MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Balakrishna: బాలకృష్ణ ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు? మీరు ఊహించని నటి

Balakrishna: బాలకృష్ణ ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు? మీరు ఊహించని నటి

నందమూరి నటసింహం బాలకృష్ణ 50 ఏళ్ల ఫిల్మ్ కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో జోడీగా నటించారు. ఎందరో కొత్త హీరోయిన్లను ఆయన పరిచయం చేశాడు. అయితే బాలకృష్ణ సరసన నటించిన ఫస్ట్ హీరోయిన్ ఎవరో మీకు తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 24 2026, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానం..
Image Credit : facebook.com/NandamuriBalakrishna

బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానం..

ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తాతమ్మ కల సినిమాతో బాలనటుడిగా అడుగు పెట్టిన బాలకృష్ణ... ఆతరువాత కాలంలో హీరోగా మారి, స్టార్ గా ఎదిగాడు. నందమూరి వారసత్వంతో పరిశ్రమలోకి వచ్చినా.. తన సొంత టాలెంట్ తో స్టార్ డమ్ సాధించాడు. 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు బాలయ్య బాబు. 65 ఏళ్లు వచ్చినా.. ఇప్పటికీ మాస్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ఈ వయసులో కూడా యాక్షన్ సీక్వెన్స్ లను అదరగొడుతున్నాడు. నందమూరి అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు.

25
బాలయ్య ఫస్ట్ హీరోయిన్ ఎవరు?
Image Credit : facebook/nandamuri balakrishna fans page

బాలయ్య ఫస్ట్ హీరోయిన్ ఎవరు?

బాలయ్య తో సినిమా అంటే హీరోయిన్లు ఎగిరి గంతేస్తుంటారు. అప్పట్లో తులసి, రతీ, భానుప్రియ, ఆతరువాత రోజుల్లో రోజా, మీన, రమ్యకృష్ణ, త్రిష,నయనతార, కాజల్ వరకూ..ఎందరో హీరోయిన్లు బాలకృష్ణతో ఆడిపాడారు. ఎందరో హీరోయిన్లను తన సినిమాలతో స్టార్లుగా మార్చాడు బాలయ్య. అంతే కాదు ఎంతో మంది కొత్త హీరోయిన్లకు కూడా లైఫ్ ఇచ్చాడు నటసింహం. విజయశాంతితో అత్యధికంగా 16 సినిమాలు చేశాడు బాలయ్య. ఇంతకీ బాలకృష్ణ ఫస్ట్ సినిమా హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె ఎవరో కాదు జయమాలిని.

Related Articles

Related image1
Sravanthi Chokarapu: స్రవంతి చొక్కారపు భర్త ఎవరు? ఏం చేస్తారు? రెండు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నారు?
Related image2
Allu Arjun Remuneration : రాకా కోసం అల్లు అర్జున్, దీపికా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
35
అన్నదమ్ములుగా నటించిన ఎన్టీఆర్ - బాలకృష్ణ
Image Credit : facebook.com/NandamuriBalakrishna

అన్నదమ్ములుగా నటించిన ఎన్టీఆర్ - బాలకృష్ణ

బాల నటుడిగా రెండు సినిమాలు చేసిన బాలకృష్ణ.. అన్నదమ్ముల అనుబంధం సినిమాతో హీరోగా మారాడు. ఈసినిమాలో తన తండ్రి ఎన్టీఆర్ కు చిన్న తమ్ముడిగా బాలయ్య నటించారు. జయమాలిని ఈసినిమాలో డాన్సర్ పాత్రలో బాలయ్య సరసన కనిపించింది. అన్నదమ్ముల అనుబంధం జయమాలినికి రెండో సినిమా కాగా.. ఆతరువాత ఆమె ఐటమ్స్ సాంగ్స్ తో పాపులర్ అయ్యింది. హీరోయిన్ గా రెండు సినిమాలు మాత్రమే చేసిన ఆమె.. కెరీర్ అంతా డాన్సర్ గానే కొనసాగింది. బాలయ్య ఫస్ట్ హీరోయిన్ తానే అని ఓ ఇంటర్వ్యూలో జయమాలిని స్వయంగా వెల్లడించింది.

45
బాలకృష్ణ మంచి మనసు..
Image Credit : our own

బాలకృష్ణ మంచి మనసు..

జయమాలిని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలయ్య మంచి మనసు గురించి కూడా వెల్లడించింది. ''ఎవరైనా ఐటమ్ సాంగ్స్ చేసేవాళ్లను హీరోయిన్లుగా గుర్తించరు. కానీ బాలయ్య మాత్రం నన్ను తన ఫస్ట్ హీరోయిన్ అని ఒప్పుకున్నాడు. ఓ భారీ ఈవెంట్ లో అందరికి జయమాలిని నా మొదటి సినిమా హీరోయిన్ అని చెప్పి తన మంచి మనసు చాటుకున్నారని ఆమె అన్నారు. గతంలో జయమాలిని చెప్పిన ఈ విషయాలు రీసెంట్ గా వైరల్ అవుతున్నాయి.

55
65 ఏళ్ల వయసులో తగ్గేదే లే..
Image Credit : x/nbk fans

65 ఏళ్ల వయసులో తగ్గేదే లే..

బాలకృష్ణ ఇప్పటికీ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. వరుస సక్సెస్ లతో సందడి చేస్తున్నాడు. 65 ఏళ్ల వయసులో కూడా అభిమానులను తన సినిమాలతో ఉర్రూతలూగిస్తున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ2 సినిమాలతో సక్సెస్ సాధించిన ఆయన.. మరో హిట్ తో డబుల్ హ్యాట్రిక్ పై కన్నేశాడు. ప్రస్తుతం మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు నటసింహం. మరికొన్ని కథలను పెండ్డింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఒక వైపు ఎమ్మెల్యేగా బిజీగా ఉన్నా.. సినిమాలను కూడా బ్యాలెన్స్ చేస్తున్నాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gedela Raju Review: గేదెల రాజు మూవీ రివ్యూ, రఘు కుంచె లీడ్‌గా చేసిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Jr NTR: నాకు పట్టిన శని వదిలింది అప్పుడే.. తన లైఫ్ పై, ముగ్గురు హీరోయిన్లపై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Rakul: రకుల్ ని అందుకే పెళ్లి చేసుకున్నా, అది ఒక సిట్యుయేషనల్ రిలేషన్‌షిప్‌..భర్త షాకింగ్ కామెంట్స్
Related Stories
Recommended image1
Sravanthi Chokarapu: స్రవంతి చొక్కారపు భర్త ఎవరు? ఏం చేస్తారు? రెండు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నారు?
Recommended image2
Allu Arjun Remuneration : రాకా కోసం అల్లు అర్జున్, దీపికా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved