MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 50 లక్షలతో తీస్తే రూ.120కోట్లతో బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించిన సినిమా ఏంటో తెలుసా? సరికొత్త హిస్టరీ

50 లక్షలతో తీస్తే రూ.120కోట్లతో బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించిన సినిమా ఏంటో తెలుసా? సరికొత్త హిస్టరీ

Laalo: గుజరాతీ సినిమాలో యాభై కోట్లు వసూలు చేస్తేనే అదొక రికార్డు, అదొక సంచలనం. కానీ ఇప్పుడు వంద కోట్లు దాటిందో మూవీ. సరికొత్త హిస్టరీకి శ్రీకారం చుట్టింది. మరి ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 02 2026, 05:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గుజరాతీ సినిమా దశ దిశని మార్చిన మూవీ
Image Credit : book my show

గుజరాతీ సినిమా దశ దిశని మార్చిన మూవీ

మన వద్ద ఒక సినిమా వంద కోట్లు కలెక్ట్ చేస్తే పెద్ద లెక్క కాదు. ఐదు వందల కోట్లు వసూలు చేసినా పెద్దగా పట్టించుకోం. వెయ్యి కోట్లు చేస్తే వాహ్ బాగా చేసిందంటాం. అదే `బాహుబలి 2`, `పుష్ప 2`లా వసూళు చేస్తే రికార్డులుగా చెప్పుకుంటాం. కానీ గుజరాతీ సినిమా(గోలీవుడ్ల్)లో మాత్రం యాభై కోట్లు వసూలు చేస్తే అదొక సంచలనం, అదే వంద కోట్లు చేస్తే అదొక హిస్టరీ. అలాంటి హిస్టరీని తాజాగా ఒక సినిమా క్రియేట్ చేసింది. ఏకంగా రూ.120 కోట్లు వసూలు చేసి గోలీవుడ్ కి `బాహుబలి`లా నిలిచింది.

24
లాలో సరికొత్త సంచలనం
Image Credit : book my show

లాలో సరికొత్త సంచలనం

గుజరాతీ సినిమా దశ దిశని మార్చిన మూవీ `లాలో. `శ్రీ కృష్ణ సదా సహాయతే` అనేది ట్యాగ్ లైన్. డివోషనల్‌ డ్రామాగా ఈ మూవీ రూపొందింది. దీనికి అంకిత్‌ సాఖియా దర్శకత్వం వహించారు. కృషాన్ష్ వాజా, అంకిత్ సాఖియా, విక్కీ పూర్ణిమా రైటర్స్. ఇందులో రీవా రచా, శృహద్ గోస్వామి, కరణ్ జోషి, మిస్తీ కడేచా ప్రధాన పాత్రలు పోషించారు.

Related Articles

Related image1
Nilakanta Movie Review: `నీలకంఠ` మూవీ రివ్యూ, రేటింగ్.. మాస్టర్ మహేంద్రన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
Related image2
Akhanda 2 Collections: `అఖండ 2` 22 రోజుల కలెక్షన్లు.. బాలయ్య సినిమా వంద కోట్లు దాటినా లాభం లేదు
34
లాలో మూవీ కథ ఇదే
Image Credit : book my show

లాలో మూవీ కథ ఇదే

ఈ సినిమా ఒక రిక్షా డ్రైవర్‌ జర్నీని ఆవిష్కరిస్తుంది. రిక్షా డ్రైవర్ అనుకోకుండా ఓ ఫామ్‌ హౌజ్ లో ఇరుక్కుంటాడు. దాన్ని లాక్ వేసి వెళ్లిపోతారు. దీంతో అందులో నుంచి బయటకు రాలేకపోతాడు. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. దీంతో ఆ హౌజ్‌లో అతను ఎలాంటి స్ట్రగుల్స్ అనుభవించాడు, ఎలాంటి శక్తులతో యుద్ధం చేయాల్సి వచ్చింది, తనని తాను ఏం తెలుసుకున్నాడు, శ్రీకృష్ణుడిని ఎలా చూడగలిగాడు, చివరికి తనలో వచ్చిన రియలైజేషన్ ఏంటనేది సినిమా. శ్రీకృష్ణుడికి సంబంధించిన దైవత్వం ప్రధానంగా ఈ మూవీ రూపొందింది.

44
రూ.50 లక్షల బడ్జెట్.. రూ.120కోట్లు రాబట్టిన లాలో
Image Credit : book my show

రూ.50 లక్షల బడ్జెట్.. రూ.120కోట్లు రాబట్టిన లాలో

రిక్షా డ్రైవర్‌గా కరణ్‌ జోషి నటించాడు. లాలో(కృష్ణుడు) పాత్రలో శృహద్‌ గోస్వామి నటించాడు. రీవా రచా కీలక పాత్ర పోషించింది. `లాలో` గతేడాది అక్టోబర్ 10న విడుదలైంది. ఈ సినిమా కేవలం యాభై లక్షలతో రూపొందడం విశేషం. కానీ బాక్సాఫీసు వద్ద ఏకంగా రూ.120కోట్లు వసూలు చేసింది. గుజరాతీ సినిమా హిస్టరీలోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచింది. అంతకు ముందు 2019లో `చాల్‌ జీవీ లైయే` అనే మూవీ రూ.52కోట్లు రాబట్టింది. అప్పటికీ అదొక సంచలనం. ఇండస్ట్రీ హిట్‌. కానీ ఇప్పుడు ఆ రికార్డుని బ్రేక్‌ చేస్తూ వంద కోట్లు దాటిన తొలి గుజరాతీ ఫిల్మ్ గా `లాలో` నిలిచింది. సినీ ప్రియులను, కామన్‌ ఆడియెన్స్ ని సైతం ఆశ్చర్యపరిచింది. ఇక ఈ మూవీని ఇప్పుడు హిందీలో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నెల 9న బాలీవుడ్‌లో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. అక్కడి ఆడియెన్స్ కి కనెక్ట్ అయితే ఇది సరికొత్త సంచలనంగా నిలవబోతుందని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్ కంటే వయసులో చిన్నదైనా.. ఆయనకు తల్లిగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
SuperStar Krishna కి చుక్కలు చూపించిన వెంకటేష్‌.. `సంక్రాంతి` దెబ్బకి అడ్రస్‌ లేకుండా పోయిన సినిమాలివే
Recommended image3
సుస్మిత కొణిదెల భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? చిరంజీవి పెద్దల్లుడు రేంజ్ తెలిస్తే షాక్ అవుతారు..
Related Stories
Recommended image1
Nilakanta Movie Review: `నీలకంఠ` మూవీ రివ్యూ, రేటింగ్.. మాస్టర్ మహేంద్రన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Akhanda 2 Collections: `అఖండ 2` 22 రోజుల కలెక్షన్లు.. బాలయ్య సినిమా వంద కోట్లు దాటినా లాభం లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved