MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్, రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్ లో.. మెగా ఫ్యాన్స్ కు పండగే.. వైరల్ అవుతోన్న ఫోటోస్

అల్లు అర్జున్, రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్ లో.. మెగా ఫ్యాన్స్ కు పండగే.. వైరల్ అవుతోన్న ఫోటోస్

మెగా, అల్లు ప్యామిలీ మధ్య విభేదాల వార్తలు నేపధ్యంలో మరోసారి అల్లు అర్జున్, రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్ లో సందడి చేశారు. ఇద్దరు స్టార్స్ ఇలా కనిపించే వరకూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 01 2025, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మెగా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్...
Image Credit : Asianet News

మెగా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్...

చాలా కాలంగా మెగా, అల్లు కుటుంబాల మధ్య తెలియని గ్యాప్ నడుస్తోంది. అఫీషియల్ గా వీరు గొడవపెట్టుకున్నది లేదు, బయటకి వచ్చి కామెంట్స్ చేసుకున్నది లేదు. కానీ ఎందుకో ఈ ఫ్యామిలీస్ మధ్య కాస్త దూరం కొనసాగుతూ వచ్చింది. ఇక ఎలెక్షన్స్ టైమ్ లో అల్లు అర్జున్ తన స్నేహితుడైన వైసీపీ లీడర్ రవికి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేయడం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకపోవడంతో.. ఈ వార్తలు మరింతగా పెరిగిపోయాయి. కిందస్థాయిలో వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుకోవడం, విమర్శలు చేసుకోవడం జరిగింది. ఈక్రమంలోనే మెగా,అల్లు ఫ్యామిలీలను ఒకటి చేసే సందర్భాలు కూడా కొన్ని వచ్చాయి.

25
అల్లు అర్జున్ కు అండగా మెగా కుటుంబం
Image Credit : Asianet News

అల్లు అర్జున్ కు అండగా మెగా కుటుంబం

ఈ క్రమంలో అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ అవ్వడం.. తొక్కిసలాటలో ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో..బన్నీ అరెస్ట్ అయ్యి.. ఒక రోజు జైల్లో ఉన్నారు. అప్పుడు మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ కు అండగా నిలబడింది. చిరంజీవి స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించడంతో పాటు.. రంగంలోకి దిగి.. బన్నీని బయటకు రప్పించారన్న టాక్ ఉంది. ఆతరువాత అల్లు అర్జున్ చిరంజీవి, నాగబాబు ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నారు. దాంతో రెండు కుటుంబాల మధ్య కాస్త పాజిటీవ్ వాతావరణం వచ్చింది. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ నానమ్మ, రామ్ చరణ్ అమ్మమ్మ అల్లు నాగరత్నమ్మ చనిపోయినప్పుడు మెగా ఫ్యామిలీ అంతా అల్లు ఇంట్లోనే ఉండి.. అంతా చూసుకున్నారు. అప్పుడు కూడా అందరు క్లోజ్ గా మాట్లాడుకోవడం ఫ్యాన్స్ ను సంతోషపెట్టింది. ఇక తాజాగా మరోసారి అల్లు, మెగా కుటుంబాలు ఒకే ఫ్రేమ్ లో సందడి చేయడంతో, అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Related Articles

Related image1
ప్రభాస్ కి 70 రోజులు చుక్కలు చూపించిన రాజమౌళి, ఎంత టార్చర్ పెట్టాడంటే?
Related image2
150 కోట్ల ఇల్లున్న సౌత్ స్టార్ హీరో ఎవరు? కాస్ట్లీ హౌస్ ఉన్న స్టార్స్ లో.. తెలుగు హీరోలదే హవా
35
ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్ - అల్లు అర్జున్
Image Credit : google

ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్ - అల్లు అర్జున్

మొదటి నుంచి అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూశారు. వారు అనుకున్నట్టుగానే ఈమధ్య కాలంలో ఇద్దరు క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపిస్తున్నారు. రీసెంట్ గా అల్లు కుటుంబంలో వేడుక జరిగింది. హీరో అల్లు శిరీష్ నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అలాగే కొంతమంది సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకల్లో మెగా, అల్లు ఫ్యామిలీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

45
వైరల్ అవుతోన్న మెగా, అల్లు ఫ్యామిలీ ఫోటోస్
Image Credit : Asianet News

వైరల్ అవుతోన్న మెగా, అల్లు ఫ్యామిలీ ఫోటోస్

తాజాగా అల్లు శిరీష్ తన నిశ్చితార్థ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా ఆ వేడుకలో తీసిన పలు ఫ్యామిలీ ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోల్లో మెగా – అల్లు కుటుంబ సభ్యులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి కనిపించడం అభిమానులకు కనులవిందుగా మారింది. ఇక నుంచి ఈ రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ వార్తలు రాకుండా ఉంటే బాగుండు అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నిశ్చితార్థ వేడుక ఫొటోల్లో కాబోయే జంట అల్లు శిరీష్ , నయనికతో పాటు శ్రీజ, లావణ్య, అల్లు బాబీ, ఆయన భార్య, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, అల్లు స్నేహ, సురేఖ, అల్లు అరవింద్, పవన్ భార్య అన్న లెజనోవా, అలాగే అల్లు అరవింద్ భార్య కనిపించారు.

55
పండగ చేసుకుంటున్న అభిమానులు
Image Credit : Asianet News

పండగ చేసుకుంటున్న అభిమానులు

వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు కూడా హాజరయ్యారు. అతిథులతో కూర్చున్న చిరంజీవి, నాగబాబు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో ఈ ఫోటోలకు ఫ్యాన్న్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. భారీగా షేర్ చేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Recommended image1
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Recommended image2
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Recommended image3
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Related Stories
Recommended image1
ప్రభాస్ కి 70 రోజులు చుక్కలు చూపించిన రాజమౌళి, ఎంత టార్చర్ పెట్టాడంటే?
Recommended image2
150 కోట్ల ఇల్లున్న సౌత్ స్టార్ హీరో ఎవరు? కాస్ట్లీ హౌస్ ఉన్న స్టార్స్ లో.. తెలుగు హీరోలదే హవా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved