MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • T20 World Cup 2026 నుంచి స్టార్ ఆల్‌రౌండర్లు ఔట్.. బ్రేస్‌వెల్, హసరంగకు ఏమైంది?

T20 World Cup 2026 నుంచి స్టార్ ఆల్‌రౌండర్లు ఔట్.. బ్రేస్‌వెల్, హసరంగకు ఏమైంది?

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 నుంచి ఇద్దరు స్టార్లు ఔట్ అయ్యారు. శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ, కివీస్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ గాయాల కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. వీరి స్థానంలో దుషన్ హేమంత, కోల్ జట్లలోకి వచ్చారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 10 2026, 11:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీ20 ప్రపంచకప్‌లో ఇద్దరు దిగ్గజాలు అవుట్.. అభిమానులకు షాకింగ్ అప్‌డేట్
Image Credit : Getty

టీ20 ప్రపంచకప్‌లో ఇద్దరు దిగ్గజాలు అవుట్.. అభిమానులకు షాకింగ్ అప్‌డేట్

ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక, న్యూజిలాండ్ జట్లకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆయా జట్ల కీలక ఆల్‌రౌండర్లు వనిందు హసరంగ, మైకేల్ బ్రేస్‌వెల్ గాయాల బారిన పడి టోర్నీ నుంచి ఔట్ అయ్యారు. మంగళవారం ఈ విషయాన్ని ఐసీసీ ఈవెంట్ టెక్నికల్ కమిటీ అధికారికంగా ధృవీకరించింది. హసరంగ స్థానంలో దుషన్ హేమంతను, బ్రేస్‌వెల్ స్థానంలో కోల్ మెక్కాన్చీని రీప్లేస్‌మెంట్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు.

25
హసరంగ గాయం ఏమిటి?
Image Credit : Getty

హసరంగ గాయం ఏమిటి?

శ్రీలంక స్టార్ లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ ఆదివారం కొలంబోలో ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో అతను అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. అయితే, ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతని ఎడమ కాలి తొడ కండరానికి గాయమైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత నొప్పి తీవ్రత పెరగడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు.

సోమవారం నిర్వహించిన ఎంఆర్ఐ స్కాన్‌లో హసరంగ కండరం తీవ్రంగా చిరిగినట్లు తేలింది. యూకే నిపుణులు ఈ రిపోర్టులను పరిశీలించారు. కనీసం నాలుగు వారాల పాటు హసరంగ విశ్రాంతి తీసుకోవాలని వారు సూచించారు. దీంతో స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీ నుంచి హసరంగ అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది.

Related Articles

Related image1
Abhishek Sharma : టీమిండియాకు బిగ్ షాక్.. నమీబియాతో మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ దూరం?
Related image2
T20 World Cup 2026 : సంజూ కు ఛాన్స్.. బుమ్రా ఈజ్ బ్యాక్.. కానీ గంభీర్ టెన్షన్ తగ్గట్లేదు
35
బ్రేస్‌వెల్ గాయం పరిస్థితి ఏమిటి?
Image Credit : Instagram

బ్రేస్‌వెల్ గాయం పరిస్థితి ఏమిటి?

న్యూజిలాండ్ ఆటగాడు మైకేల్ బ్రేస్‌వెల్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గత నెలలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్ సమయంలోనే బ్రేస్‌వెల్ ఎడమ కాలి మడమ గాయానికి గురయ్యాడు. దీని నుంచి కోలుకుని వరల్డ్ కప్‌కు వచ్చిన అతను, ఆదివారం చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు వార్మప్ సెషన్‌లో మళ్ళీ అదే చోట గాయపడ్డాడు.

స్కాన్ రిపోర్టుల ప్రకారం, బ్రేస్‌వెల్ కోలుకోవడానికి మరో మూడు వారాల సమయం పడుతుందని తేలింది. దీంతో కివీస్ మేనేజ్‌మెంట్ అతడిని టోర్నీ నుంచి తప్పించి, ఆల్‌రౌండర్ కోల్ మెక్కాన్చీని భారత పర్యటనకు పంపాలని నిర్ణయించింది. మెక్కాన్చీతో పాటు పేసర్ బెన్ సియర్స్ కూడా ట్రావెలింగ్ రిజర్వ్‌గా జట్టుతో చేరుతాడు.

45
రీప్లేస్‌మెంట్ ప్లేయర్ల వివరాలు ఇవే
Image Credit : Instagram

రీప్లేస్‌మెంట్ ప్లేయర్ల వివరాలు ఇవే

ఐసీసీ ఈవెంట్ టెక్నికల్ కమిటీ (ETC) ఈ మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హసరంగ స్థానంలో వచ్చే దుషన్ హేమంత ఇప్పటివరకు శ్రీలంక తరపున ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడాడు. అతను కూడా లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్ కావడంతో జట్టు సమతుల్యత దెబ్బతినదని లంక భావిస్తోంది. ఇక న్యూజిలాండ్ తరపున వచ్చే కోల్ మెక్కాన్చీ ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా జట్టుకు సేవలందించనున్నాడు.

55
తదుపరి మ్యాచ్‌లు ఇవే
Image Credit : Getty

తదుపరి మ్యాచ్‌లు ఇవే

శ్రీలంక జట్టు తన తదుపరి గ్రూప్-బి మ్యాచ్‌ను ఫిబ్రవరి 12న పల్లెకెలెలో ఒమన్‌తో ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 16న బలమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు శనివారం అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో కీలక మ్యాచ్‌లో తలపడాల్సి ఉంది. కీలక దశలో ఈ స్టార్ ప్లేయర్లు దూరం కావడం ఆయా జట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
క్రీడలు
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : సంజూ కు ఛాన్స్.. బుమ్రా ఈజ్ బ్యాక్.. కానీ గంభీర్ టెన్షన్ తగ్గట్లేదు
Recommended image2
Abhishek Sharma : టీమిండియాకు బిగ్ షాక్.. నమీబియాతో మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ దూరం?
Recommended image3
Arjun Tendulkar Wedding : అర్జున్ టెండూల్కర్ పెళ్లి.. మోదీ ఇంటికి సచిన్.. డేట్, వెన్యూ డీటెయిల్స్ ఇవే
Related Stories
Recommended image1
Abhishek Sharma : టీమిండియాకు బిగ్ షాక్.. నమీబియాతో మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ దూరం?
Recommended image2
T20 World Cup 2026 : సంజూ కు ఛాన్స్.. బుమ్రా ఈజ్ బ్యాక్.. కానీ గంభీర్ టెన్షన్ తగ్గట్లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved