Shubman Gill: శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ రికార్డులు ఇవే
Shubman Gill double century:ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో దుమ్మురేపే బ్యాటింగ్ తో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ లో కెప్టెన్ గా తన మొదటి డబుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు.

డబుల్ సెంచరీతో శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర
Shubman Gill double century: భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ తన కెరీర్‌లో తొలి టెస్ట్ డబుల్ సెంచరీని కొట్టి చరిత్ర సృష్టించాడు.
గురువారం (జూలై 3, 2025న) ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు గిల్ ఈ ఘనతను సాధించాడు.
మొదటి రోజు 114 పరుగుల వద్ద అజేయంగా నిలిచిన గిల్, రెండో రోజు తన స్కోరును 200కు చేర్చాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ కాగా, ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ డబుల్ సెంచరీలు సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు.
Maiden DOUBLE-CENTURY for Shubman Gill in Test Cricket! 💯💯
What a knock from the #TeamIndia Captain! 🫡🫡
Updates ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND | @ShubmanGillpic.twitter.com/JLxhmh0Xcs— BCCI (@BCCI) July 3, 2025
సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్ తరువాత గిల్
ESPNcricinfo ప్రకారం, ఇంగ్లాండ్‌లో టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన భారత ఆటగాళ్లలో గిల్ మూడవ వ్యక్తి. 1979లో ది ఓవల్ వేదికగా సునీల్ గవాస్కర్ 221 పరుగులు చేయగా, 2002లో అదే వేదికపై రాహుల్ ద్రావిడ్ 202 పరుగులు చేశారు. ఇప్పుడు గిల్ ఈ లెజెండరీ ప్లేయర్ల గొప్ప జాబితాలో చేరాడు.
ఇంగ్లాండ్ గడ్డపై భారత టెస్ట్ కెప్టెన్ టాప్ స్కోర్ కొట్టిన గిల్
ఇంగ్లాండ్ గడ్డపై భారత టెస్ట్ కెప్టెన్లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. 1990లో మోహమ్మద్ అజహరుద్దీన్ మాంచెస్టర్‌లో 179 పరుగులు చేసిన రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. 2018లో విరాట్ కోహ్లీ బర్మింగ్‌హామ్‌లో 149 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు.
కెప్టెన్ గా గిల్ డబుల్ సెంచరీ రికార్డు
Cricbuzz ప్రకారం, గిల్ టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన ఆరో భారత కెప్టెన్. ఇప్పటి వరకు టెస్ట్ కెప్టెన్లుగా డబుల్ సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ (7), పటౌడీ, గవాస్కర్, సచిన్, ధోని, గిల్ చెరో ఒక్కటి సాధించారు. ఇక ఓవర్సీస్ టెస్ట్‌లో డబుల్ సెంచరీ చేసిన రెండవ భారత కెప్టెన్ గా గిల్ నిలిచాడు. అంతకుముందు 2016లో వెస్టిండీస్‌పై విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ కొట్టాడు.
SENA దేశాల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియా కెప్టెన్
గిల్ SENA (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియా కెప్టెన్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఘనతను సాధించడంలో టాప్ స్కోరును శ్రీలంక ప్లేయర్ దిల్షాన్ 193 పరుగులు చేశాడు. కానీ, డబుల్ సెంచరీని కొట్టలేకపోయాడు.
అతి చిన్న వయసులో డబుల్ సెంచరీ కొట్టిన రెండో కెప్టెన్ గిల్
శుభ్ మన్ గిల్, భారత టెస్ట్ కెప్టెన్‌గా రెండవ అతి చిన్న వయసులో డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. గిల్ 25 ఏళ్లు 298 రోజుల వయస్సులో డబుల్ సెంచరీ కొట్టాడు. మొదటి స్థానంలో పటౌడీ (23 ఏళ్ల 39 రోజులు) ఉన్నారు. తర్వాతి స్థానాల్లో సచిన్ (26 ఏళ్ల 189 రోజులు), కోహ్లీ (27 ఏళ్ల 260 రోజులు) ఉన్నారు.
తక్కువ తప్పిదాలతో సెంచరీ
గిల్ తొలి రోజు చేసిన సెంచరీ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్‌లో నమోదైన అత్యంత నియంత్రిత (కంట్రోల్డ్) ఇన్నింగ్స్‌గా నిలిచింది. ఫాల్స్ షాట్ శాతం కేవలం 3.5% గా ఉన్నాయి. ఇది సాధారణంగా ఇంగ్లాండ్‌లో 12% ఉంటుంది.
హోమ్ అవే టెస్ట్‌లలో 1,000+ పరుగులు పూర్తి చేసిన గిల్
ఈ టెస్ట్‌లో గిల్ తన 7వ టెస్ట్ సెంచరీ సాధించాడు. మొత్తం అతనికి ఇప్పటివరకు 7 సెంచరీలు, 7 అర్థశతకాలు ఉన్నాయి. గిల్ ఇప్పటి వరకు టెస్ట్‌లలో 2,240కి పైగా పరుగులు సాధించగా, హోమ్ అవే మ్యాచ్‌ల్లో 1,000 పరుగుల మార్కును దాటాడు. కేవలం ఇంగ్లాండ్‌పైనే 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు సాధించాడు.
జడేజాతో గిల్ కలిసి భారీ భాగస్వామ్యం
భారత్ ను భారీ స్కోర్ దిశగా ముందుకు తీసుకెళ్లింది గిల్ - రవీంద్ర జడేజా భాగస్వామ్యం. మొదటి రోజు భారత్ 211/5తో కష్టాల్లో ఉన్న సమయంలో వీరిద్దరూ కలసి 99 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రెండో రోజు ఈ భాగస్వామ్యం 203 పరుగులకు చేరింది. జడేజా 89 పరుగుల వద్ద జోష్ టంగ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అప్పటికే భారత్ 400 పరుగుల మార్కును దాటింది.
వాషింగ్టన్ సుందర్‌తో గిల్ 50+ భాగస్వామ్యం
జడేజా ఔటైన తర్వాత వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి వచ్చి గిల్‌కు తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి మరో అర్థశతక భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ స్కోరును 500లు దాటించారు. ఈ పిచ్ పరుగులు చేయడానికి అనుకూలంగా ఉండడంతో భారత బ్యాటర్లు దాన్ని బాగా వినియోగించుకున్నారు. ప్రస్తుతం భారత్ 564/7 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ఆడుతోంది. గిల్ 265* పరుగులు, ఆకాశ్ దీప్ లు క్రీజులో ఉన్నారు.