MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Akhanda 2 Collections: `అఖండ 2` 22 రోజుల కలెక్షన్లు.. బాలయ్య సినిమా వంద కోట్లు దాటినా లాభం లేదు

Akhanda 2 Collections: `అఖండ 2` 22 రోజుల కలెక్షన్లు.. బాలయ్య సినిమా వంద కోట్లు దాటినా లాభం లేదు

Akhanda 2 Collections: బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన `అఖండ 2` మూవీ బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్‌ అవుతుంది. వంద కోట్ల కలెక్షన్లు దాటినా కూడా ఈ మూవీ భారీగా నష్టాలను మిగిల్చబోతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 02 2026, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారీ అంచనాల మధ్య విడుదలైన `అఖండ 2`
Image Credit : Asianet News

భారీ అంచనాల మధ్య విడుదలైన `అఖండ 2`

నందమూరి నటసింహం బాలకృష్ణ గతేడాది డిసెంబర్లో `అఖండ 2`తో అలరించారు. ఇది నాలుగేళ్ల క్రితం వచ్చిన `అఖండ`కి సీక్వెల్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్‌ సంయుక్త, పూర్ణ, హర్సాలి ముఖ్య పాత్రలు పోషించారు. ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ మూవీ డిసెంబర్ 12న రిలీజ్‌ అయ్యింది. ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా డిలే అయిన విషయం తెలిసిందే. ఇది సినిమాపై గట్టి ప్రభావం చూపించింది.

25
`అఖండ 2`కి డివైడ్ టాక్‌
Image Credit : Asianet News

`అఖండ 2`కి డివైడ్ టాక్‌

ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన రాబట్టుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీని చూసి చాలా వరకు ఆడియెన్స్ డిజప్పాయింట్‌ అయ్యారు. బాలయ్య అభిమానులే పెదవి విరిచారు. వాళ్లు ఎక్స్ పెక్ట్ చేసింది ఒకటి, సినిమాలో చూపించింది మరోటి ఉండటంతో తీసుకోలేకపోయారు. దీంతో రెండో రోజు నుంచే ఈ మూవీ కలెక్షన్లు భారీగా పడిపోయాయి. అయితే దర్శకుడు బోయపాటి ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకే పాన్‌ ఇండియా లెవల్లో విడుదల చేశారు. శివతత్వం ప్రధానంగా సాగే మూవీ కావడంతో నార్త్ ఇండియా ఆడియెన్స్ కి బాగా కానెక్ట్ అవుతుందని, కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్‌ చేస్తుందని భావించారు. కానీ బాక్సాఫీసు వద్ద వారి లెక్కలన్నీ తారుమారయ్యాయి.

Related Articles

Related image1
kalyan padala love story: నా కంటే వాడు బెటర్‌గా ఉన్నాడని వెళ్లిపోయింది.. కళ్యాణ్‌ క్రేజీ లవ్‌ స్టోరీ, ఎంత మోసం చేసింది
Related image2
Nilakanta Movie Review: `నీలకంఠ` మూవీ రివ్యూ, రేటింగ్.. మాస్టర్ మహేంద్రన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
35
అఖండ 2 తాండవం 22 రోజుల కలెక్షన్లు
Image Credit : Film Poster

అఖండ 2 తాండవం 22 రోజుల కలెక్షన్లు

`అఖండ 2 తాండవం` మూవీ థియేటర్లలో సత్తా చాటలేకపోయింది. దారుణంగా పడిపోయింది. ఇక సినిమా విడుదలై 22 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఎంత కలెక్షన్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అయ్యిందా? ఇంకా ఎంత రావాలి అనేది చూస్తే.  ఇప్పటి వరకు 22 రోజులకుగానూ ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.121కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఏకంగా రూ.95కోట్ల వసూళ్లని రాబట్టింది. ఇతర అన్ని స్టేట్స్ లో ఏడు కోట్లు రాబట్టగా, ఓవర్సీస్ లో ఐదు కోట్లు రాబట్టింది. ఈ లెక్కన ఈ మూవీ దాదాపు రూ.70కోట్ల షేర్‌ని రాబట్టింది.

45
అఖండ 2 బిజినెస్‌
Image Credit : Asianet News

అఖండ 2 బిజినెస్‌

`అఖండ 2`కి రిలీజ్‌కి ముందు అయిన థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.103కోట్లు. అంటే రూ.104కోట్ల షేర్‌ వస్తే బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది. కానీ ఇప్పుడు సుమారు రూ.34కోట్ల దూరంలో ఉందీ మూవీ. ఇంకా అంత షేర్‌ రావాలంటే రూ.60కోట్లకుపైగా గ్రాస్‌ రావాలి. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్‌ రన్‌ క్లోజింగ్‌కి చేరుకుంటుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రోజుకి మూప్పై లక్షలు మాత్రమే వస్తోంది. ఇలా ఇంకా వంద రోజులు నడిచినా బ్రేక్‌ ఈవెన్‌ కాలేదు. దీంతో వంద కోట్ల కలెక్షన్లు దాటినా అది ఉపయోగం లేకుండాపోయిందని చెప్పొచ్చు.

55
అఖండ 2కి నష్టాలు
Image Credit : Twitter

అఖండ 2కి నష్టాలు

వచ్చే వారం ప్రభాస్‌ `ది రాజా సాబ్‌` రిలీజ్‌ కాబోతుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. అన్ని థియేటర్లలో ఆ మూవీనే వేస్తారు. దీంతో `అఖండ 2`ని థియేటర్ల నుంచి ఎత్తేస్తారు. ఆటోమెటిక్‌గా బాక్సాఫీసు వసూళ్లు క్లోజ్ కాబోతున్నాయని చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఈ మూవీకి సుమారు రూ.30కోట్లకుపైగా నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే నిర్మాతలు ముందుగానే సేఫ్‌ అయ్యారు. కానీ సినిమాని కొన్న బయ్యర్లు మాత్రం గట్టిగానే నష్టపోతారని చెప్పొచ్చు. మరి వారిని ఎలా ఆదుకుంటారో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్ కంటే వయసులో చిన్నదైనా.. ఆయనకు తల్లిగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
SuperStar Krishna కి చుక్కలు చూపించిన వెంకటేష్‌.. `సంక్రాంతి` దెబ్బకి అడ్రస్‌ లేకుండా పోయిన సినిమాలివే
Recommended image3
సుస్మిత కొణిదెల భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? చిరంజీవి పెద్దల్లుడు రేంజ్ తెలిస్తే షాక్ అవుతారు..
Related Stories
Recommended image1
kalyan padala love story: నా కంటే వాడు బెటర్‌గా ఉన్నాడని వెళ్లిపోయింది.. కళ్యాణ్‌ క్రేజీ లవ్‌ స్టోరీ, ఎంత మోసం చేసింది
Recommended image2
Nilakanta Movie Review: `నీలకంఠ` మూవీ రివ్యూ, రేటింగ్.. మాస్టర్ మహేంద్రన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved