MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన బెస్ట్ టాలీవుడ్ మూవీస్ ఇవే.. ఈ జోనర్ లో వెంకటేష్ కి తిరుగులేదుగా..

ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన బెస్ట్ టాలీవుడ్ మూవీస్ ఇవే.. ఈ జోనర్ లో వెంకటేష్ కి తిరుగులేదుగా..

తండ్రి సెంటిమెంట్ నేపథ్యంలో తెలుగులో చాలా చిత్రాలు వచ్చాయి. తండ్రి ప్రేమని తెలియజేసే టాలీవుడ్ బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 14 2025, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
తండ్రి రియల్ హీరో
Image Credit : Asianet News

తండ్రి రియల్ హీరో

ప్రతి ఒక్కరికీ వారి జీవితాల్లో తండ్రి రియల్ హీరోగా ఉంటారు. కుటుంబాన్ని నడిపించేది తండ్రి. అలాంటి తండ్రి సెంటిమెంట్ నేపథ్యంలో తెలుగులో చాలా చిత్రాలు వచ్చాయి. తండ్రి ప్రేమని తెలియజేసే టాలీవుడ్ బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

28
బొమ్మరిల్లు
Image Credit : Twitter

బొమ్మరిల్లు

భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తండ్రి పాత్ర ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఉంటుంది. తన కొడుకు ఎదిగినా, అతని జీవితంపై తన నియంత్రణ కొనసాగిస్తుంటాడు తండ్రి. ఆ పాత్రలో ప్రకాష్ రాజ్ ఒదిగిపోయి నటించారు. పెళ్లి విషయంలో హీరో సిద్దార్థ్ తండ్రితో విభేదించడం, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయి. చివర్లో తండ్రీ కొడుకుల ఎమోషనల్ సీన్స్ ఈ చిత్రానికి హైలైట్. 

Related Articles

Related image1
SSMB 29 : కెన్యా అడవుల్లో విధ్వంసానికి మహేష్ సిద్ధం.. లభించిన అనుమతులు
Related image2
చెలికత్తె వేషాలు వేసుకునే అమ్మాయి నాకు హీరోయినా ? చంద్రమోహన్ అవమానించిన నటి ఇండస్ట్రీని ఏలింది తెలుసా
38
నాన్నకు ప్రేమతో
Image Credit : Twitter

నాన్నకు ప్రేమతో

ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఒక తండ్రి-కొడుకు అనుబంధాన్ని చూపిస్తుంది. తండ్రి ఆస్తి కోల్పోయినప్పుడు, కొడుకు తన ప్రతిభను ఉపయోగించి దాన్ని తిరిగి సాధించాలనే సంకల్పంతో ప్రయాణం మొదలుపెడతాడు. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించారు. 

48
సన్నాఫ్ సత్యమూర్తి
Image Credit : Youtube

సన్నాఫ్ సత్యమూర్తి

ఈ చిత్రంలో అల్లు అర్జున్ తండ్రి మరణం తర్వాత కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యతను తీసుకుంటాడు. తన తండ్రి మరణించినప్పటికీ భూ వివాదంలో చెడ్డపేరు రాకూడదని అల్లు అర్జున్ చేసే పోరాటం ఈ చిత్రంలో ఆసక్తికరంగా ఉంటుంది. 

58
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
Image Credit : Zee5

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

వెంకటేష్ నటించిన ఈ చిత్రంలో కొడుకు ఉద్యోగం లేక తండ్రికి భారం అవుతాడు. కొడుకు ఉద్యోగం సాధించిన సమయంలో, తండ్రి అనుకోని రీతిలో మరణిస్తాడు. ఇది తండ్రి కొడుకుల మధ్య ఉండే భావోద్వేగ అనుబంధాన్ని హృదయాన్ని తాకేలా చూపుతుంది. వెంకటేష్ ఈ పాత్రకు నంది అవార్డు కూడా గెలుచుకున్నారు.

68
సూర్య వంశం 
Image Credit : Asianet News

సూర్య వంశం 

తండ్రి సెంటిమెంట్ తో వెంకటేష్ నటించిన మరో చిత్రం సూర్య వంశం. వెంకటేష్ ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో నటించారు. తండ్రికి ఇష్టం లేని చిన్న కొడుకుగా వెంకటేష్ నటించిన విధానం అద్భుతం. చివరికి తండ్రి మనసు ఎలా దోచుకున్నాడు అనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా ఉంటుంది. ఇవి కాకుండా తులసి, జయం మనదేరా లాంటి చిత్రాల్లో కూడా వెంకటేష్ తండ్రి సెంటిమెంట్ ని అద్భుతంగా పండించారు.

78
డాడీ 
Image Credit : Asianet News

డాడీ 

ఈ చిత్రంలో చిరంజీవి, సిమ్రన్ జంటగా నటించారు. కూతురి కోసం పరితపించే తండ్రిగా మెగాస్టార్ నటన ఆకట్టుకుంటుంది. 

88
హాయ్ నాన్న
Image Credit : Asianet News

హాయ్ నాన్న

నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం తండ్రీ కూతుళ్ళ మధ్య అనుబంధాన్ని చూపుతుంది. అనారోగ్యంతో ఉన్న కూతురిని కాపాడేందుకు తండ్రి చేసే పోరాటమే ఈ చిత్రం.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
అల్లు అర్జున్
దగ్గుబాటి వెంకటేష్
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu Home Tour : వావ్ అనాల్సిందే.. మహేష్ బాబు ఇంద్రభవనం లోపల ఎలా ఉందో చూశారా?
Recommended image2
ఆ హీరోయిన్ విషయంలో చిరంజీవి కోరిక నెరవేరడం ఇక కష్టమేనా.. అందరూ ఆశించిన మూవీ, ట్విస్ట్ ఇచ్చిన మెగాస్టార్
Recommended image3
Single Queens: పెళ్లి వయసు దాటవేసిన బ్యూటీలు..లైఫంతా ఒంటరిగానే మిగిలిపోతారా?
Related Stories
Recommended image1
SSMB 29 : కెన్యా అడవుల్లో విధ్వంసానికి మహేష్ సిద్ధం.. లభించిన అనుమతులు
Recommended image2
చెలికత్తె వేషాలు వేసుకునే అమ్మాయి నాకు హీరోయినా ? చంద్రమోహన్ అవమానించిన నటి ఇండస్ట్రీని ఏలింది తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved