాల్లో జయప్రద

తొలుత హీరోయిన్‌గా వెలుగులోకి వచ్చిన జయప్రద, తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో కూడా తన మార్క్ చూపించింది. 2005 వరకు కొనసాగిన ఆమె సినీ ప్రస్థానంలో, మూడు దశాబ్దాల పాటు అద్భుతమైన పాత్రలు చేస్తూ.. మంచి పేరు తెచ్చుకుంది. నటిగా స్క్రీన్ కు దూరం అవుతూనే రాజకీయాల వైపు వెళ్లిపోయింది జయప్రద. 1986 జూన్ 22న ఆమె సినీ నిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకున్నారు. 1994 అక్టోబర్ 10న తెలుగుదేశం పార్టీ (టిడిపి) లో చేరి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించింది జయప్రద. ఆతరువాత ఆమె నార్త్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టిన జయప్రద, అక్కడి సమాజ్ వాద్ పార్టీలో చేరి ఎంపీగా సేవలు అందించారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు.

55
Image Credit : facbook / jayaprada

63 ఏళ్ల వయసులో 

ఇప్పటికీ ఆమె అందం, అభినయం గురించి సినీప్రేమికులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. 63 ఏళ్ల వయసులో కూడా జయప్రద తన గ్లామర్, స్టైలిష్ లుక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. సినిమా ఈవెంట్లకు హాజరవుతూ.. అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ బిజీగా గడిపేస్తోంది జయప్రద. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది సీనియర్ నటి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తెలుగుదేశం పార్టీ
నందమూరి తారక రామారావు
కృష్ణ ఘట్టమనేని
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: రేపు జరగబోయేది ఈరోజే న్యూస్ పేపర్లో వస్తే.. ఊహకందని ట్విస్టులు బాబోయ్. ఈ వెబ్ సిరీస్ చూశారా.?
Recommended image2
కళ్యాణ్ పడాల తనూజ మధ్య మళ్లీ మొదలయ్యిందా..? ఏకంగా రింగు తొడిగిన బిగ్ బాస్ విన్నర్..
Recommended image3
3 ఏళ్లకంటే ఎక్కువ బ్రతకడన్న డాక్టర్లు, 30 ఏళ్లు హ్యాపీగా బ్రతికి చూపించిన ఏఎన్నార్.. ఎలా సాధ్యమయ్యింది?
Related Stories
Recommended image1
ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు వెండితెరపై కృష్ణుడి పాత్రలు చేసిన హీరోలు ఎవరెవరంటే?
Recommended image2
5 కోట్లు బడ్జెట్ పెడితే, 90 కోట్లు సంపాదించిన చిన్న సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved