- Home
- Entertainment
- Peddi Item Song : పవన్ కళ్యాణ్ హీరోయిన్ తో రామ్ చరణ్ రొమాన్స్.. పాట కోసం కోటి డిమాండ్ చేస్తున్న బ్యూటీ ఎవరు?
Peddi Item Song : పవన్ కళ్యాణ్ హీరోయిన్ తో రామ్ చరణ్ రొమాన్స్.. పాట కోసం కోటి డిమాండ్ చేస్తున్న బ్యూటీ ఎవరు?
బాబాయ్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ తో రొమాన్స్ కు రెడీ అవుతున్నాడు అబ్బాయి రామ్ చరణ్. పెద్ది సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం కోటి డిమాండ్ చేసిన ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

పెద్ది కోసం ఎదురుచూస్తున్న అభిమానులు..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పెద్ది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈసినిమా హాట్ టాపిక్‌గా మారింది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది మొదటగా ఈ నెల 30న విడుదల చేయాలని ప్రకటించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఈసినిమా రిలీజ్ డేట్ ను మార్చేశారు. షూటింగ్ అనుకున్న టైమ్ కు పూర్తికాకపోవడంతో.. రిలీజ్ డేట్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈసినిమాలో ఐటమ్ సాంగ్ షూట్ పెండింగ్ ఉన్నట్టు సమాచారం. ఈ ఐటమ్ సాంగ్ కు సబంధించి ఓ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.
హైలెట్ కాబోతున్న ఐటమ్ సాంగ్..
పెద్ది సినిమాకు బుచ్చిబాబు డైరెక్టర్.. కానీ సుకుమార్ అన్నీ తానై చూసుకుంటున్నాడు. సుకుమార్ శిష్యుడు కావడంతో.. ఆయన మార్క్ కొంత బుచ్చిబాబు సినిమాలో కనిపించడం కామన్. రామ్ చరణ్ తో గతంలో సుకుమార్ రంగస్థలం సినిమా చేశాడు. ఈసినిమాలో ఐటమ్ సాంగ్ ఎంత హైలెట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతే కాదు సుకుమార్ పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్స్ రెండు ఆడియన్స్ ను ఉర్రూతలూగించాయి. అందుకే ఈసారి రామ్ చరణ్ పెద్ది సినిమాలో అంతకు మించిన ఐటమ్ సాంగ్ ను సెట్ చేయాలని బుచ్చిబాబు గట్టిగా ప్లాన్ చేశాడట.
పెద్దిలో ఐటమ్ సాంగ్ చేయబోయే హీరోయిన్ ఎవరు?
అయితే పెద్ది సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఆడిపాడబోయే ఆ బ్యూటీ ఎవరన్న విషయంలో చాలా కాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది. కొన్నాళ్లు పూజా హెగ్డే పేరు వినిపించింది, మరికొన్ని రోజులు మృణాల్ పేరు వినిపించింది. ఇక తాజాగా పెద్ది మూవీ టీమ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం..
కోటి డిమాండ్ చేస్తున్న బ్యూటీ..
ఈసినిమాలో సంయుక్తా మీనన్ తో ఐటమ్ సాంగ్ చేయించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం ఆమె దాదాపు కోటి రూపాయలు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. తెలుగులో పవన్ కళ్యాణ్ , పరిచయం చేసిన ఈ బ్యూటీ.. బాలయ్య, ధనుష్ లాంటిస్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అవ్వడానికి మలయాళ హీరోయిన్ అయినా.. చీరకట్టులో అచ్చతెలుగు తారలా కనిపిస్తుంది.
సుకుమార్ తో సెట్స్ మీదకు మెగా పవర్ స్టార్..
ఇక ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా, జగపతిబాబు ప్రత్యేక గెటప్‌లో కనిపించబోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చరణ్ జంటగా నటిస్తోంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జూన్ లో ఈసినిమా రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమా తరువాత సుకుమార్ తో మరో భారీ ప్రాజెక్ట్ ను సెట్స్ ఎక్కించబోతున్నారు.

