MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఓజీలో అకీరా, బాంబు పేల్చబోతున్న సుజీత్ ? రాంచరణ్ ఇన్వాల్వ్‌మెంట్ పై రేణు దేశాయ్ ఏమన్నారంటే

ఓజీలో అకీరా, బాంబు పేల్చబోతున్న సుజీత్ ? రాంచరణ్ ఇన్వాల్వ్‌మెంట్ పై రేణు దేశాయ్ ఏమన్నారంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. దీనితో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని రూమర్స్ ఓజీ మూవీపై మరింతగా ఆసక్తిని పెంచేస్తున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 24 2025, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఓజీ మ్యానియాతో రికార్డులు బద్దలు 
Image Credit : Asianet News

ఓజీ మ్యానియాతో రికార్డులు బద్దలు 

 ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ ఫీవర్ తో ఊగిపోతున్నారు. మరికొన్ని గంటల్లో ఓజీ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు బద్దలవుతున్నాయి. ఈ టైంలో ఓజీ మూవీ గురించి కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. కానీ ఆ రూమర్స్ ఫ్యాన్స్ లో హైప్ ని ఇంకా పెంచేస్తున్నాయి. 

25
ఓజీలో అకీరా నందన్ ?
Image Credit : Asianet News

ఓజీలో అకీరా నందన్ ?

సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్లుగా ఉంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ విధ్వంసం సృష్టించే ఇంటెన్స్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ యంగ్ గా ఉన్నప్పటి పాత్రలో ఆయన తనయుడు అకీరా  నందన్ కనిపిస్తారని ఒక ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరికొందరైతే ఓజీ పార్ట్ 2 అకీరాతో అని సుజీత్ క్లైమాక్స్ లో బాంబు పేల్చబోతున్నాడు అంటూ రూమర్స్ వస్తున్నాయి. దీనిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ చాలా కాలంగా కోరుకుంటున్నారు. 

Related Articles

Related image1
ఓజీ నటీనటుల రెమ్యునరేషన్స్ లిస్ట్.. పవన్, ప్రియాంక, శ్రీయా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ ఎవరెవరు ఎంత తీసుకున్నారు ?
Related image2
చిరంజీవితో సినిమా చేయమని స్టార్ హీరో తండ్రిని రిక్వస్ట్ చేసిన అల్లు అరవింద్.. కానీ అంతలోనే..
35
రేణు దేశాయ్ రియాక్షన్ ఇదే
Image Credit : Youtube/ DVV Entertainment

రేణు దేశాయ్ రియాక్షన్ ఇదే

అయితే దీనిపై రేణు దేశాయ్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. ఓజీ మూవీలో అకీరా నటిస్తున్నాడనేది పూర్తిగా అవాస్తవం. ఇప్పటిలో అకీరా ఎంట్రీ ఉండదు. అకీరాకి సినిమాల్లో నటించాలనే ఆలోచన వచ్చిన మరు క్షణమే నేనే స్వయంగా నా సోషల్ మీడియాలో అనౌన్స్ చేస్తాను. అప్పటి వరకు అకీరా గురించి వస్తున్న ఎలాంటి వార్తలు నమ్మకండి అని రేణుదేశాయ్ ఫ్యాన్స్ ని కోరారు. మరోవైపు అకీరాని లాంచ్ చేయడానికి రాంచరణ్ ప్రయత్నిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అది కూడా అబద్దమే అని రేణు దేశాయ్ తేల్చి చెప్పేశారు. 

45
సుజీత్ సినిమాటిక్ యూనివర్స్
Image Credit : Asianet News

సుజీత్ సినిమాటిక్ యూనివర్స్

ఓజీ గురించి మరో రూమర్ కూడా వైరల్ అవుతోంది. సాహో, ఓజీ చిత్రాలతో సుజీత్ తన సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయబోతున్నారు అని.. ఓజీ మూవీలో సాహో కనెక్షన్ ఉండబోతోందని అంటున్నారు. దీనిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఇది నిజమో కాదో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. 

55
ఓజీ ప్రీమియర్ షో చూడబోతున్న అకీరా
Image Credit : our own

ఓజీ ప్రీమియర్ షో చూడబోతున్న అకీరా

ఇదిలా ఉండగా అకీరా నందన్.. డైరెక్టర్ సుజీత్, మరికొందరు సెలెబ్రిటీల తో కలిసి హైదరాబాద్ లోని విమల్ థియేటర్ లో ఓజీ ప్రీ ప్రీమియర్ షో చూడబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రాత్రి 9 గంటల నుంచి, ఏపీలో రాత్రి 10 గంటల నుంచి పైడ్ ప్రీమియర్ షోలు పడనున్నాయి.   

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Anudeep KV: నెక్ట్స్ సినిమా ఇదే, వెంకీతో కాదా? ఫంకీలో వాళ్లపై సెటెర్లు.. హరీష్‌ నాగవంశీ, దిల్‌ రాజు మెరుపులు
Recommended image2
ఓటీటీ అభిమానులకు షాక్‌.. థియేటర్లోకి శివాజీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`?
Recommended image3
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Related Stories
Recommended image1
ఓజీ నటీనటుల రెమ్యునరేషన్స్ లిస్ట్.. పవన్, ప్రియాంక, శ్రీయా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ ఎవరెవరు ఎంత తీసుకున్నారు ?
Recommended image2
చిరంజీవితో సినిమా చేయమని స్టార్ హీరో తండ్రిని రిక్వస్ట్ చేసిన అల్లు అరవింద్.. కానీ అంతలోనే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved