- Home
- Entertainment
- Sequel Movies: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 7 ఇండియన్ సీక్వెల్స్.. 'ధురంధర్ 2' రికార్డులు బద్దలు కొడుతుందా?
Sequel Movies: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 7 ఇండియన్ సీక్వెల్స్.. 'ధురంధర్ 2' రికార్డులు బద్దలు కొడుతుందా?
Sequel Movies: బాహుబలి, కేజీఎఫ్, పుష్ప చిత్రాల సీక్వెల్స్ బాక్సాఫీసుని షేక్ చేశాయి. సంచలన కలెక్షన్లని రాబట్టాయి. మరి ఇటీవల `ధురంధర్` మూవీ బాక్సాఫీసు షేక్ చేసింది. వచ్చే నెలలో దీని సీక్వెల్ రాబోతుంది. గత రికార్డులను ఇది బ్రేక్ చేస్తుందా?

7.గదర్ 2
సన్నీ డియోల్ హీరోగా డైరెక్టర్ అనిల్ శర్మ తీసిన 'గదర్ 2' సినిమా 2023లో రిలీజైంది. అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మతో పాటు సిమ్రత్ కౌర్, మనీషా వాధ్వా, గౌరవ్ చోప్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.691.08 కోట్లు వసూలు చేసింది. దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సీక్వెల్స్ జాబితాలో ఇది 7వ స్థానంలో ఉంది.
6. రోబో 2.0
2018లో వచ్చిన డైరెక్టర్ శంకర్ సినిమా '2.0', దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సీక్వెల్స్ లిస్ట్‌లో ఆరో స్థానంలో ఉంది. రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.723 కోట్ల వసూళ్లని రాబట్టింది. కానీ ఫెయిల్యూర్‌గా మిగిలిపోయింది.
5. స్ట్రీ 2
`స్త్రీ 2` 2024లో రిలీజైన కామెడీ హారర్ సినిమా. దీనికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.874.58 కోట్లు వసూలు చేసింది. ఇది దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సీక్వెల్స్ జాబితాలో 5వ స్థానంలో నిలిచింది.
4. కాంతార 2
'కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1' .. 2025లో విడుదలైన ఒక కన్నడ మైథాలజీ యాక్షన్ డ్రామా సినిమా. దీనికి రిషబ్ శెట్టి కథ రాసి, దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రిషబ్‌తో పాటు జయరాం, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.850-900 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సీక్వెల్స్ జాబితాలో ఇది నాలుగో స్థానంలో ఉంది.
3. కేజీఎఫ్ 2
పీరియడ్ యాక్షన్ సినిమాగా 2022లో 'కేజీఎఫ్ చాప్టర్ 2' విడుదలైంది. దీనికి ప్రశాంత్ నీల్ కథ రాసి, దర్శకత్వం వహించారు. ఇందులో యశ్, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్, రావు రమేష్, అర్చన జోయిస్, శరన్ శక్తి, ఈశ్వరీ రావు, జాన్ కొక్కెన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1250 కోట్లు వసూలు చేసింది. కన్నడ సినిమా దశ దిశని మార్చేసింది. దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సీక్వెల్స్ జాబితాలో ఈ సినిమా మూడో స్థానంలో ఉంది.
2. పుష్ప 2
దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సీక్వెల్ సినిమాల్లో అల్లు అర్జున్ 'పుష్ప 2' రెండో స్థానంలో ఉంది. డైరెక్టర్ సుకుమార్ తీసిన ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్నా, ఫహద్ ఫాసిల్, జగపతి బాబు, సునీల్, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2024లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1642 కోట్ల కలెక్షన్ సాధించింది.
1.బాహుబలి 2
దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సీక్వెల్స్ జాబితాలో డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి తీసిన 'బాహుబలి 2' మొదటి స్థానంలో. ఇందులో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటించారు. పీరియడ్, ఫాంటసీ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1810.60 కోట్లు వసూలు చేసింది. అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది.

