MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anasuya బట్టలపై కొడుకు కామెంట్.. సొంత కొడుకని కూడా చూడలేదు, ఇచ్చిపడేసిన మాజీ యాంకర్‌

Anasuya బట్టలపై కొడుకు కామెంట్.. సొంత కొడుకని కూడా చూడలేదు, ఇచ్చిపడేసిన మాజీ యాంకర్‌

Anasuya: యాంకర్ అనసూయ ఇటీవల ఆడవాళ్లు, హీరోయిన్ల దుస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీని ఒక రేంజ్‌లో ఆడుకున్న విషయం తెలిసిందే. అయితే తన బట్టలపై సొంత కొడుకే కామెంట్‌ చేశాడట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 02 2026, 07:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శివాజీని ఉక్కిరి బిక్కిరి చేసిన అనసూయ
Image Credit : youtube/@iDreamCelebrities

శివాజీని ఉక్కిరి బిక్కిరి చేసిన అనసూయ

ఇటీవల టాలీవుడ్ లో హీరోయిన్ల బట్టలపై వివాదం నడిచిన విషయం తెలిసిందే. నటుడు శివాజీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. దీనిపై చాలా మంది స్టార్‌ హీరోయిన్లు, ఇతర నటీమణులు స్పందించారు. ఇక అనసూయ అయితే రెచ్చిపోయింది. ఇదే ఛాన్స్ అని శివాజీని ఆడుకుంది. కామెంట్లతో, పోస్ట్ లతో బ్యాక్‌ టూ బ్యాక్ ఎటాక్‌ చేస్తూ ఉపిరాడకుండా చేసింది. అంతేకాదు కొత్త సంవత్సరం సందర్భంగా బికినీ ఫోటోలు పంచుకుని ఆయనకు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది.

25
లైఫ్‌ స్టయిల్‌ విషయంలో అనసూయ రూటే సెపరేట్‌
Image Credit : youtube/@iDreamCelebrities

లైఫ్‌ స్టయిల్‌ విషయంలో అనసూయ రూటే సెపరేట్‌

తాను వేసుకునే డ్రెస్సుల విషయంలో, తన లైఫ్‌ స్టయిల్‌ విషయంలో స్వేచ్ఛగా ఉంటుంది అనసూయ. ఎవరినీ లెక్కచేయదు. తన భర్త కూడా అనసూయ విషయంలో ఫ్రీడమ్ ఇస్తాడు. ఆమె కంఫర్ట్స్ కే ప్రయారిటీ ఇస్తాడు. దీంతో అనసూయ ఫ్యామిలీ లైఫ్‌ చాలా సాఫీగా సాగిపోతుంది. అయితే ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. భర్త బాగానే అర్థం చేసుకున్నాడు, కానీ పిల్లల విషయంలో అసలు ఇబ్బంది స్టార్ట్ అయ్యింది. అనసూయ బట్టలపై సొంత కొడుకే కామెంట్‌ చేస్తున్నాడట. ఈ విషయాన్ని ఆమెనే వెల్లడించడం విశేషం.

Related Articles

Related image1
50 లక్షలతో తీస్తే రూ.120కోట్లతో బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించిన సినిమా ఏంటో తెలుసా? సరికొత్త హిస్టరీ
Related image2
Akhanda 2 Collections: `అఖండ 2` 22 రోజుల కలెక్షన్లు.. బాలయ్య సినిమా వంద కోట్లు దాటినా లాభం లేదు
35
అనసూయ బట్టలపై కొడుకు కామెంట్‌
Image Credit : Instagram/Anasuya Bharadwaj

అనసూయ బట్టలపై కొడుకు కామెంట్‌

అనసూయ బట్టలపై తన పెద్ద కొడుకు కామెంట్‌ చేస్తున్నాడట. పొట్టిబట్టలు వేసుకుంటే అభ్యంతరం చెబుతున్నాడట. మమ్మీ ఇలాంటి డ్రెస్‌ వేసుకుంటున్నావెందుకు అని ప్రశ్నిస్తున్నాడట. నచ్చలేదని మొహం మీదే చెబుతున్నాడట. ఓ రోజు తాను క్రాప్‌ టాప్‌ వేసుకుంటే, అది కింద వరకు వేసుకో మమ్మీ అన్నాడట. చాలా సార్లు మీ డ్రెస్‌ నచ్చలేదు మమ్మీ అంటూ ఓపెన్‌గానే కామెంట్‌ చేశాడట. ఇలా చాలా సార్లు పెద్ద కొడుకు కామెంట్‌ చేసినట్టు తెలిపింది అనసూయ.

45
కొడుక్కి అనసూయ క్రేజీ కౌంటర్‌
Image Credit : youtube/@iDreamCelebrities

కొడుక్కి అనసూయ క్రేజీ కౌంటర్‌

అంతేకాదు కొడుక్కి కూడా అనసూయ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. నా బట్టలు నా ఇస్టం, నాకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా వేసుకుంటానని చెప్పిందట. ముందు అర్థమయ్యేలా చెప్పిందట. ఆ తర్వాత సీరియస్‌గానే చెప్పిందట. అతను వేసుకునే టీషర్ట్ లు తనకు ఇష్టం ఉండదని, అలాంటిది వేసుకోనిస్తున్నా కదా, ఇది కూడా అలానే అని చెప్పిందట అనసూయ. సొంత కొడుకు అని కూడా చూడకుండా గట్టిగానే ఇచ్చిపడేసిందట. అయితే ఇది నాలుగేళ్ల క్రితం నాటి విషయం. అప్పుడు ఐడ్రీమ్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పింది అనసూయ. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

55
యాంకరింగ్‌ వదిలేసిన అనసూయ
Image Credit : youtube/@iDreamCelebrities

యాంకరింగ్‌ వదిలేసిన అనసూయ

అనసూయ జబర్దస్త్ కామెడీ షోతో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇది ఆమె లైఫ్‌నే మార్చేసింది. స్టార్ యాంకర్‌ని చేసింది. దాదాపు తొమ్మిదేళ్లు ఆమె ఈ షోకి యాంకర్‌గా చేసింది. రెండేళ్ల క్రితమే దీన్నుంచి తప్పుకుంది. నిర్వాహకుల ప్రవర్తన, తనపై వేసే జోకులు వంటివాటిని పరిగణలోకి తీసుకుని షోని వదులుకుందట. తనపై కమెడియన్లు డబుల్‌ మీనింగ్ డైలాగ్‌లు, పంచ్ లు వేస్తుంటారు. ఇది చూసి తన పిల్లలు తప్పుగా అనుకుంటారనే ఉద్దేశ్యం కూడా అనసూయ జబర్దస్త్ ని వీడటానికి ఓ కారణమని సమాచారం. ప్రస్తుతం నటిగానే పరిమితమయ్యింది. అడపాదడపా సినిమాలు చేస్తోంది. ఇటీవల రేణు దేశాయ్‌తో కలిసి ఓ కొత్త మూవీని ప్రారంభించుకుందీ మాజీ యాంకర్.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అనసూయ భరద్వాజ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
సుస్మిత కొణిదెల భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? చిరంజీవి పెద్దల్లుడు రేంజ్ తెలిస్తే షాక్ అవుతారు..
Recommended image2
తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?
Recommended image3
ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే
Related Stories
Recommended image1
50 లక్షలతో తీస్తే రూ.120కోట్లతో బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించిన సినిమా ఏంటో తెలుసా? సరికొత్త హిస్టరీ
Recommended image2
Akhanda 2 Collections: `అఖండ 2` 22 రోజుల కలెక్షన్లు.. బాలయ్య సినిమా వంద కోట్లు దాటినా లాభం లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved