MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అలాంటి బట్టలు వేసుకోవద్దు అని ఎవరైనా చెబితే నేనేం చేస్తానో తెలుసా.. ఐశ్వర్య రాజేష్ కామెంట్స్

అలాంటి బట్టలు వేసుకోవద్దు అని ఎవరైనా చెబితే నేనేం చేస్తానో తెలుసా.. ఐశ్వర్య రాజేష్ కామెంట్స్

హీరోయిన్లు ధరించే బట్టలపై ఎంత పెద్ద వివాదం జరిగిందో చూశాం. దీనిపై హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏం చెప్పారో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 30 2026, 12:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Aishwarya Rajesh
Image Credit : Instagram/Aishwarya Rajesh

Aishwarya Rajesh

ఇటీవల హీరోయిన్లు ధరించే బట్టలు, డ్రెస్సింగ్ స్టైల్ గురించి టాలీవుడ్ లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. శివాజీ చేసిన వ్యాఖ్యలతో ఈ చర్చ మొదలైంది. శివాజీ వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. అనసూయ ఈ వివాదంలో ఇన్వాల్వ్ అయి కౌంటర్ ఇవ్వడంతో రచ్చ ఇంకా పెద్దదైంది. శివాజీ, అనసూయ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మహిళలు ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటారు. అందులో ప్రాబ్లమ్ ఏంటి అని అనసూయ మాట్లాడింది. అనసూయ కామెంట్స్ ని కొందరు సపోర్ట్ చేయగా మరికొందరు ట్రోల్ చేశారు. 

25
ఐశ్వర్య రాజేష్ కామెంట్స్ 
Image Credit : Instagram/Aishwarya Rajesh

ఐశ్వర్య రాజేష్ కామెంట్స్ 

తాజాగా మహిళల బట్టలపై మరో హీరోయిన్ స్పందించింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఐశ్వర్య రాజేష్. ఈ మూవీ తర్వాత తెలుగులో ఐశ్వర్య రాజేష్ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ కి మహిళలు ధరించే బట్టల గురించి ప్రశ్న ఎదురైంది. 

Related Articles

Related image1
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై బాలయ్య డైరెక్టర్ సెటైర్లు.. భైరవ ద్వీపం సినిమాకి అవార్డులు వచ్చింది అందుకే
Related image2
తెరవెనుక ఆ డైరెక్టర్, తన కుమార్తె సుస్మితతో కలిసి చిరంజీవి భారీ ప్లాన్.. టాలీవుడ్ చరిత్రలో ఇదే తొలిసారి
35
వద్దు అని చెబితే ఆ బట్టలు వేసుకోను
Image Credit : Instagram/Aishwarya Rajesh

వద్దు అని చెబితే ఆ బట్టలు వేసుకోను

మీకు కాబోయే భర్త కానీ, మీకు కావలసిన వాళ్ళు కానీ ఇలాంటి బట్టలు వేసుకోవద్దు, ఈ బట్టలు వేసుకో అని చెబితే వింటారా అని యాంకర్ ప్రశ్నించారు. దీనితో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. తప్పకుండా వింటాను. మన మంచి కోసం చెబుతున్నప్పుడు వింటే తప్పు ఏంటి అని అన్నారు. వాళ్ళు వద్దు అని చెబితే నేను ఆ డ్రెస్ వేసుకోను. నా వ్యక్తిత్వం అంతే. 

45
షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళితే
Image Credit : Instagram/Aishwarya Rajesh

షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళితే

మా ఇంట్లో మా బ్రదర్.. అమ్ములు ఈ డ్రెస్ బాగాలేదు అని చెబితే వెంటనే దానిని పక్కన పెట్టేస్తాను. నేను ఎప్పుడైనా ఫారెన్ వెళితే అక్కడ వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకుంటా. కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఎవరి ఫీలింగ్స్ ని హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అసలు డ్రెస్సింగ్ పై నా ఒపీనియన్ చెప్పాలి అంటే.. రెస్పాన్సిబుల్ గా ఉండాలి అని అంటాను.  ఎక్కడికైనా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళితే అక్కడ  జనాలు ఎలా ఉంటారో తెలుసు. కాబట్టి రివీలింగ్ డ్రెస్సులు వేసుకోవడం మంచిది కాదు. 

55
ఎవరి ఇష్టం వాళ్ళది
Image Credit : Instagram

ఎవరి ఇష్టం వాళ్ళది

కానీ ఎవరైనా రివీలింగ్ డ్రెస్సులు వేసుకోవాలి అంటే మనం అడ్డు చెప్పలేం. అది వాళ్ళ ఇష్టం. నా వరకు మాత్రం డ్రెస్సింగ్ అనేది రెస్పాన్సిబుల్ గా ఉండాలి అని భావిస్తా అని ఐశ్వర్య రాజేష్ అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?
Recommended image2
ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే
Recommended image3
Jeffrey Epstein: ఎవ‌రీ జెఫ్రీ, ఆ ఐల్యాండ్‌లో ఏం చేశాడు? OTTలో భయంకర సత్యాలను తెలిపే డాక్యుమెంటరీ
Related Stories
Recommended image1
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై బాలయ్య డైరెక్టర్ సెటైర్లు.. భైరవ ద్వీపం సినిమాకి అవార్డులు వచ్చింది అందుకే
Recommended image2
తెరవెనుక ఆ డైరెక్టర్, తన కుమార్తె సుస్మితతో కలిసి చిరంజీవి భారీ ప్లాన్.. టాలీవుడ్ చరిత్రలో ఇదే తొలిసారి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved