MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కన్నీళ్లు తెప్పించే చిరంజీవి నటన, ఇప్పటి స్టార్ హీరోయిన్ తల్లితో రొమాన్స్.. ఖైదీ కన్నా ముందు జరిగిన అద్భుతం

కన్నీళ్లు తెప్పించే చిరంజీవి నటన, ఇప్పటి స్టార్ హీరోయిన్ తల్లితో రొమాన్స్.. ఖైదీ కన్నా ముందు జరిగిన అద్భుతం

ఖైదీ చిత్రంతో చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు. అంతకంటే ముందే చిరంజీవి తనలోని విలక్షణ నటనని బయటపెట్టిన చిత్రం ఒకటి ఉంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 15 2025, 10:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవిలోని నటుడిని వెలికి తీసిన చిత్రం
Image Credit : Asianet News

చిరంజీవిలోని నటుడిని వెలికి తీసిన చిత్రం

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశారు. కానీ ఫ్యాన్స్ ఎక్కువగా రికార్డులు సాధించిన చిత్రాలు గురించే చెప్పుకుంటారు. కానీ చిరంజీవిలోని అద్భుతమైన నటుడిని వెలికి తీసిన కొన్ని చిత్రాలు ఉన్నాయి. ఖైదీ చిత్రంతో చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు. అంతకంటే ముందే చిరంజీవి తనలోని విలక్షణ నటనని బయటపెట్టిన చిత్రం ఒకటి ఉంది. ఆ చిత్రం మరేదో కాదు.. పున్నమినాగు.

25
కీర్తి సురేష్ తల్లితో..
Image Credit : Facebook

కీర్తి సురేష్ తల్లితో..

1980లో రిలీజైన ఈ మూవీలో చిరంజీవి నెగటివ్ షేడ్స్ ఉండే పాత్రలో అద్భుతంగా నటించారు. తన శరీరమంతా పాము విషం తో నిండిపోయి ఉంటుంది. దాని నుంచి బయటపడలేక వేదన పడుతూ చిరంజీవి నటించిన విధానం కంటతడి పెట్టిస్తుంది. ఈ చిత్రంలో చిరంజీవి, నరసింహ రాజు, మేనక, రతి అగ్నిహోత్రి ప్రధాన పాత్రలో నటించారు. హీరోయిన్ మేనక ఎవరో కాదు.. ఇప్పటి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తల్లి ఆమె.

Related Articles

Related image1
చెలికత్తె వేషాలు వేసుకునే అమ్మాయి నాకు హీరోయినా ? చంద్రమోహన్ అవమానించిన నటి ఇండస్ట్రీని ఏలింది తెలుసా
Related image2
ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన బెస్ట్ టాలీవుడ్ మూవీస్ ఇవే.. ఈ జోనర్ లో వెంకటేష్ కి తిరుగులేదుగా..
35
రాత్రి వేళల్లో షూటింగ్
Image Credit : Youtube

రాత్రి వేళల్లో షూటింగ్

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 60 రోజులపాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కోసం చిరంజీవి దాదాపు 30 రోజులు రాత్రి వేళల్లోనే షూటింగ్ కి హాజరయ్యారట. అప్పటికి ఇండస్ట్రీలో చిరంజీవి పెద్దగా అనుభవం లేని నటుడు.

45
పాము లక్షణాలు ఉన్న వ్యక్తిగా..
Image Credit : Instagram/Chiranjeevi

పాము లక్షణాలు ఉన్న వ్యక్తిగా..

అయినప్పటికీ పాము లక్షణాలు ఉన్న వ్యక్తిగా, కథ మొత్తం తన భుజాలపై మోస్తూ చిరంజీవి నటించిన విధానం ఆద్యంతం కట్టిపడేస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాల్లో చిరంజీవి విశ్వరూపం ప్రదర్శించారు. చిరంజీవి ఈ చిత్రంలో కళ్ళతోనే హావభావాలు పలికించిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. 

55
పున్నమినాగు చిత్రానికి 45 ఏళ్ళు
Image Credit : Instagram/Chiranjeevi

పున్నమినాగు చిత్రానికి 45 ఏళ్ళు

చిరంజీవిలోని నటనని బయటకు తీసిన పున్నమినాగు చిత్రం ఇటీవల 45 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి నటనకి ప్రశంసలతో పాటు, ఆ తర్వాత హీరోగా మరిన్ని అవకాశాలు దక్కాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Sreeleela MBBS: డాక్టర్‌గా మారిన శ్రీలీల.. కానీ నెటిజన్లు ఎందుకు అనుమానిస్తున్నారో తెలుసా?
Recommended image2
Sivaji Ganesan: స్టార్‌ కమెడియన్‌ని ఇంటికి పిలిచి అవమానించిన శివాజీ గణేషన్‌.. స్టార్‌ హీరోకి మతిపోయే కౌంటర్‌
Recommended image3
Manasa Varanasi: మిస్‌ ఇండియా టైటిల్‌ గెలిస్తే ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా? అసలు నిజాలు బయటపెట్టిన మానస వారణాసి
Related Stories
Recommended image1
చెలికత్తె వేషాలు వేసుకునే అమ్మాయి నాకు హీరోయినా ? చంద్రమోహన్ అవమానించిన నటి ఇండస్ట్రీని ఏలింది తెలుసా
Recommended image2
ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన బెస్ట్ టాలీవుడ్ మూవీస్ ఇవే.. ఈ జోనర్ లో వెంకటేష్ కి తిరుగులేదుగా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved