MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవితో నాగార్జున పోటీ పడితే ఇలానే ఉంటుంది, వార్ వన్ సైడ్ మాత్రం కాదు.. శివ తర్వాత చుక్కలు కనిపించాయి

చిరంజీవితో నాగార్జున పోటీ పడితే ఇలానే ఉంటుంది, వార్ వన్ సైడ్ మాత్రం కాదు.. శివ తర్వాత చుక్కలు కనిపించాయి

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మధ్య చాలా సందర్భాల్లో బాక్సాఫీస్ పోటీ జరిగింది. నాగార్జున తన తొలి చిత్రంతోనే చిరంజీవికి షాకిచ్చారు. వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ వార్ 2006 వరకు కొనసాగింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 29 2025, 04:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చిరంజీవి, నాగార్జున బాక్సాఫీస్ వార్
Image Credit : Instagram/@chiranjeevikonidela

చిరంజీవి, నాగార్జున బాక్సాఫీస్ వార్

టాలీవుడ్ లో అగ్ర హీరోలైన చిరంజీవి, నాగార్జున దాదాపు 10 సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. నాగార్జున, చిరంజీవి మధ్య మంచి స్నేహం ఉంది. కానీ సినిమాల విషయంలో మాత్రం పోటీ ఉంటుంది. వీరిద్దరి పోటీ స్టాలిన్ -బాస్ వరకు కొనసాగింది. నాగార్జున తన తొలి చిత్రం విక్రమ్ తోనే చిరంజీవితో పోటీ మొదలు పెట్టారు. వేట- విక్రమ్ నుంచి స్టాలిన్ - బాస్ వరకు చిరంజీవి నాగార్జున ఏ చిత్రాలతో పోటీ పడ్డారో ఇప్పుడు చూద్దాం. 

26
తొలి చిత్రంతోనే చిరంజీవికి షాకిచ్చిన నాగార్జున
Image Credit : X/@iamnagarjuna

తొలి చిత్రంతోనే చిరంజీవికి షాకిచ్చిన నాగార్జున

నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం విక్రమ్. ఈ మూవీ 1986 మే 23 న రిలీజ్ అయింది. మే 28న చిరంజీవి వేట చిత్రం రిలీజ్ అయింది. విక్రమ్ మూవీ హిట్ కాగా చిరంజీవి వేట నిరాశ పరిచింది. తొలి చిత్రంతోనే నాగార్జున చిరంజీవికి షాక్ ఇచ్చారు. అదే ఏడాది ఆగష్టు 22న చిరంజీవి చంటబ్బాయి రిలీజ్ కాగా ఆగష్టు 29న నాగార్జున కెప్టెన్ నాగార్జున చిత్రం రిలీజ్ అయింది. చంటబ్బాయి మంచి విజయం సాధించింది. కెప్టెన్ నాగార్జున ఫ్లాప్. 

Related Articles

Related image1
ఒకే ఏడాది నాలుగు సినిమాలని దెబ్బ కొట్టిన జూ.ఎన్టీఆర్.. వెంకటేష్, మహేష్ బాబు సినిమాల అడ్రెస్ గల్లంతు
Related image2
టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరో తెలుసా ? ఏఐ ప్రకారం టాప్ 5 లిస్ట్ ఇదే.. వాళ్ళిద్దరి పేర్లు ఉండడం షాకింగ్
36
1987లో నాగార్జునకి నిరాశ
Image Credit : Instagram/@chiranjeevikonidela

1987లో నాగార్జునకి నిరాశ

1987 జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా నాగార్జున అరణ్య కంద చిత్రం రిలీజ్ అయింది. జనవరి 9న చిరంజీవి దొంగమొగుడు రిలీజ్ అయింది. అరణ్య కాండ చిత్రం డిజాస్టర్ కాగా దొంగమొగుడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే ఏడాది మార్చిలో చిరంజీవి, నాగార్జున ఇద్దరికీ నిరాశ తప్పలేదు. మార్చిలో విడుదలైన చిరంజీవి ఆరాధన, నాగార్జున సంకీర్తన రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. 

46
1988లో మిక్స్డ్ రిజల్ట్స్
Image Credit : Instagram/@chiranjeevikonidela

1988లో మిక్స్డ్ రిజల్ట్స్

1988 మార్చి 4న విడుదలైన చిరంజీవి రుద్రవీణ చిత్రం విమర్శకుల ప్రశంసలు, అవార్డులు పొందింది కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. మార్చి 12న వచ్చిన నాగార్జున ఆఖరి పోరాటం చిత్రం సూపర్ హిట్ అయింది. అదే ఏడాది జూన్ లో మరోసారి చిరు నాగార్జున పోటీ పడ్డారు. ఆ నెలలో విడుదలైన ఖైదీ నెంబర్ 786 సూపర్ హిట్ కాగా నాగార్జున మురళీ కృష్ణుడు చిత్రం యావరేజ్ గా నిలిచింది. 

56
శివ తర్వాత నాగార్జునకి బిగ్ షాక్
Image Credit : Instagram/@chiranjeevikonidela

శివ తర్వాత నాగార్జునకి బిగ్ షాక్

1989లో సంక్రాంతికి చిరంజీవి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, నాగార్జున విజయ్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ఇండస్ట్రీ హిట్ కాగా.. విజయ్ చిత్రం డిజాస్టర్ అయింది. ఆ తర్వాత 1990లో ఆసక్తికర పోటీ జరిగింది. అంతకు ముందే శివ లాంటి ఇండస్ట్రీ హిట్ తో నాగార్జున పేరు టాలీవుడ్ లో మారుమోగుతోంది. శివ తర్వాత అమల, నాగార్జున వెంటనే నటించిన చిత్రం ప్రేమ యుద్ధం. ఈ మూవీ 1990 మార్చి 23 న రిలీజ్ అయింది. ఈ చిత్రానికి రెండు వారాల ముందు విడుదలైన చిరంజీవి కొండవీటి దొంగ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రేమ యుద్ధం మాత్రం డిజాస్టర్. 

66
చివరగా పోటీ పడింది అప్పుడే
Image Credit : X/@iamnagarjuna

చివరగా పోటీ పడింది అప్పుడే

ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున ముగ్గురు మొనగాళ్లు, గోవిందా గోవిందా చిత్రాలతో పోటీ పడ్డారు. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇక చివరగా చిరు, నాగ్ మధ్య పోటీ జరిగింది 2006లో. ఆ ఏడాది చిరంజీవి నటించిన స్టాలిన్ చిత్రం యావరేజ్ గా నిలిచింది. నాగార్జున బాస్ మూవీ ఫ్లాప్ అయింది. మొత్తంగా చిరు, నాగార్జున మధ్య బాక్సాఫీస్ వార్ ఏకపక్షంగా అయితే జరగలేదు. నాగార్జున చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చారు.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: ఫంక్షన్ లో మటన్ ముక్కల కోసం గొడవ, పోయిన బాలు పరువు..రోహిణీ మాజీ భర్త ఎంట్రీ
Recommended image2
Sequel Movies: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 7 ఇండియన్ సీక్వెల్స్.. 'ధురంధర్ 2' రికార్డులు బద్దలు కొడుతుందా?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: పారుతో ఆడుకున్న కార్తీక్- స్వప్నను లాక్ చేసిన శ్రీధర్- జ్యో నటన
Related Stories
Recommended image1
ఒకే ఏడాది నాలుగు సినిమాలని దెబ్బ కొట్టిన జూ.ఎన్టీఆర్.. వెంకటేష్, మహేష్ బాబు సినిమాల అడ్రెస్ గల్లంతు
Recommended image2
టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరో తెలుసా ? ఏఐ ప్రకారం టాప్ 5 లిస్ట్ ఇదే.. వాళ్ళిద్దరి పేర్లు ఉండడం షాకింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved