MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Illu Illalu Pillalu Today Episode Feb 13: రామరాజు ఇంట్లో రోజుకో పంచాయితీ, ఈసారి ప్రేమ ఎస్ఐ పరీక్ష గురించి..

Illu Illalu Pillalu Today Episode Feb 13: రామరాజు ఇంట్లో రోజుకో పంచాయితీ, ఈసారి ప్రేమ ఎస్ఐ పరీక్ష గురించి..

Illu Illalu Pillalu Today Episode Feb 13: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వేదవతి విపరీతమైన కోపంలో ఉంటుంది. సాగర్, నర్మదలతో మాట్లాడడమే మానేస్తుంది. ఇదే సమయంలో ప్రేమ ఎస్ఐ పరీక్ష రాయాలనుకుంటున్న విషయం చెబుతాడు ధీరజ్. 

4 Min read
Author : Haritha Chappa
Published : Feb 13 2026, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నర్మదపై అరిచిన వేదవతి
Image Credit : Jio hotstar

నర్మదపై అరిచిన వేదవతి

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వేదవతి చుట్టే ఎసిసోడ్ అంతా తిరుగుతుంది. నర్మద పైన చాలా కోపంగా ఉంటుంది వేదవతి. నర్మదా.. సాగర్ దగ్గరికి వచ్చి బాధపడుతుంది. కానీ సాగర్ మాత్రం మనసులో బాధంతా బయటకి చెప్పేయడంతో చాలా హ్యాపీగా ఉందని అంటాడు. నర్మద మాత్రం ‘నీకేం బాధనిపించడం లేదా? నీ మీద కోపంతో మావయ్య ఆ రైస్ మిల్ ని వల్లికి ఇచ్చారు. వల్లి వాళ్ళ ఫ్యామిలీ ఆ మిల్లును ఏం చేస్తారో తెలియడం లేదు. దీనివల్ల నువ్వు మావయ్య గారికి దూరమైపోతావు. నీకు ఏమి అర్థం కావడం లేదా’ అని అడుగుతుంది. దానికి ‘సాగర్ అన్నయ్య బాగానే చూసుకుంటాడు రైస్ మిల్లు, ఇంతవరకు మా నాన్న కోసమే జీవించాను. ఒక కొడుకుగా ఆయనకు ఎన్నో చేశాను. నా భార్యను అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. ఇప్పుడు మన కోసమే బతుకుతున్నాను’ అని అంటాడు. ఈ లోపు వేదవతి గిన్నెలు విసిరేస్తూ ఉంటుంది. నర్మద, వేదవతి దగ్గరికి వెళుతుంది. నర్మద ‘అత్తయ్యా’ అని పిలవగానే వేదవతి కోపంగా అరుస్తుంది. నన్ను అలా పిలవకు అని నర్మదని బయటికి పొమ్మని చెబుతుంది. దాంతో నర్మదా ప్రేమను కూడా తీసుకొచ్చి అత్తయ్యని కూల్ చేయాలి అనుకుంటుంది.

24
ధీరజ్ రొమాన్స్
Image Credit : Jio hotstar

ధీరజ్ రొమాన్స్

నర్మద ప్రేమ రూమ్ లోకి వెళుతుంది. ఈ లోపు అక్కడ ప్రేమ, ధీరజ్ మధ్య ఎస్సై పరీక్ష గురించి చర్చ నడుస్తూ ఉంటుంది. ప్రేమ పరీక్ష రాయనని చెప్పేస్తుంది. కానీ ధీరజ్ మాత్రం ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు. ‘ఇంట్లో అయిన గొడవ చూశావు కదా ఇప్పటికే నర్మదా అక్క, సాగర్ బావలతో అత్తయ్య మావయ్య మాట్లాడలేం లేదు. మనతో కూడా మాట్లాడటం మానేస్తారేమో’ అని భయపడుతుంది. ప్రేమ ధీరజ్ మాత్రం కచ్చితంగా పరీక్ష రాయాల్సిందేనని చెబుతాడు. ధీరజ్ లోనుంచి ఒక రొమాంటిక్ హీరో బయటికి వస్తాడు. ప్రేమను పట్టుకుని గిరగిరా తిప్పి దగ్గరగా తీసుకుంటాడు. ఆమె పెదవులను చేత్తోనే టచ్ చేస్తాడు. ఇక ముద్దు పెట్టేస్తాడు అన్న సమయంలో నర్మద ‘ప్రేమా’ అంటూ ఎంట్రీ ఇస్తుంది. ఒకరినొకరు వదిలేసి దూరంగా అయిపోతారు. నర్మద మాట్లాడుతూ ప్రేమతో ‘ఏంటి చెడగొట్టేసానా’ అని అడుగుతుంది. దానికి ప్రేమ మొత్తం చెడగొట్టేసావు అప్పుడప్పుడే రొమాన్స్ ని బయటకు తీస్తాడు, అలాంటిది నువ్వు వచ్చి ఇప్పుడు మొత్తం చెడగొట్టావు అనగానే ఇద్దరు కాసేపు నవ్వుకుంటారు. తర్వాత నర్మద అసలు విషయం చెబుతుంది. దాంతో ప్రేమ నర్మదతో కలిసి వేదవతి ఉన్న కిచెన్ లోకి వెళుతుంది.

కిచెన్‌లో వల్లి, వేదవతి కలిసి వంట చేస్తూ ఉంటారు. వల్లి అవకాశం వచ్చినప్పుడల్లా నర్మదపై వేదవతికి ఏదో ఒకటి చెప్పాలని చూస్తుంది. వేదవతి కసబుస్సు లాడుతూ ఉండడం గమనించి ఎవరి గురించి అత్తయ్య అని తెలివిగా అడుగుతుంది. అప్పుడు వేదవతి ‘ఇంకెవరూ నా గవర్నమెంట్ కోడలు తెలివైనదని.. నెత్తిన పెట్టుకుంటే కాలితో తన్నేసిందిగా’ అని అంటుంది. దానికి వల్లి ‘అంటే మీ జీవితంలో మావయ్యా కంటే నర్మదే ఎక్కువా’ అని అంటుంది. దానికి వేదవతి తింగరిదానా నువ్వొకదానివి సంబంధం లేకుండా మాట్లాడతావు అని అంటుంది. ఈ లోపు నర్మద, ప్రేమలో కిచెన్ లోకి వచ్చేస్తారు.

Related Articles

Related image1
Illu Illalu Pillalu Today Episode Feb 12: రైస్ మిల్లు ఓనర్‌గా వల్లి, నర్మద సాగర్‌ను ఛీ కొట్టిన రామరాజు దంపతులు
Related image2
Illu Illalu Pillalu Today Episode Feb 11: అమూల్యను పెళ్లిచేసుకోలేదని వల్లికి చెప్పేసిన విశ్వక్, నర్మద ప్రేమలకు షాకిచ్చిన భాగ్యం
34
వేదవతిని కూల్ చేసిన ప్రేమ
Image Credit : Jio hotstar

వేదవతిని కూల్ చేసిన ప్రేమ

వంట చేసి అలసిపోయావు కదా వల్లి అక్కా.. ఇక నువ్వు బయటికి వెళ్ళు అని చెబుతారు నర్మద ప్రేమ. కాని వల్లీ వెళ్లేందుకు ఇష్టపడదు. కానీ వారిద్దరు కోపంగా ముఖం పెట్టడంతో వెళుతున్నట్టే వెళ్లి దొంగ చాటుగా వినేందుకు ప్రయత్నిస్తుంది. ఆ విషయం ప్రేమ గమనించి కోపంగా చాకు తీయడంతో వల్లి పారిపోతుంది. ఇక ప్రేమ ‘అత్తయ్యగారేంటో కోపంగా ఉన్నారు. కోపం లేకుండా ఎలా ఉంటారు? నువ్వు మీ ఆయన చేసింది ఏమైనా మంచి పనా? అత్తయ్య గారు కాబట్టి ఏదో కోపంతో ఆగిపోయారు. అదే నేను ఆ స్థానంలో ఉంటే కాళ్లు విరిచిపోయిన పెట్టేసేదాన్ని’ అని అంటుంది ప్రేమ. దానికి నర్మద మాట్లాడుతూ ‘కొడుకు మీద చూపించకుండా కోపం కోడలు మీద చూపిస్తారేంటి? కోడలు బయట నుంచి వచ్చిందని లోకువ కదా’ అని అంటుంది నర్మద. అది విన్న వేదవతికి కోపం వచ్చేసి ‘ఏమంటున్నావే.. నేను కోడల్ని పరాయి వాళ్ళలా ఎప్పుడైనా చూసానా? కన్నకూతుళ్లలాగే చూసుకున్నాను కదా. మిమ్మల్ని ఎప్పుడైనా వేధించానా? అయినా కన్నా కూతుర్లే కడుపుకోత పెడుతుంటే ఇక కోడళ్ళు కొడుకులు పెట్టకుండా ఉంటారా?’ అని ఏడుపు మొదలవుతుంది. ఈలోపు ధీరజ్ కూడా అక్కడికి వస్తాడు. వేదవతి మాట్లాడుతూ ‘అందరూ తండ్రి గుండెల మీద తన్నేవారే. ఆయన ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఎవరి జీవితం వాళ్ళది అయిపోయింది. ఎవరి స్వార్థం వాళ్లది. పెంచిన తండ్రికి విలువ లేకుండా పోయింది’ అని బాధపడుతుంది వేదవతి. దానికి ధీరజ్ జాబ్ చేయాలన్నది వాడి డ్రీమ్.. ఎందుకమ్మా ఇబ్బంది పెట్టడం వదిలేయమని చెబుతాడు.

44
వేదవతికి షాకిచ్చిన ధీరజ్
Image Credit : Jio hotstar

వేదవతికి షాకిచ్చిన ధీరజ్

నర్మద మాట్లాడుతూ ‘మీకు మీ అబ్బాయి జాబ్ చేయడం ఇష్టం లేకపోతే చెప్పండి ఇప్పుడే ఆపేస్తాను. మీ అబ్బాయి ఆఫీసర్ లాగా రెడీ అయ్యి గౌరవంగా ఉండడం మీకు ఇష్టం లేదా’ అని అంటుంది. దానికి వేదవతి ‘కొడుకు దొరబాబులా ఉంటే ఏ తల్లికి మాత్రం ఇష్టం ఉండదు.. కానీ పిల్లలు ఆయన చేయి దాటి పోతున్నారు.. అదే బాధ. అందరూ నా దగ్గర అన్ని విషయాలు దాచేస్తున్నారు.. కానీ నా చిన్న కొడుకే నాకు అన్నీ చెబుతాడు’ అంటూ ధీరజ్ ను పొగిడేస్తుంది వేదవతి.

అప్పుడు ధీరజ్ కూడా ‘నీ దగ్గర నేను ఒక విషయం దాచాను అమ్మ.. ప్రేమ ఎస్సై అవుతానంటోంది. రేపు పరీక్ష ఉంది’ అని చెబుతాడు. దాంతో ప్రేమ వైపు కోపంగా చూస్తుంది. దానికి ప్రేమ ‘నాకేం తెలియదు అత్తయ్యా.. నేను రాయననే చెప్పాను. కానీ మీ అబ్బాయి పరీక్ష రాయమని చెబుతున్నాడు’ అని అంటుంది. అప్పుడు ధీరజ్ ‘పోలీస్ అవ్వాలన్నదే ప్రేమ కల. పుట్టింట్లో ఉంటే వాళ్ళ నాన్న వద్దని చెప్పేవాడా? నువ్వే ఆలోచించమ్మా’ అని సర్ది చెబుతాడు. అప్పుడు వేదవతి ‘నువ్వు సెంటిమెంట్‌తో మాట్లాడితే నేనేం చేయాలిరా? సాగర్ అలా షాక్ ఇస్తే నువ్వు ఇలా షాక్ ఇచ్చావు.. ఏదో ఒకటి చెయ్యు. మీ నాన్నకి మాత్రం చెప్పకండి’ అని చెబుతుంది వేదవతి. అప్పుడు అందరూ మా అమ్మ మంచిది, మా అత్త మంచిది అని వేదవతిని కౌగిలించుకుంటారు. వేదవతి మాత్రం చేయాల్సినవన్నీ చేసేసి మా మంచి అమ్,మ మా మంచి అత్త అంటే ఏంటో అని అంటుంది. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ ముగిసిపోతుంది

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
రామ్ చరణ్ , ఉపాసన తమ కవల పిల్లలకు పెట్టిన పేర్లు ఏంటో తెలుసా? నిజం ఎంత?
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: రవి లైఫ్ లోకి మరో అమ్మాయి, శ్రుతికి పోటీ..మీనా తమ్ముడు తెచ్చిన మరో తంటా
Recommended image3
త్రిష కు సూర్య తో ఉన్న 22 ఏళ్ల పవర్‌ఫుల్ సెంటిమెంట్ ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 12: రైస్ మిల్లు ఓనర్‌గా వల్లి, నర్మద సాగర్‌ను ఛీ కొట్టిన రామరాజు దంపతులు
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 11: అమూల్యను పెళ్లిచేసుకోలేదని వల్లికి చెప్పేసిన విశ్వక్, నర్మద ప్రేమలకు షాకిచ్చిన భాగ్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved