MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు నటులు ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా?

Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు నటులు ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా?

Illu Illalu Pillalu: జియో హాట్ స్టార్లో వచ్చే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కు అభిమానులు ఎక్కువ. ఆ సీరియల్‌లో నటించే నటులు కూడా అంతే అద్భుతంగా నటిస్తారు. అలాగే వారు తీసుకునే రెమ్యునరేషన్ కూడా ఎక్కువే. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 15 2026, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటుల రెమ్యునరేషన్
Image Credit : Jio hotstar

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటుల రెమ్యునరేషన్

తెలుగు ప్రేక్షకులకు సీరియల్స్ అంటే ఎంతో ఇష్టం. టీఆర్పీ రేటింగ్ లో కార్తీకదీపం తర్వాత ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నిలిచింది. టాప్ సీరియల్ లో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది. ఈ మధ్యకాలంలో ఈ సీరియల్ విపరీతంగా ప్రజలను ఆకట్టుకుంటోంది. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన కథ. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఒక తండ్రికి భార్యా, పిల్లలు, ఇల్లు మాత్రమే ప్రపంచంగా ఉంటే అతని జీవితం ఎన్ని రకాలుగా మారుతుందో తెలిపే కథ ఇది. అయితే ఈ సీరియల్ లో నటించే వారంతా కూడా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయిపోయారు. ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రభాకర్, వేదవతి, ప్రేమ, నర్మద, శ్రీవల్లి, భాగ్యం, ధీరజ్, సాగర్ వంటి వారంతా ఒక్కో ఎపిసోడ్ కు ఎంత తీసుకుంటారు? అన్న సందేహం కూడా ఎంతోమందిలో వస్తోంది. ఆ రెమ్యూనరేషన్ వివరాలు ఇక్కడ ఇచ్చాము.

25
రామరాజు, వేదవతి రెమ్యునరేషన్
Image Credit : Jio hotstar

రామరాజు, వేదవతి రెమ్యునరేషన్

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో ప్రధాన పాత్ర రామరాజుదే. ఈయన చుట్టే కథంతా తిరుగుతుంది. రామరాజుగా ప్రభాకర్ నటిస్తున్నాడు. ఈయనకు ఎంతో అనుభవం ఎక్కువ. ప్రధాన పాత్ర కూడా ఈయనదే కాబట్టి ఒక్కో ఎపిసోడ్ లో నటించేందుకు ఈయన 55 వేల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక ఈయన పక్కన వేదవతిగా నటిస్తోంది అలనాటి హీరోయిన్ ఆమని. ఈ సీరియల్లో నటించేందుకు ఒక్కో ఎపిసోడ్ కు ఆమె 35 వేలకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం.

Related Articles

Related image1
Illu Illalu Pillalu Today Episode Feb 13: రామరాజు ఇంట్లో రోజుకో పంచాయితీ, ఈసారి ప్రేమ ఎస్ఐ పరీక్ష గురించి..
Related image2
Illu Illalu Pillalu: నోరు జారి.. లంచం ఇచ్చి ఉద్యోగం కొన్న నిజం బయటపెట్టిన సాగర్, వల్లి మరో కుట్ర
35
నర్మద, ప్రేమ
Image Credit : Jio hotstar

నర్మద, ప్రేమ

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రధాన పాత్రలలో నర్మద, ప్రేమ తోటి కోడళ్లుగా నటిస్తున్నారు. వీరిద్దరూ అదరగొడుతున్నారు. సీరియల్ సక్సెస్ అవ్వడానికి ఈ రెండు పాత్రలు కూడా ఎంతో ముఖ్యమైనవి. ఇక నర్మద పాత్రలో అన్షు రెడ్డి ఎంతో పాపులర్ అయింది. ఈమె తెలుగు అమ్మాయి. ఈమె ఒక ఎపిసోడ్ చేసేందుకు 30 వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక ప్రేమ అసలు పేరు లావణ్య. ఈమె కన్నడ నటి. కన్నడలో ఎన్నో సీరియల్స్ లో నటించిన ఈమె ఒక రోజుకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ రూ.30,000.

45
శ్రీవల్లి, ధీరజ్
Image Credit : Jiohotstar

శ్రీవల్లి, ధీరజ్

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రధాన పాత్ర శ్రీవల్లిదే. నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్న కథను మలుపులు తిప్పేది శ్రీవల్లి. ఈమె అసలు పేరు త్రివేణి యాదవ్. ఆమెకు రోజుకు 25వేల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు సమాచారం. ఇక ధీరజ్ పాత్ర చేస్తున్నసూర్య కిరణ్ కూడా 20వేల రూపాయల రెమ్యూనిరేషన్ ఇస్తున్నారు.

55
సాగర్, చందు, భాగ్యం
Image Credit : Jiohotstar

సాగర్, చందు, భాగ్యం

రామరాజు పెద్దకొడుకు, రెండో కొడుకుగా నటిస్తున్న చందు, సాగర్ లకు కూడా రెమ్యూనరేషన్ బాగానే దక్కుతోంది. చందు పాత్రలో నటిస్తున్న ప్రశాంత్ ఒక ఎపిసోడ్ కు పాతికవేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక సాగర్ 20 వేల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. భాగ్యం పాత్ర చేస్తున్న మిర్చి మాధవి కూడా ఈ సీరియల్లో ప్రధాన పాత్రగానే చెప్పుకోవాలి. ఆమె కూడా ఒక ఎపిసోడ్ కు 20 వేలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ దేవరకొండ గురించి పెడుతుందనుకుంటే.. విక్కీ కౌశల్‌ను తలచుకున్న రష్మిక మందన్న.. వాలెంటైన్స్ డే స్పెషల్
Recommended image2
రామ్ చరణ్ తో త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా.. ఎలా మిస్ అయ్యిందో తెలుసా?
Recommended image3
Nagarjuna : ధురంధర్ లో అవకాశంపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున, అసలు నిజం ఏంటంటే?
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 13: రామరాజు ఇంట్లో రోజుకో పంచాయితీ, ఈసారి ప్రేమ ఎస్ఐ పరీక్ష గురించి..
Recommended image2
Illu Illalu Pillalu: నోరు జారి.. లంచం ఇచ్చి ఉద్యోగం కొన్న నిజం బయటపెట్టిన సాగర్, వల్లి మరో కుట్ర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved