- Home
- Entertainment
- నాగబాబు చేయాల్సిన మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి, తమ్ముడుకి అన్నయ్య కోలుకోలేని దెబ్బ
నాగబాబు చేయాల్సిన మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి, తమ్ముడుకి అన్నయ్య కోలుకోలేని దెబ్బ
తమ్ముడు నాగబాబు హీరోగా చేయాల్సిన మూవీని చిరంజీవి చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. పరోక్షంగా తమ్ముడి హీరో కెరీర్ కి పెద్ద దెబ్బ కొట్టారు మెగాస్టార్.

నాగబాబు చేయాల్సిన మూవీ చిరంజీవికి
మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా, హోస్ట్ గా, నిర్మాతగా రాణించారు. నటుడిగా సక్సెస్ అయ్యారు. జడ్జ్ గానూ సక్సెస్ అయ్యారు. కానీ నిర్మాతగా సక్సెస్ కాలేకపోయారు. అదే సమయంలో హీరోగానూ సక్సెస్ కాలేదు. అయితే ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా తనకు పడాల్సింది. ఆ మూవీని అన్న చిరంజీవి చేసి ఇండస్ట్రీ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ కథేంటో చూద్దాం.
ఆడియెన్స్ కి పూనకాలు తెప్పించిన మూవీ `గ్యాంగ్ లీడర్`
చిరంజీవిని తిరుగులేని మెగాస్టార్‌గా నిలిపిన చిత్రాల్లో `గ్యాంగ్ లీడర్` ఒకటి. ఈ సినిమాలో చిరు రెచ్చిపోయి నటించాడు. డాన్సులు, ఫైట్లు, మాస్ డైలాగ్‌లతో అదరగొట్టాడు. `చేయి చూడు ఎంత రఫ్‌గా ఉందో, రఫ్ఫాడిస్తా`, `ఒక్క సారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో` వంటి డైలాగులు అప్పట్లో మాస్ ఆడియెన్స్ కి పూనకాలు తెప్పించాయి.
ఇక డాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులోని పాటలను థియేటర్లలో రిపీటెడ్‌గా వేసుకుని చూసేవారు ఆడియెన్స్. పాటలు వచ్చాయంటే అసలు సీట్లో కూర్చునేవారు కాదు, డాన్సులతో రెచ్చిపోయేవారు. అసలైన సినిమా సెలబ్రేట్ చేయడం అంటే ఏంటో చూపించారు.
ఐకానిక్ డేట్‌కి `గ్యాంగ్ లీడర్` రిలీజ్
విజయబాపినీడు దర్శకత్వం వహించిన ఈ మూవీని మాగంటి రవీంద్రనాథ్ చౌదరీ నిర్మించారు. ఇందులో చిరంజీవి హీరోగా నటించగా, ఆయనకు జోడీగా విజయశాంతి హీరోయిన్‌గా చేసింది.
వీరి కాంబినేషన్‌కి అప్పట్లో యమక్రేజ్ ఉండేది. అది కూడా ఈ మూవీకి బాగా కలిసి వచ్చింది. ఇక రావు గోపాలరావు విలన్‌గా నటించగా, మురళీ మోహన్, శరత్ కుమార్, సుమలత వంటి వారు కీలక పాత్రలు పోషించారు. 1991లో ఈ చిత్రం విడుదలైంది.
చిరంజీవి కెరీర్‌లో ఐకానిక్ డేట్‌గా `మే 9`ని భావిస్తారు. `జగదేక వీరుడు అతిలోక సుందరి` కూడా ఇదే డేట్‌కి వచ్చిన విషయం తెలిసిందే. `గ్యాంగ్ లీడర్` సైతం అదే డేట్‌కి రిలీజ్ అయ్యింది.
`గ్యాంగ్ లీడర్`తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి
అప్పట్లో ఈ మూవీ కేవలం రెండు కోట్లతో రూపొందింది. కానీ పది కోట్లు వసూలు చేసింది. ఆ సమయంలో `గ్యాంగ్ లీడర్` మూవీ ఇండస్ట్రీ హిట్‌గా చెప్పొచ్చు. బయ్యర్లకి, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. చిరంజీవి కెరీర్‌లో మాస్ కల్ట్ చిత్రంగా నిలిచింది.
ఇప్పుడు అనిల్ రావిపూడి.. చిరంజీవితో ఇలాంటి జోనర్‌లోనే మూవీని తెరకెక్కిస్తున్నారు. మరోసారి అలాంటి వింటేజ్ చిరంజీవిని చూపించాలని ఆయన భావిస్తున్నట్టు తెలిపిన విషయం తెలిసిందే.
`గ్యాంగ్ లీడర్` నాగబాబు చేయాల్సింది
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మొదట హీరోగా నటించాల్సింది చిరంజీవి కాదు. తమ్ముడు నాగబాబుతో చేయాలనుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు విజయ బాపినీడు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
నాగబాబు అప్పటికే హీరోగా అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు విజయబాపినీడు మొదట నాగబాబుకి కథ చెప్పారు. ఆయన ఓకే అన్నారు. `షోలే` సినిమాలోని పాపులర్ డైలాగ్ `అరే ఓ సాంబ` అనే టైటిల్ అనుకున్నారు.
అయితే అనంతరం ఈ కథని నాగబాబు, విజయబాపినీడు కలిసి చిరంజీవికి వినిపించారు. దీంతో మెగాస్టార్‌కి ఇది బాగా నచ్చింది. తాను చేస్తానని ముందుకు వచ్చాడట. దీంతో నాగబాబు బ్యాక్ కావాల్సి వచ్చింది.
తమ్ముడిని పరోక్షంగా దెబ్బకొట్టిన అన్నయ్య
చిరంజీవి ఎంట్రీతో కథలో మార్పులు చేశారు, మాస్ డైలాగ్‌లు, మాస్ ఎలిమెంట్లు జోడించారు. పాటలు మరింత బాగా చేశారు. టైటిల్‌ని కూడా చిరంజీవి కోసం `గ్యాంగ్ లీడర్`గా మార్చారు అలా మెగాస్టార్‌తో ఈ సినిమా రూపొందింది. సంచలన విజయం సాధించింది.
దీన్ని హిందీలో `ఆజ్ కా గుండా రాజ్` పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయగా, అక్కడ కూడా విశేష ఆదరణ పొందింది. అప్పట్లో మెగా అభిమానులను ఓ ఊపు ఊపేసిందీ ఈ మూవీ. అలా నాగబాబుకి పడాల్సిన ఈ మూవీ చిరంజీవి అకౌంట్లో పడింది. ఆయన తిరుగులేని మెగాస్టార్ అయిపోయారు.
స్వయంగా అన్నయ్యనే నాగబాబు హీరో కెరీర్‌కి పరోక్షంగా పెద్ద దెబ్బ కొట్టాడు. నాగబాబు ఈ మూవీ చేస్తే ఈ స్థాయి హిట్ కాకపోవచ్చు, కానీ ఆయన్ని హీరోగా నిలబెట్టే అవకాశం ఉండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.