MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్

IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్

IND vs PAK : అడ్డంగా బుక్కైన పాకిస్థాన్.. ఇండియా దెబ్బకు మైండ్ బ్లాక్.. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్, పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠ వీడింది. పాక్ డిమాండ్లను ఐసీసీ తిరస్కరించడంతో మ్యాచ్ జరిగే అవకాశాలు మెరుగయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 09 2026, 10:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జై షా దెబ్బకు దిగొచ్చిన పాకిస్థాన్.. ఆ కండీషన్లకు ఐసీసీ నో
Image Credit : Getty

జై షా దెబ్బకు దిగొచ్చిన పాకిస్థాన్.. ఆ కండీషన్లకు ఐసీసీ నో

టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ దశలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్‌పై నెలకొన్న ఉత్కంఠ దాదాపు తొలగిపోయే దశకు చేరుకుంది. ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని ప్రకటించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), ఇప్పుడు వెనక్కి తగ్గినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మధ్య జరిగిన కీలక చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. సుమారు రూ. 4,000 కోట్లకు పైగా విలువైన ఈ మ్యాచ్‌ను రద్దు చేసుకోవడం ఇష్టం లేని ఐసీసీ, పాకిస్థాన్‌తో చర్చలు జరిపి అడ్డంకిని తొలగించే ప్రయత్నం చేసింది.

అయితే, ఈ చర్చల్లో పాకిస్థాన్ ఐసీసీ ముందు పలు డిమాండ్లను ఉంచగా.. జై షా నేతృత్వంలోని అంతర్జాతీయ క్రికెట్ మండలి వాటిలో కీలకమైన వాటిని తిరస్కరించింది. పలు మీడియా రిపోర్టుల ప్రకారం.. ఐసీసీ, పీసీబీ మధ్య జరిగిన చర్చల సారాంశం, తిరస్కరించిన డిమాండ్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి..

26
పాకిస్థాన్ డిమాండ్లు - ఐసీసీ ఏం చెప్పింది?
Image Credit : ANI

పాకిస్థాన్ డిమాండ్లు - ఐసీసీ ఏం చెప్పింది?

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐదు ప్రధాన డిమాండ్లను ఐసీసీ ముందు ఉంచగా.. వాటిలో కొన్నింటికి మాత్రమే సానుకూల స్పందన లభించింది. ముఖ్యంగా భారత్‌తో సంబంధం ఉన్న డిమాండ్లను ఐసీసీ తోసిపుచ్చింది.

1. బంగ్లాదేశ్‌కు ఆర్థిక జరిమానా వద్దు: టీ20 ప్రపంచకప్‌లో పాల్గొననందున బంగ్లాదేశ్‌కు జరిమానా విధించవద్దని, వారి రెవెన్యూ వాటాను పూర్తిగా చెల్లించాలని పీసీబీ కోరింది. దీనికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై ఎలాంటి పెనాల్టీ ఉండదని, ఇది తమ మునుపటి నిర్ణయమేనని ఐసీసీ స్పష్టం చేసింది.

2. బంగ్లాదేశ్‌కు పరిహారంగా మరో ఈవెంట్: వచ్చే సైకిల్‌లో బంగ్లాదేశ్‌కు అదనపు ఐసీసీ ఈవెంట్ కేటాయించాలని పీసీబీ డిమాండ్ చేసింది. వచ్చే సైకిల్‌లో అండర్-19 ప్రపంచకప్ నిర్వహణ బాధ్యతను బంగ్లాదేశ్‌కు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది.

3. భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్: భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగేలా ఐసీసీ చొరవ తీసుకోవాలని పీసీబీ గట్టిగా కోరింది. ఈ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. ద్వైపాక్షిక సిరీస్‌లు తమ పరిధిలోకి రావని, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్‌లో కూడా తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.

4. ట్రై సిరీస్ : భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య ట్రై-సిరీస్ నిర్వహించాలని పీసీబీ ప్రతిపాదించింది. తమ అధికార పరిధిలో ఈ అంశం లేదని పేర్కొంటూ ఐసీసీ ఈ ప్రతిపాదనను కూడా తిరస్కరించింది.

5. 2026లో బంగ్లాదేశ్‌లో భారత్ పర్యటన: 2026లో భారత్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించేలా ఐసీసీ హామీ ఇవ్వాలని పీసీబీ కోరింది. పర్యటనలు అనేవి రెండు బోర్డుల మధ్య జరిగే ద్వైపాక్షిక ఒప్పందాలని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని ఐసీసీ స్పష్టం చేసింది.

Related Articles

Related image1
IND vs NAM : టీమిండియాలో 3 భారీ మార్పులు.. స్టార్ బౌలర్ అవుట్ !
Related image2
T20 World Cup: పాకిస్థాన్ బాయ్‌కాట్ డ్రామాలో బిగ్ ట్విస్ట్.. ఐసీసీ మీటింగ్‌లో ఏం జరిగింది?
36
ప్రధానితో చర్చల తర్వాతే పాక్ తుది ప్రకటన
Image Credit : Instagram / salmanagha247, surya_14kumar

ప్రధానితో చర్చల తర్వాతే పాక్ తుది ప్రకటన

లాహోర్‌లో జరిగిన ఈ సమావేశంలో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, పీసీబీ చైర్మన్ మోసిన్ నక్వీ, బీసీబీ ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం పాల్గొన్నారు. ఐసీసీ తన నిర్ణయాలను స్పష్టం చేసిన తర్వాత, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను సంప్రదించేందుకు పీసీబీ చైర్మన్ మోసిన్ నక్వీ సమయం కోరారు. ఇందుకు ఐసీసీ 24 గంటల గడువు ఇచ్చింది. రాబోయే కొద్ది గంటల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

46
యూటర్న్ తీసుకున్న పాకిస్థాన్?
Image Credit : X/ Rayham, ANI

యూటర్న్ తీసుకున్న పాకిస్థాన్?

ఫిబ్రవరి 15న కొలంబో లో జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్‌ను పాకిస్థాన్ ప్రభుత్వం మొదట బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించింది. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించినందుకు నిరసనగా, సంఘీభావం తెలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. అయితే, తాజా పరిణామాల ప్రకారం పాకిస్థాన్ బోర్డు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 15న జరగాల్సిన గ్రూప్-ఏ మ్యాచ్ యథాతథంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

56
పీసీబీ చైర్మన్ ఏమన్నారంటే?
Image Credit : Getty

పీసీబీ చైర్మన్ ఏమన్నారంటే?

అధికారికంగా యూటర్న్ తీసుకున్నారా అనే ప్రశ్నకు మోసిన్ నక్వీ స్పందిస్తూ.. "బంగ్లాదేశ్ మా సోదర దేశం. వారి విషయంలో మేం రాజీపడలేదు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఐసీసీ, బంగ్లాదేశ్ బోర్డుల నుంచి సమాచారం వచ్చిన వెంటనే మేం పూర్తి వివరాలు వెల్లడిస్తాం" అని పేర్కొన్నారు.

66
అడ్డంగా బుక్కైన పాకిస్థాన్.. ఇండియా దెబ్బకు మైండ్ బ్లాక్.. నేపథ్యం ఏంటి?
Image Credit : stockPhoto

అడ్డంగా బుక్కైన పాకిస్థాన్.. ఇండియా దెబ్బకు మైండ్ బ్లాక్.. నేపథ్యం ఏంటి?

భారత్‌లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు, కేకేఆర్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జట్టు నుంచి తొలగించడం వంటి కారణాలతో బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో మ్యాచ్‌లు ఆడటానికి నిరాకరించింది. తమ మ్యాచ్‌లన్నీ భారత్ వెలుపల నిర్వహించాలని కోరింది. దీనికి ఐసీసీ అంగీకరించకపోవడంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నీలోకి తీసుకున్నారు. దీనికి నిరసనగానే పాకిస్థాన్ తొలుత బాయ్‌కాట్ అస్త్రం ప్రయోగించింది. కానీ ఇప్పుడు ఐసీసీ చర్చల తర్వాత పాక్ మెత్తబడినట్లు స్పష్టమవుతోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Recommended image1
BCCI Central Contracts : డబ్బులు కట్.. గ్రేడ్ కట్.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ ఊహించని దెబ్బ
Recommended image2
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Recommended image3
IND vs NAM : టీమిండియాలో 3 భారీ మార్పులు.. స్టార్ బౌలర్ అవుట్ !
Related Stories
Recommended image1
IND vs NAM : టీమిండియాలో 3 భారీ మార్పులు.. స్టార్ బౌలర్ అవుట్ !
Recommended image2
T20 World Cup: పాకిస్థాన్ బాయ్‌కాట్ డ్రామాలో బిగ్ ట్విస్ట్.. ఐసీసీ మీటింగ్‌లో ఏం జరిగింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved