MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఇదేం అరాచ‌కం సామీ.. 11 సిక్సులు, 7 ఫోర్లు, 32 బంతుల్లోనే సెంచ‌రీ

ఇదేం అరాచ‌కం సామీ.. 11 సిక్సులు, 7 ఫోర్లు, 32 బంతుల్లోనే సెంచ‌రీ

Abhishek sharma: హైద‌రాబాద్‌లో జ‌రుగుతోన్న స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మ‌రో అద్భుతం జ‌రిగింది. కేవ‌లం 32 బంతుల్లోనే సెంచ‌రీ సాధించి క్రికెట్ ప్ర‌పంచం దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్నాడు యంగ్ ప్లేయ‌ర్ అభిషేక్ శ‌ర్మ‌. 

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 30 2025, 10:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
32 బంతుల్లో శతకం
Image Credit : Getty

32 బంతుల్లో శతకం

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT 2025)లో పంజాబ్ కెప్టెన్‌గా తిరిగి వచ్చిన అభిషేక్ శర్మ, బెంగాల్ బౌలర్లపై అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్ జిమ్‌ఖానా మైదానంలో ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లో శతకం సాధించి ప్రేక్షకులను ఆశ్చ‌ర్యానికి గురిచేశాడు.

24
12 బంతుల్లో హాఫ్ సెంచరీ
Image Credit : X/SunRisers

12 బంతుల్లో హాఫ్ సెంచరీ

అభిషేక్ మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడాడు. మొదటి 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సంచ‌ల‌నం సృష్టించాడు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, హాఫ్ సెంచరీ పూర్తి చేసినప్పుడు అతని 51 పరుగుల్లో 50 బౌండరీలే కావ‌డం. ఆ సమయంలో 5 సిక్సులు, 5 ఫోర్లు కొట్టి బెంగాల్ బౌలర్లకు ముప్పుతిప్ప‌లు పెట్టాడు. మొహమ్మద్ షమీ ఓవర్‌లో ఒంటరిగా 23 పరుగులు తీశాడు.

Related Articles

Related image1
శని ప్రత్యక్ష గ‌మ‌నం ప్రారంభం.. ఈ 3 రాశుల వారి క‌ష్టాల‌న్నీ ఫ‌స‌క్‌, ఇక అన్నీ మంచి రోజులే
Related image2
ఇంటి నుంచే ఆధార్‌లో మొబైల్ నెంబ‌ర్ మార్చుకోవ‌చ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
34
11 సిక్సులు, 7 ఫోర్లు
Image Credit : instagram/abhisheksharma_4

11 సిక్సులు, 7 ఫోర్లు

అభిషేక్ 32 బంతుల్లో శతకం పూర్తి చేసే స‌మ‌యానికి 11 సిక్సులు, 7 ఫోర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతను తన 8వ T20 సెంచరీ నమోదు చేశాడు. ఇదే సంఖ్యలో సెంచరీలు ఉన్న రోహిత్ శర్మను చేరుకున్నాడు. భారత ఆటగాళ్లలో ఎక్కువ T20 సెంచరీలు ఉన్నవారిలో కోహ్లీ (9) మాత్రమే అతని ముందున్నాడు. గత ఏడాది కూడా అభిషేక్ 28 బంతుల్లో సెంచరీ బాది, భారత ఆటగాళ్లలో వేగవంతమైన T20 సెంచరీ రికార్డును సమం చేశాడు. అదే ఏడాది అతడు 87 సిక్సులు బాదాడు. ఒక సంవత్సరంలో భారత ఆటగాళ్లలో ఇదే అత్యధికం.

44
అత్యంత వేగమైన T20 హాఫ్ సెంచరీల జాబితా
Image Credit : X/BCCI

అత్యంత వేగమైన T20 హాఫ్ సెంచరీల జాబితా

* దిపేంద్ర సింగ్ ఐరీ నేపాల్ vs మంగోలియా మ్యాచ్‌లో కేవ‌లం 9 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ చేశాడు.

* ఆశుతోష్ శర్మ రైల్వేస్ vs అరుణాచల్ మ్యాచ్‌లో కేవ‌లం 11 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ చేశాడు.

* అభిషేక్ శర్మ 12 బంతుల్లో పంజాబ్ vs బెంగాల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీ చేశాడు.

* డర్బన్‌లో జ‌రిగిన భారత్ vs ఇంగ్లాండ్ మ్యాచ్‌లో యువ‌రాజ్ సింగ్ 12 బంతుల్లో అర్థ శ‌త‌కం చేశాడు.

* రెనిగేడ్స్ vs స్ట్రైకర్స్ మ్యాచ్‌లో గేల్ 12 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేశాడు.

* కాబుల్ vs బల్ఖ్ మ్యాచ్‌లో హజ్రతుల్లా జజై 12 బాల్స్‌లో హాఫ్ సెంచ‌రీ చేశాడు.

* ఎస్టోనియా vs సైప్రస్ మ్యాచ్‌లో సహిల్ చౌహాన్ 12 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేశాడు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
క్రీడలు
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 నుంచి స్టార్ ఆల్‌రౌండర్లు ఔట్.. బ్రేస్‌వెల్, హసరంగకు ఏమైంది?
Recommended image2
T20 World Cup 2026 : సంజూ కు ఛాన్స్.. బుమ్రా ఈజ్ బ్యాక్.. కానీ గంభీర్ టెన్షన్ తగ్గట్లేదు
Recommended image3
Abhishek Sharma : టీమిండియాకు బిగ్ షాక్.. నమీబియాతో మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ దూరం?
Related Stories
Recommended image1
శని ప్రత్యక్ష గ‌మ‌నం ప్రారంభం.. ఈ 3 రాశుల వారి క‌ష్టాల‌న్నీ ఫ‌స‌క్‌, ఇక అన్నీ మంచి రోజులే
Recommended image2
ఇంటి నుంచే ఆధార్‌లో మొబైల్ నెంబ‌ర్ మార్చుకోవ‌చ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved